Sunday, 29 Nov, 2026

అత్తారిళ్ళల్లోనే మరణాలు ఎక్కువ.

మహిళలపై దాడులు మన దేశం లోనే చాలా ఎక్కువ అని రిపోర్ట్ అమెరికాలోని వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నుంచి భారతీయ సంతతికి చెందిన పరిశోధనకురాలు మోహినీ దాసరి చేసిన ఒక పరిశోధన రిపోర్టు లో ప్రపంచ వ్యాప్తంగా చూటు చేసుకునే మరణాలకి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఎత్తయిన ప్రదేశాల నుంచి కింద పడిపోయి, రోడ్డు ప్రమాదాలు, చివరికి బౌతికదాడి. ఈ బౌతిక దాడులు జరిగితే అమెరికాలోని అయితే ఎక్కువ మంది ప్రాణాలతో బయట పడితే భారత్ […]

పనీ ఆరోగ్యం రెండూ ముఖ్యమే.

నీహారికా, ఆడవాళ్ళు చేసే ఒకే ఒక్క పొరపాటు ఎంతో తీవ్రమైన పని వత్తిడిని ఎదుర్కుంటూ కుడా తమ సొంత ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం. పోషకాహార లోపం వల్ల శరీరం బలహీనమై పోతుంది. ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్తితుల్లోనూ వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా చాలా అవసరం. ఇన్ని గంటలు నిద్ర పోయినప్పుడే  ఉదయం ఆఫీసుకు వచ్చే ముందు అల్పాహారం, మద్యాహ్నం భోజనం ఎటువంటి పరిస్ధితుల్లోను వదలకూడదు. అలాగే విశ్రాంతి కుడా […]

ఫ్రూట్ జ్యూస్, అవిసె గింజలే చాలు.

లీజీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆ ప్రచారానికి  తగిన శరీర సౌష్టవం తో చాలా అందంగా వుంటుంది. ఆమె సౌందర్య రహస్యం ఓ స్పూన్ యాపిల్ సైడర్ కపుపుకున్న ఓ గ్లాసు నీళ్ళతో రోజును ఆరంభిస్తు, కేవలం పండ్ల రసాల పైనే దృష్టి పెట్టడం అంటుందామె. యాపిల్ సైడర్ ఉదయాన్నే  క్లియర్ చేసి చర్మం కంటి వంతంగా ఉంచుతుంది. తాజా పండ్ల రసాలు ముఖ్యంగా కలె జ్యూస్ చర్మం పై అద్భుతాలు […]

యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ వేస్ట్.

యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ తీసుకున్నా సరే కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ హుషారు తగ్గుతూ అలసట కమ్మేస్తూ వుంటుంది. దీన్ని సహజ సిద్ధంగా ఎలాంటి సప్లిమెంట్లు తీసుకోకుండా రీచార్జ్ చేసుకోవాలి. తక్కువ ఐరన్ వుందని ఖచ్చితంగా డాక్టర్ సలహా ఇస్తేనే తప్ప ఐరన్ సప్లిమెంట్స్ వద్దు అదనంగా విటమిన్ తీసుకున్నా కణాలు సూపర్ చార్జ్ అవవు. ఎక్కువసేపు శరీరానికి శక్తి ఇచ్చే పదార్ధాలే తీసుకోవాలి. షుగర్, బెకరీ ఐటమ్స్ ఎక్కువ కేలరీలు పోగు చేసి ఇబ్బంది తెస్తాయి. […]

పోషక విల్వలున్న సోయా.

చాలా మంది మాంసం తినరు. వట్టి షాకాహారం  తో పోషకాలు అందటం లేదేమోనన్న అనుమానం తొలిచేస్తూ వుంటుంది. పశు మాంసం, పాలిష్ పట్టని బియ్యం, గోధుమలు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోయా తీసుకోండి. ఆరోగ్యం భర్తీ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు బరువు తగ్గే ప్రయత్నంలో వున్న అదనంగా శారీరక శ్రమ చేస్తున్న ఆ సమయంలో ప్రోటీన్స్ కోసం సోయా తీసుకుంటే చాలు అంటున్నారు. సోయా మాంసానికి ప్రత్యామ్నాయమని ఇప్పటికే ప్రచారం. అది కాకున్నా సోయా ద్వారా నాణ్యమైన […]

ఏకాగ్రత తగ్గుతుంది.

