Sunday, 29 Nov, 2026

అందమైన రంగోలీలు.

ఇంటి వాకిట్లో కళ్ళాపుజల్లి ముగ్గులు వేస్తె ఆ ఇంటి ముందర మహాలక్ష్మి కొలువు దీరుతుందని పూర్వం నమ్మకం. ఇప్పుడా విశాలమైన వాకిళ్ళు లేవు. ముగ్గుపిండి తో ముగ్గులు లేవు. అపార్ట్ మెంట్ ఇళ్ళ ముందు ముగ్గుల స్టిక్కర్స్  వచ్చాయి.  వాకిటి ముందు ముగ్గుల స్తిక్కర్స్ వచ్చాయి. వాకిటి ముందు అతికించిన ఇంట్లో హాల్లో అతికించి దీని పైన పూవులతో నిండిన పాత్రలు పెట్టిన ఇంటికి హాలుకి కొత్త అందం వచ్చినట్లే మామిడి పిందెలు, సింపుల్ సర్కిల్స్, ఎర్రని, […]

వాళ్ళు ఎదురు తిరిగితే.

నీహారికా, పిల్లల్ని తీర్చి దిద్దాలనీ, ప్రపంచం వాళ్ళని విస్తుపోయి చూడాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. ఈ కోరికతో పిల్లలపై ఎంతో భారాన్ని మోపుతున్నారు. వాల్లపైన పెట్టె హద్దులు ప్రతి ఇంట్లోను కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు టీవీ చూడకూడదు, నిమిషం వృధా చేయకూడదు, నూరు మార్కులకు ఒక్కటి కూడా తగ్గకూడదు. నిమిష నిముషం పక్కింటి పిల్లలతో పోలిక తీసుకు వస్తూ వాళ్ళపైన మితిమీరిన ఆంక్షలు పెడుతూ ఉండటం చూస్తున్నాం. దీనివల్ల లాభం కంటే, వాళ్ళ మంచి పేరుల కంటే […]

రోజుకో కప్పు తో అందమే అందం.

కప్పు టీ తో బద్ధకం ఎగిరి పోతుంది. బోలెడంత ఉత్సాహం వస్తుంది. కప్పుల కొద్దీ టీలు తాగి జీవితం గడిపేయవచ్చుననే  టీ ప్రేమికులు కుడా వుంటారు. కానీ ఈ టీ తాగితే అందాల సుందరి అయిపోవచ్చు. పట్టులగా చర్మం నునుపెక్కి చెక్కిన శిల్పంలాగా అయిపోవచ్చట. దీని పేరు వైట్ టీ. పేరులో వైట్ ఉన్నంత మాత్రాన తెల్లగా వుండదు లేత పసుపు రంగులో మెరిసిపోతూ వుంటుంది. లేత తేయాకు చిగుళ్ళతో తేయాకు మొగ్గలతో తయ్యారు చేస్తారు దీన్ని. […]

హాయిగా ఆవులించండి.

ఆవులింత వస్తే బావుండదని నూటికి చెఇ అడ్డం పెట్టుకుంటాం అలా చేయకండి. నోరుదాకా అవిలిస్తే మేదంతా హాయిగా చల్లబడి సీదతీరుతుందని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు నిద్ర లేవడం, అలసట, విసుగు, రక్తంలో ఆక్సిజన్ స్ధాయి తగ్గిపోవడం ఇవన్నీ ఆవులింతకు కారణాలు అనుకుంతున్నారు కానీ కొత్త అధ్యాయినం మరో విషయాన్ని చెప్పుతుంది మనం తీసుకునే కాలరీల్లో మూడో వంతు మెదడు ఖర్చు చేస్తుంది. దీని వల్ల విపరీతమైన వేడి ఉత్పత్తు అవుతుంది. ఆవులింతలు వల్ల నిద్ర పెరగదనీ […]

ఏడవడం వల్లనూ ఆరోగ్యం.

పాతకాలం సినిమాల్లో ఏడుపు సీన్లు ఎన్నో ఉండేవి. ప్రేక్షకులు కుడా యధా శక్తి కన్నీళ్ళు పెట్టుకుని సినిమాను వంద రోజులు ఆడించేవారు. అది సినిమా వరకే నిజ జీవితంలో ఏడవడం ఎవళ్ళు ఇష్టపడని సబ్జెక్ట్. నిబ్బరంగా వుండాలని కన్నీళ్ళను ముని పంటి తో నొక్కి అపుకోవాలని పాఠాలు వింటాం కానీ ఏడుపు బాధ తేవ్రతనిఉ తగ్గిస్తుంది అంటున్నాయి రిపోర్ట్స్. ఒక అద్యాయినం ప్రకారం కన్నీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయి. శరీరం లోని విశాతుల్యాలని తొలగించి స్వస్థత చెందేందుకు […]

మందుల కంటే ఆహారం మార్చండి.

