Saturday, 28 Nov, 2026

జాబ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదం.

ఉద్యోగం విషయంలో పనికి సంబందించో, ఇతరాత్రానో వత్తిడి తప్పదు. ఏ ఉద్యోగం లోనైనా ఇది సర్వ సాధారణం. అయితే మధ్య వయస్సులో ఉద్యోగ సంబందిత ఒత్తిడి కెరీర్ దృశ్యా మరింత ఎక్కువ అవ్వుతుంది. ఈ మధ్య వయసులో మనస్సు పై పెరిగిన వత్తిడి వృద్దాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు దరి తీస్తుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక,మానసిక  వత్తిడి తరువాత జీవితం పై ప్రభావం చుపెడుతుందని చెప్పుతున్నారు. సరైన డేడ్ లైన్స్ అందుకోవడం, అత్యధిక డిమాండ్లు, మరొకరి పని […]

నెయిల్ ఆర్ట్ పెద్ద కష్టం కాదు.

కొత్త లో శ్రద్దగా ప్రాక్టిస్ చేస్తే నెయిల్ ఆర్ట్ పెద్ద బ్రహ్మ విధ్యేమీ కాదు. ఎన్నో వీడియోలు కూడా నెట్ లో చూడొచ్చు. గోళ్ళు నీట్ గా కట్ చేసి బేస్ కోట్  అప్లయ్ చేయాలి. 2 ఇన్ 1 బేస్ వాడి టాప్ కోట్ లేదా స్ట్రెయిట్నింగ్ బేస్ కోట్ వేసుకోవచ్చు. గొళ్ళకు పాలిష్ వేసే ముందు బాటిల్ ను కనీసం పది సెకండ్లయినా షేక్ చేయాలి. అప్పుడు వైట్ నెయిల్ పాలిష్ అప్లయ్ చేయాలి. […]

గ్రిల్ ను జాగ్రత్తగా వాడాలి.

గ్రిల్ ను సరిగ్గా వాడుకోవడం తెలిస్తే ఎక్కువకాలం మన్నికగా వుంటుంది. చాలా రకాల గ్రిల్స్ అవుట్ డోర్స్ కు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వుతాయి. కాబట్టి మెటల్ డామేజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రిల్ ఎప్పుడూ కవర్ చేసి వుంచాలి. గ్రిల్ కవర్లు అన్ని షేపుల్లో, సైజుల్లో దొరుకుతాయి. గ్రిల్ కింద మ్యాట్ ఉంచితే పదార్ధాల అవశేషాలు గ్రీజు వంటివి దాని పైన పడతాయి. గ్రిల్ భాగాన్ని రీప్లేస్ చేయడం చాలా అవసరం మాన్యువల్ […]

పిల్లలు నోచ్చుకుంటున్నారేమో?

సోషల్ మీడియా అప్డేట్స్  చేసే సమయంలో, ట్విట్టర్ లో సొంత విషయాలు పోస్ట్ చేసే సమయంలో ఇంట్లో వుండే పిల్లల గురించి ఓ సారి ఆలోచించ మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనం చేసే ప్రయాణాలు, కలిసే ఫ్రెండ్స్, చేసే భోజనాలు అన్నీ పోస్ట్ చేయడం ఇప్పటి హాబీ. కానీ వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసే సమయంలో పిల్లలు వాటి గురించి ఏమనుకొంటున్నారో ఆలోచించాలి. తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాల పై చర్చ జరగడం పిల్లలు ఒర్చుకోరు. అలంటి విషయాలు […]

ఆరోగ్యానికి ఫిట్నెస్ కీలకం.

ఆరోగ్యంగా వుండటం అన్నది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఎవ్వరికి వాళ్ళు అలవరచుకోవలసిన ఒక మంచి అలవాటు వంటిది. ఎంత పద్దతిగా తినొద్దూ అనుకున్నా పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు రూల్స్ ని బ్రేక్ చేయమంటాయి. తప్పులేదు మరీ అవసరం అయితే హాయిగా భోజనం చేయొచ్చు.కానీ వెంటనే శరీర చురుకుదనంతో అదనపు కాలరీలు కరిగించాలి. ఎన్ని కాలరీలు ఎక్కువగా పొతే వాటిని కరిగించే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం కోసం కొన్ని పద్దతులు పాటించ వచ్చు. ఉదయాన్నే ఓ గ్లాసు కురగాయల […]

ముప్ఫయ్ల్ లోపే తల్లి కావడం మంచిది.