ఒక సర్వే రిపోర్టు చూడండి. 2000 సంవత్సరంలో ఏకాగ్రత విషయంలో ఒక సర్వే చేస్తే ఒక విషయంలో ద్రుష్టి కేంద్రీకరించటం 12 సెకెంన్లుగా వుంటే ఈ సంవత్సరం 8 సెకెన్లకు కిందికి దిగింది. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ఎలక్ట్రోనిక్ యుగంలో వందలాది గాడ్జెట్స్ వినియోగం ఏకాగ్రతను దెబ్బతిస్తున్నాయని ఆ వ్యసనం దృష్టిని కేందీకరించే శక్తిని మనం నుంచి దూరం చేస్తున్నాయని రిపోర్టు. కంటి చూపు తగ్గుతుంది. వినికిడి తగ్గుతుంది. వెన్నుముక్క బలహీనం అవుతుంది. సోషల్ మీడియా […]

ఇదీ వారసత్వ ప్రభుత్వమే.

కొందరు తెల్లారుతూనే లేచిపోతారు. మరి కొందరు ఎంత పొద్దెక్కినా లెవరు. ఒక వేళ అలా లేచినా నిద్ర చాలదనో, నీరసంగా ఉందనో డల్ గా మొహం పెట్టేస్తారు. ఇందుకు ఇలా త్వరగా ఆలస్యంగా నిద్ర అలవాటు అంటే జీన్స్ అంటున్నారు పరిశోధకులు. ఆలస్యంగా నిద్ర లేవటాన్ని  కుడా జీన్స్ ప్రభావితం చేస్తాయి అంటున్నారు. ఈ పరిశోధన ఈ దిశగా కొనసాగించారు. శాస్త్రీయంగా మనం శరీరాల్లో అంతర్గత సర్కిడియన్ క్లాడ్స్ ఉంటాయి. ఇవి హిపాధల మస్ వద్ద వేలాడి […]

అలోవీరా జ్యూస్ బెస్ట్.

ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ చాలా మందికి అలవాటు. రన్నింగ్ వర్కఉతస్ చేసాక ఓ లాంటి ఎసిడిటీ అనిపిస్తూ వుంటుంది. ఇది ఎనర్జీ డ్రింక్ ల కారణమా అని ఓ ఆలోచన వస్తు వుంటుంది. పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే ఎనర్జీ జేల్స్ కార్బోహైడ్రేడ్స్ ఆధారం కనుక ఎసిడిటీ ని కలిగించవు. బహుశా కాఫీ తాగడం వల్ల ఉదరం లైనింగ్ ను ఇరిటేట్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేసారు. అంచేత ఉదయాన్నే రన్నింగ్ కు ముందు అరటి పండు […]

గుడ్ మూడ్ కోసం.

ఒక్కోసారి మూడ్ బావుండదు. ఏ పని చేయాలని అనిపించక ఏదీ తోచక ఒక డిప్రెషన్ చుట్టూ ముట్టేస్తూ వుంటుంది సరే ఇలా వుండా అయితే ఇలాంటి సమయాల్లో ఆకు పచ్చ ఎరుపు, నారింజ రంగులో గల పండ్లు, కూరగాయలు రోజుకు ఐదారు సార్లు అయినా తింటే ఆశావాదం, సంతోషం, ఆత్మస్దయిర్యం దీన్నయినా ఎదుర్కోగల ధైర్యం అత్యధిక స్ధాయిలో ఉంటాయిట. ఇందుకు కారణం ఈ రగుల పండ్లు, కురగాయాల్లో వుండే యాంటీ అక్సిడెంట్స్ ఒక చిన్ని యాపిల్ ముక్క […]

ఇది జుట్టును మెరిపిస్తుంది.

గ్రీన్ టీ ఆరోగ్యం ఇస్తుంది కానీ ఈ టీ పొడి వల్ల సిరోజాల సంబందిత సమస్యల్ని పరిష్కరించుకోవచ్చ అంటున్నాయి అద్యాయినాలు. జుట్టు సిల్కీగా షైనీగా ఉండాలంటే  ఈ టీ పొడిలో పెరుగు గుడ్డు కలిపి కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల దాకా అప్లయ్ చేస్తే చాలు. ఓ అరగంట తర్వత తలస్నానం చేయొచ్చు. అలాగే షాంపూ తర్వాత హెయిర్ కండీషనర్ బదులుగా ఈ గ్రీన్ టీ డికాషన్ ను వాడితే ఇది శిరోజాలకు మంచి స్తిమ్యులేటర్ గా […]

పండు లాగే తోలు కూడా.