కాస్త దూరం నడిచినా అలసట అనిపించినా మగతగా వున్నా కాసేపు నడిచేసరికి విశ్రాంతి తీసుకోవాలని కాసేపు నిలబడి ఊపిరి పీల్చాలని అనిపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినట్లు తెలుసుకోమ్మంటున్నారు వైద్యులు. మందుల సంగతి అలా వుంచి హిమోగ్లోబిన్ పెంచుకోవాలి అంటే తాజా నెయ్యి, నెయ్యి తో చేసిన పదార్ధాలు తియ్యని పండ్లు పాలు, కూరగాయల సలాడ్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. క్యారెట్ కుడా హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది. భోజనం తర్వాత రెండు పండిన అరటి పండ్లు, […]

సీల్ చేస్తే ఫ్రెష్ గా ఉంటాయ్.

ఇది వరకేన్నడో నేత్తో అరిసెలు, బూరెలు, చేక్కిరాలు వగైరాలు చేసి కనీసం నెలయినా నిల్వ ఉండేలా దాచేవాళ్ళు. అప్పుడు స్వగృహ ఫుడ్స్ లేవు కదా. ఇప్పుడు అన్నీ వండుకోవడం  మిగిలినవి దాచుకోవడం  కుడా కష్టమైపోతుంది. కూరగాయలు వారానికి ఒక్క సారి కొనుక్కొస్తే వారాంతంలో వాడిపోయి, ఎండిపోయి, ఫ్రిజ్లోకుడా తాజాగా వుండవు. ఇక ఆకు కూరలు తినుబండారాలు బాధ్రపరచడం చాలా కష్టం. వ్యక్యుమ్ సీలింగ్ సిస్టం ద్వారా ఆ పదార్ధాలు కూరలు, ఆకులూ సీల్ చేసి ఎక్కువకాలం నిల్వ […]

కళ్ళు చెదిరే హాట్ ఫ్యాషన్.

అందమైన పువ్వులు, ఎగిరే సీతాకోక చిలుకలు, పచ్చని ప్రక్రుతి ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి. పువ్వుల్ని తలలో అలంకరించూ కోవడం గొప్పేమీ కాదు కానీ సీతాకోక చిలుకల్ని అలంకరించుకుంటే ఎలా వుంటుంది. సందేహం ఎన్దూ బటర్ ఫ్లై హాట్ లు ఇమేజస్ చూడండి. చక్కని పట్టు తో అచ్చమైన సీతాకోక చిలుకల్ని చేసి చైనా అమ్మాయిలు అలంకరించు కుంటున్నారు. హ్యాట్స్ కు రిబ్బన్లు పూలు చూసే ఉంటారు. ఇప్పుడు ఏకంగా కళ్ళు చెదిరే రంగుల్లో తేలికైన రంగుల్లోనూ తలనిండుగా […]

గెధ్స్ షణ్ముగంకు మెగసేసె అవార్డ్.

2017 కు ప్రతిష్టాత్మక మెగసేసెపురస్కారాన్ని శ్రీలంకా కు చెందిన గెధ్స్ షణ్ముగం  అందుకున్నారు. శ్రీలంకా   తమిళ వర్గానికి  చెందిన గెధ్స్ అధ్యాపకురాలు శ్రీలంకను మూడు దశాబ్దాల   పాటు  క్షోభకు గురిచేసిన బాధితులకు ఆమె స్వాతన కలిగించేందుకు విశ్రాంతిలేకుండా కౌన్సెలింగ్ చేసారు. పోరాటాలలో నలిగిపోయిన చిన్న పిల్లల్లో   ఆత్మ విస్వాశాన్ని కలిగించేందుకు గెధ్స్ ఎంతో కృషి చేసారు.  యుర్ధంలో    నిరాశ్రయులైన వారిలో  స్ధైర్యాన్ని నిలిపేందుకు గానూ ఆమెను ఈ అవార్డు వరించింది.  ఆగష్టు 31 వ  తేదీన […]

తోరణాలు ఒక ఆర్టే.