పూర్వం పాతికేళ్ళలోపే పిల్లల్ని కనేవాళ్ళు. ఈ కాలంలో చదువులు, తర్వాత కెరీర్ పరుగుల్లో అమ్మయిలు 30 ఏళ్ళు దాటితే గానీ పిల్లల మాట ఎత్తడం లేదు. అయితే 30 సంవత్సరాలు దాటితే మాత్రం గర్భం, ప్రసవాలకు సంబంధించి రిస్క్ జోన్ అని చెపుతున్నారు డాక్టర్లు. ముప్ఫయ్ ల ఆరంభంలో ప్రీ మచ్యుర్ వంటి సమస్యలు ఇరవై శాతం దాకా వున్నాయి. 30-34 నడుమ గర్భం దాల్చిన వాళ్ళకి ఇరవైల్లో పిల్లలల్ని కన్నవాళ్ళకంటే ప్రసవ సంబంధిత సమస్యలు మరీ […]

కుర్తీలు జీన్స్ పెయిర్ చేస్తే అందం.

జీన్స్ తో కుర్తీల్ని పెయిర్ చేయడం ఎప్పటికీ పాతబడని ఫ్యాషనే కానీ వాటి ఎంపిక విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. కుర్తీలు జీన్స్ ధరించాలనుకొన్నప్పుడు కలర్స్ ప్రింట్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి సంప్రదాయ పొడవాటి కుర్తీలకు బదులు కుర్తీలు, ట్యూనిక్ టాప్స్ ప్రయత్నించాలి. జీన్స్ బాగా ఫిట్ అవ్వాలి. ఫ్లేర్ట్ లూజ్ జీన్స్ కు కుర్తీలు నప్పక పొగా ఎబ్బెట్టుగా ఉంటాయి. పర్స్నాలిటీకి సూట్ అయ్యే విధంగా కుర్తీలు, జీన్స్ ఒకటికి రెండు సార్లు ట్రయిల్ చేసుకుని […]

మనస్పూర్తిగా నిజాయితీగా వుండాలి.

నీహారికా, ఈ పదం విన్నావా, ఎమోషనల్ హానెస్టి. ఈ ఎమోషనల్ హానెస్టి ఉంటేనే మనకు మన చుట్టూ వున్న వారితో బంధువులు, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు సజావుగా ఉంటాయి. అంటే మనం మన పట్ల, ఇతరుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలన్నమాట, అందులో స్నేహంగా ప్రేమా గా వ్యావహారిస్తూ వారీ వెనక మూడో వ్యక్తి సమపక్షంలో విమర్శలు, వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎదురుగా వున్నారు. కదా అని ఒక రకంగానూ వెళ్ళిపోయారు కదాని ప్రతికులంగా మాట్లాడితే  ఎమోషనల్ హానెస్టి మనలో […]

స్మార్ట్ ముమ్మి అనిపించుకోండి.

పిల్లలకు భోజనం తినిపించడం తల్లులకు పుట పుటా కత్తి పైన సామే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి తల్లి పెట్టే భోజనం ఎప్పుడూ వద్దంటారు. ఇక తల్లులేమో ఇది తింటే ఐస్ క్రీమ్ ఇస్తాను, పానీ పురీ ఇప్పిస్తాను అని లంచం ఇవ్వాలని చూస్తారు. ఇక పిల్లలు పూర్తిగా ఆ లంచం మాత్రమే కోరుకుని అస్సలు అన్నం ఎగ్గోట్టేసారు. పిల్లలకు చిరు తిండి పైన ధ్యాస కలిగేలా చేస్తున్నామన్నమాట. అందుకే తల్లులే ముందుగా మంచి డైట్ ఎక్స్ […]

పిల్లల గ్రూప్స్ తయ్యారు చేయాలి.

పిల్లలకు వేసవి సెలవులోస్తే ఆ సెలవుల్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేయండి. పిల్లలకు తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం కంటే ఇష్టమైన పని ఇంకొకటుండదు. అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉంటున్న లేదా ఎక్కువ ఇళ్ళు కలసి వుండే ప్రదేశాల్లో ఉంటున్న ఆ ఇళ్ళల్లో వున్న పిల్లలంతా కలిసి ఉండేలా ప్లాన్ చేయాలి. పిల్లలు చిన్నతనం వల్ల వాళ్ళంతట వాళ్ళు అందరి ఇళ్ళల్లోకి స్వేచ్చగా వెళ్ళలేకపోవచ్చు. తల్లిదండ్రులందరు కలసి మాట్లాడుకొని పిల్లల్ని ఒక్క […]

ఆత్మరక్షణ విధానాలు నేర్చుకోనివ్వండి.

ఆడపిల్ల పుడితే శ్రీ మహాలక్ష్మి అనుకునే రోజులు పోయి, అసలా పిల్ల ఈ జనారణ్యం మధ్యలో ఎలా బతుకుతుందన్న బాధ పట్టుకోంటుంది తల్లిదండ్రులకు. ఆడపిల్లలు ఇళ్ళల్లో, పని ప్రదేశాల్లో, కాలేజీల్లో కార్యాలయాల్లో ఎదో రకమైన హింసను ఎదుర్కొంతునే వున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఎదిగే వయస్సులోనే కొన్ని ఆత్మ రక్షణ విద్యలు నేర్పిస్తే ఎలా వుంటుంది? ఆపద సమయాల్లో వాళ్ళకి అవి ఉపయోగ పడతాయి అలాగే ఈ విద్యలు వాళ్ళని శరీరకంగా బలంగా కూడా తయ్యారు చేస్తాయి. ఉదాహరణకు […]

సహజమైన పద్దతుల్లో చర్మం కాంతి వంతం.