కొన్ని పండ్లే కాదు, వాటి పైన వుండే తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్, నిమ్మ తొక్కలు చర్మానికి చేసే మేలు గురించి మనకు తెలుసు. ఇప్పుడు బొప్పాయి పై తొక్కలు పారేయకండి. ఆ పై తోలుతో చర్మం కాంతివంతంగా తాజాగా అయిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండు ఎర్రర్రగా నిగనిగలాడుతూ నొరూరించి నట్లే పై తోలులో వుండే ఎంజైములు చర్మాన్ని సూర్య రశ్మి నుంచి కాపాడి వయస్సు రిత్యా ఏర్పడిన మచ్చల్ని తొలగిస్తాయి. ముఖం శుభ్రంగా […]

వాళ్ళు హేతు బద్దంగా ఆలోచిస్తారు.

నీహరికా, ఒక చక్కని  రిపోర్ట్. పెద్ద వాళ్ళ మాదిరిగానే పిల్లలలో కూడా తగునైన శక్తి సామర్థ్యాలు, హేతు బద్దత, గౌరవం ఎక్కువగానే ఉంటాయంట. నాలుగు నుంచి పది సవత్సరాల లోపు పిల్లలపై చేసిన ఒక అద్యయనం లో వాళ్లకి కొన్ని పరీక్షలు పెట్టారు. అప్పుడు ఆ పరీక్షల్లో కొన్ని తేలికగా ఉన్నాయని అవి పరీక్షలే కాదని పిల్లలు తేల్చారట. అలాగే కొన్ని వైపల్యలుకు పెద్దవాళ్ళ లాగే పిల్లలు నోచ్చుకున్నారు. కష్టమైన పని కన్నా, చిన్న పని సక్సెస్ కాలేనప్పుడు […]

తాంబూలం అలవాటు వుందా?

భోజనం చేయగానే తాంబూలం వేసుకునే అలవాటు ఇప్పుడు ఎంత మందికి వున్నాడో అసలు రైస్ తినడం మానేసి రెండు పుల్కాలు కురతో సరి పెట్టు కునే రోజుల్లో తమలపాకులు ఎంత మంది ఫ్రిజుల్లో వున్నాయి. సరే వున్నా లేకున్నా తమ్మల పాకుల్లో ఔషధ విలువలు తెలుసుకున్నాక కొందరయినా తాంబూలం వేసుకుంటారేమో. దీన్ని నాగవల్లి అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ధైమిన్ నియాసిన్, రెబోఫ్లెవిన్, కెరోటిన్ వంటి వితమిన్లతో పాటు కాల్షియం కుడా సమృద్దిగా దొరుకుతుంది. మధుమేహం […]

కొత్తగా మెరిసిపోతాయి.

ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు ఎప్పుడు కొత్తదనంతో ఉండాలన్నా ఫ్రెష్నెస్ తో శుబ్రంగా వుండాలన్నా కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు స్కూల్ కు వెళ్ళే పిల్లల నీళ్ళ సీసాలు వాసన వస్తు ఉంటాయి. రెండు స్పూన్లు వంట షోడా గోరు వెచ్చని నీళ్ళు పోసి గంట సేపు అలా వదిలేసి శుబ్రం చేస్తే వాసన పోతాయి ఇంట్లో డేకోరేషన్  కోసం ఎన్నూ ఇత్తడి ఆర్టికల్స్ పెడతారు. అలాగే నీళ్ళు నింపి పువ్వులు వేసే ఇత్తడి పళ్ళాలు […]

ఇది దివ్య ఔషధం.

హెల్త్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంటే ప్రక్రుతి సిద్ధంగా దొరికే చెరుకు రసం ఎంతో ఆరోగ్యమని, క్రీడాకారులు కనుక చెరుకు రసం తాగితే వారిలో డీహైడ్రేషన్ బావున్నట్లు పరిశోధకులు చెప్పుతున్నారు. చెరుకు రసం లో వున్న ఫెనోలిక్స్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల తో సమానంగా పనిచేస్తాయి. అవి పెరోక్ సైల్ ప్రీ రాడికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకురసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లోంచి ప్రీ రాదికల్స్ ను శరీరం […]

మోడ్రన్ లుక్ వచ్చేస్తుంది.