శుభకార్యం అనగానే ఇంటికి మామిడి మండల తోరణాలు కట్టేవారు. పెళ్లి వేడుక  కయితే కొబ్బరాకుల పందిరి గడప గడపకు పసుపు కుంకాలు, మామిడి మండల తోరణాల తో సగం పెళ్లి కళ వచ్చేసింది. ఇప్పుడు పందిళ్ళు లేవు షామియానాలే. సిల్క్ కర్టెన్లు తో కొత్త అందం తెస్తున్నారు. అందమైన పూల మాలలు సర్వ రెండు రోజుల పాటు వాడకుండా చక్కగా వేడుకకు అందం తేవాలంటే ఓ సారి తోరన్ వీడియోస్ యాస్ చూడండి సాటిన్ రిబ్బన్ లు […]

సంప్రదాయానికి ఫ్యాషన్ టబ్.

ఎలాంటి వేడుకకు, పండగ సంధర్భాలకు అమ్మాయిలకు గాగ్రాను మించిన డ్రెస్ కనిపించదు. చక్కని లంగాలు కష్ట గాగ్రాలు అయిపోయి సంప్రదాయానికి ఆధునికతా తోడై ఇప్పుడొస్తున్న డిజైనర్ గాగ్రాల అందం మాటల్లో వర్ణించలేనంతగా  బావుంటున్నాయి సీకోలు, బ్రోకెడ్ లెహంగాలకు మాచింగ్ గా నెట్ దుపట్టాలు, ఎంబ్రాయిడరీ బ్లావుజులు జోడిస్తే గాగ్రాలు, వేడుకల్లో మెరిసిపోవచ్చు.  సీకో గాగ్రాల పై ప్రింట్స్ అందం అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ డిజైనర్స్ సృష్టించిన అద్భుతమైన గాగ్రాల అందాలు ఇమేజస్ లో ఒక సారి […]

ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి.

నీహారికా, చాలా మందిని చూస్తుంటాం. కొత్తగా జాబ్ లో చేరతారు. తుళ్ళు తో సంతోషంగా కనిపిస్తారు. ఓ సవత్సరం అవే సరికి వాళ్ళలో ఓ నిరాసక్తత కనపడుతుంది. ఎదో ఒక అనారోగ్యం ఉందని మాట్లాడుతుంటారు. మానసిక వత్తిడి తో దహించుకు పోతుంటారు. విపరీతమైన పనిభారం, ఇంటా బయట పని, శ్రమకు తగిన వేతనం లేకపోవటం, రోజులు తరబడి మార్పులేని పని, దీనితో లోలోపల ఉచ్చాహం, పని పట్ల ప్రేమ, ఉద్విగ్నత లోలోపల దగ్ధమైపోతాయి. ఎందుకొచ్చిన ఈ చావురా […]

మళ్ళీ పాత నగల హవా.

ఏ నాటివో పాత నగలు మళ్ళీ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ గా వచ్చేసున్నాయి ఒకప్పుడు కాళ్ళ పట్టీలు, చెవులకు బుట్టలోలాకులు ఫ్యాషన్ ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగల ఫ్యాషన్. ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగలు ఫ్యాషన్. అలాగే పాత కాలపు పసిడి బిళ్ళలు ఫ్యాషన్ లిస్టులో ముందున్నాయి. రాళ్ళు పొదిగిన పెండెంట్ చైన్స్ మళ్ళీ ఫ్యాషన్ వరసలో వున్నాయి. గోల్డ్ బ్రెస్ లెట్లు స్దానంలోని వజ్రాలు సీజెడ్ లు పొదిగిన నగలోచ్చాయి. […]

పాదాలు నొచ్చుకుంటాయ్.

హైహీల్స్ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇవి కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైహీల్స్ ను షాప్ లో వేసి చూసుకునే సమయంలో రెండు పాదాలకు వేసుకుని నడిచి చూసుకోవాలి. ఒక్కసారి హీల్ నిడివిలో తేడా ఉండవచ్చు. మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం వుండాలి. పాయింట్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా వుండే షూస్ వేసుకోవద్దు. హైహీల్స్ వేసుకునే ముందర మోకాలి కింద వెనక భాగంలో వుండే కాఫ్ మజిల్ ను కాసేపు రుద్దుతూ […]

మధ్య తరగతి మనసే నాది.

లగ్జరీ హోటల్స్, గగన విహారాలు బెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్, రాంప్ వాక్స్ ఇవే హీరోయిన్ ల గురించి ఒక ఊహా లోకం కానీ ఇవేమీ నా దగ్గర వుండవు అంటుంది సృతిహాసన్ నేను చాలా మాములు అమ్మాయిని నేనెలాంటి బ్రాండ్స్ ఇష్టపడను. ఎక్కడ డిస్కౌంట్ సెల్ కనబడితే అక్కడ వాలిపోతాను మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త  దుస్తులు వేసుకోవడం నాకు నచ్చదు.  నాకు సలహాలు కుడా వస్తాయి. అన్నీ వింటాను కానీ నాకు వీలైతే సరిపడతాయో […]

45 నిమిషాల వ్యాయామం చాలు.