సింపుల్ గా ఉండే ఫ్యాషన్ కానీ సింపుల్ గానూ, మరింత ఫ్యాషన్ పోకడ తోనూ ఉండాలంటే మేడలో ఓ స్కార్ఫ్ చుడితే బావుంటుంది. రంగు రంగు స్కార్ఫు చుడితే బావుంటుంది. రంగు స్కార్ఫులు ఇప్పుడులేటెస్ట్ ట్రెండ్. ఎలాంటి సాదా సీదా డ్రెస్సు కైనా కొత్త లుక్ తెప్పించాలంటే చక్కని స్కార్ఫులు చాలానే వున్నాయి. అందమైన పీచ్, మెరూన్ సీ బ్లూ కలర్స్లో చక్కని పువ్వుల డిజైన్స్, సిల్క్ వెరైటీలు వింటర్ ఫ్యాషన్స్ నెక్ స్కార్ఫ్ ఇలా ఎన్నో […]

పాదాలను పట్టించుకోండి.

అందం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే మహిళలు పాదాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పగుళ్ళతో, మట్టి పేరుకుని ఎంత నీట్ గా తయారయినా దుస్తుల నడుమ నుంచి, సమస్య మరీ ఎక్కువగా వుంటుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా క్లీనింగ్, మాయిశ్చురైజింగ్ చేసుకుంటే పొడి బారిన పగిలిన పాదాలు మృదువుగా తయ్యారావ్వుతాయి. ముందుగా ఒక స్పూన్ వేజివైన్ నిమ్మకాయ రసం కలిపినా నీళ్ళతో పడుకునే ముందర పాదాలు నానేలా పెట్టుకోవాలి. పాదాలు కడుక్కొన్నాక ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ […]

ఉదయం వేళ తినడమే బెస్ట్.

భోజనాన్ని ఉదయం చక్ర వర్తి స్ధాయిలో, మధ్యాహ్నం మహారాజు లెవెల్లో, ఇక సాయంత్రం నిరుపేద మాదిరిగా చేస్తే అరోగం అని పూర్వికులు చెప్పేవాళ్ళు. ఇదసలు మంచిదే కాదని కొట్టి పారేస్తున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఉదయం పూట తీసుకునే ఆహారం సరే విందు భోజనం లాగాను , మధ్యాహ్నం భోజనం మితంగాను ఇక రాత్రి తిన్నాను అంటే తిన్నాను అనిపించుకొండి అదే ఆరోగ్యం అంటున్నారు. ఎందుకంటే జీర్ణ క్రియతో పాటు పిండి పదార్ధాలను నిల్వ చేయడం లో […]

పోకిరీలు వెంటాడారు.

బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఇలియానా ఈ మద్య తాను ఆకతాయిల వేదింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో ఫైరయిపోయింది. ఈ మద్య లక్నోప్యాషన్ వీక్ పాల్గొని ఇంటికి బయలు దేరాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. అప్పుడు ఆరుగురు యువకులు కారులో ఉన్న నన్ను గుర్తించి ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు. అద్దాలు కొట్టారు. ఒకడు ఏకంగా బానేట్ ఎక్కి కూర్చున్నాడు. ఎంతో షాక్ అయ్యాను. ఎలా తప్పించుకోవటమో తప్ప నాకు వేరే ఆలోచన రాలేదు. […]

మాత్రలు నీళ్ళతోనే బెస్ట్.

తియ్య తియ్యని ఆహార పదార్ధాలు భోంచేసినట్లు ఏదైనా అనారోగ్యం వస్తే ఓ చిన్ని టాబ్లెట్ వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు కొందరు. ఏదైనా అరటి పండులో పెట్టేసి పిల్లల చేత మాత్రలు మింగించేస్తారు. చెడు తగలకుండా ఏ పంచదారో చేత్తో పట్టుకుని  టాబ్లెట్ మింగిస్తారు. ఇవేవీ సరికాదు, టాబ్లెట్ ని నీళ్ళతో మాత్రమే వేసుకోండి అంటున్నారు డాక్టర్లు. కాఫీ, టీలతో వేసుకుంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. ఉదాహరణకు అస్తమా వంటి అనారోగ్యాలకు వాడే టాబ్లెట్ల […]