కేవలం 45 నిమిషాల్లో చక్కని ఫలితం ఇచ్చే వ్యాయామం మా జిమ్ లో ఇచ్చే ట్రైనింగ్ అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్ లో, వైజాగ్ లో ఎఫ్ 45 పేరుతో నడుస్తున్న ఆమె సొంత జిమ్ లో ఫంక్షనల్ ట్రైనింగ్  స్పెషల్. ఈ సమయం చాలు అంటుంది రకుల్ శరీరంలోని వ్యర్ధాలు పోయి కావలసినంత శక్తి  వచ్చేందుకు ఇంత కంటే సమయం అక్కరలేదు పైగా నా విషయానికి వస్తే, మేము ఎక్కువ  అలంకరణలు చేసుకోవాలి. కనుక […]

చీర ధరించడంలోనే వుంది రహస్యం.

కొంత మంది బాగా సన్నగా వుంటారు. అలాంటప్పుడు చక్కని చీర కట్టుకోవాలంటే మీద సన్నగా కనిపిస్తామని భయపడతారు. కాటన్ కు బదులు లెనిన్ చీరలు ఎంచుకుని లేదా ఆర్గెంజా షిఫాన్ వంటి చీరల్లో కుడా చెక్కగా పొడవుగా కనిపించేలా చేస్తాయని చెప్పారు డిజైనర్స్. చీరను కొంచెం నడుము కిందగా కట్టుకోవాలి. చెప్పులు వేసుకుని కుచ్చిల్లు అందంగా వస్తాయంటారు. చీర కు కాంట్రాస్ట్ గా వుండే బ్లవుజ్ వేసుకోవాలి. ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్స్ కోసం ఉప్పాడ, గద్వాల్, కంచి […]

అలసటఅంతా పోతుంది.

ఇప్పుడన్నీ శుభకార్యాలు, పండగల రోజులే పగలంతా ఆఫీస్ పని వున్న రాత్రి వేళ వేడుకలకు అటెండ్ అవుతూ వుండాలి. ఆ అలసట ఉదయాన్నే మొహం పైన కనబడుతూ వుంటుంది. అలాంటప్పుడు అలసట ఉన్న మొహం పై చందనం రోజ్ వాటర్ కలసిన పూత వేస్తే చర్మం తాజాగా అయిపోతుంది. అలాగే బద్దకాన్ని వదిలించుకునేందుకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. నిద్ర చాలక కంటి కింద ఉబ్బినట్టుగా కనబడే ప్రమాదం వుంది. దాన్ని కళ్ళపై ఇరవై నిమిషాల పాటు […]

శ్రద్ధగా చూస్తే మెరుస్తాయి.

ఒక నవ్వే చాలు… అన్నారో సినీ కవి. నిజమే అందమైన మొకానికి చక్కని నవ్వు వజ్రాల నగలంత అందం. చక్కని నవ్వంటే ముత్యాల్ల మెరిసే పళ్ళతో నవ్వటం. ఆరోగ్యకరమైన తెల్లని దంతాలు కోసం కొన్ని జాగ్రతలు తప్పనిసరి. ప్రతి రోజు డి సెన్సిబుల్ టూత్ పేస్ట్ తో ఈ వర్షాకాలంలో పళ్ళు రుద్దుకోవాలి. చక్కర పదార్థాలు, ప్రాసేస్ద్ పుడ్స్, ప్రిజర్వేషన్స్ కి దూరంగా ఉండాలి. టూత్ బ్రష్ నెలకు ఒకసారైన తప్పనిసరిగా మార్చి తీరాలి. పోషకాలు సీజన్ […]

ఈ యాప్ ఒక అసిస్టెంట్.

హామ్ బడ్జెట్ సింక్ లైట్ యాప్ కనుక డౌన్ లోడ్ చేసుకుంటే ఆదాయం, ఖర్చులు, బిల్లులు, ఇవన్నీ సరిచుసుకోవచ్చు.  ఈ యాప్ తో ఇంట్లో వుండే సభ్యులందరికీ ఖాతాలు ఫీడ్ చేసి ఎవరెవరు ఎంత ఖర్చుపెట్టారన్న విషయం తెలుసుకోవచ్చు.  అంటే ఇదో జమా ఖర్చుల వివరాలు పుస్తకం లాంటిది. ఏ తేదీల ప్రకారం ఏవో బిల్లులు కట్టాలో నమోదు చేసుకోవచ్చు అప్పుడు ఈ యాప్ ముందుగా మనం ఫీడ్ చేసినా ఆదాయానికి సంబందించిన బోర్డును చూపెడుతూ, చేస్తున్న […]