చేతులు, మెడ పై వున్న చర్మం సాదరంగా సూర్యకిరణాలకు గురై కందిపోవడం, నల్లబడి పోవడం జరుగుతుంది. గాలి కాలుష్యం కూడా సూర్యకిరణాల మాదిరిగానే ఈ ప్రదేశంలోని చర్మానికి హాని కలిగిస్తాయి. సూర్యకిరణాలకు ఎక్కువ ఎక్స్ పోజ్ కావడం, అస్తమానం వేడికి తట్టుకోలేక నీళ్ళతో అదే పనిగా కడిగినా చేతులు, ఇతర భాగాలు సహజమైన నూనెలు కోల్పోతాయి పొడిగా అయిపోతూ ఉంటాయి. రెండో కారణం, సాదరంగా ముఖం పైన చూపెట్టిన శ్రద్ధ, మెడ పైన చేతులు పాదాల పైన […]

వ్యయామం తప్పనిసరి.

ఎక్కువసేపు కదలకుండా కుర్చీలో కుర్చుని ఉద్యోగం చేసే వాళ్ళు కదలకుండా విశ్రాంతిగానే వుండేవాళ్ళు. ఎటువంటి వ్యయామం చేయకపోవడం అంటే ఆవ్యవహారం, ధూమపానం చేసేవాళ్ళలాగా, ఆల్కహాలిక్స్ తో సమానంగా వుందని నిపుణులు చెప్పుతున్నారు. ఆఫీస్ లో పద్దెనిమిది గంటలు గడపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా శరీరక క్రియల్లో తెడాలోస్తాయి. కాస్సెపైనా నడవాలి. లేదా పనులన్నీ ఏ సైకిల్ పై వెళుతూ అన్ని చేసుకోవాలి. ఫోర్ వీలర్స్ వాడటం, ఎదో ఒక సాకు తో విశ్రాంతిగా […]

వేకువనే మేలుకోండి.

సూర్యోదయానిముందే నిద్రలేవడం మంచిదని తలుసు కానీ లేవడం మాత్రం బద్దకమే. దినచర్య వేళలు తారుమారు అవ్వడంతో ఉదయం నిద్ర లేవడం అనే అలవాటు క్రమంగా పోయింది కానీ అందకరమైనక్రియాశీలమైన జీవితం కావాలనుకొంటే నిద్ర అలవాట్లు మార్చుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్ పని వత్తిడి, వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం తో విపరీతమైన అలసటతో ఉంటారు. ఇందులోంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. రోజంతా ఎలాటి గందరగోళం లేకుండా గడపగలిగే శక్తి నిచ్చేది ఉదయపు ప్రశాంతతే. మందగించిన […]

ఈ వెల్వెట్ టామరిండ్ భలే రుచి.

సృష్టిలో ఎన్నో విచిత్రాలు. చింతకాయలంటే పుల్లని పులుపే. కానీ ఇందులో వెల్వెట్ చింత కూడా ఈ జాతి రకమే. వెల్వెట్ టామరిండ్ గా పిలిచి ఇవి చేసేందుకు ద్రాక్ష పండ్లులా ఉంటాయి. ధాయ్ లాండ్, జీవ సుమత్రా ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. మాములు చింతకాయల కంటే ఎంతో రుచి. బాగా పండాక, పెంకు ఊడిపోతుంది. లోపల గుజ్జు నారింజ రంగులో వుంటుంది. ఈ చింత ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధుల నివారణలో వాడుతారు. ఇక […]

విటమిన్-‘ఇ’ చాలా అవసరం.

శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల ఆరోగ్యవంతమైన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాల గురించి, ఎక్కడ ప్రస్తావన వచ్చినట్లు కనిపించదు. ఇది శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమయ్యే ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. కొవ్వులో కరిగి శరీరంలో నిల్వ వుండే విటమిన్ ఇది. విటమిన్ ఇ లోపాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇది నట్స్, గింజల్లో, వెజిటబుల్ ఆయిల్స్ పూర్తి స్తాయి ధన్యాలు, ఆకు కూరల్లో ఎక్కువగా లభిస్తుంది. […]

గోళ్ళు కొరికితే అనారోగ్యం.

చాలా మంది పుస్తకం చదువుతున్నా, టీవి చూస్తున్నా, గోళ్ళు కొరికేస్తుంటారు. కాస్త విశ్రాంతిగా కూర్చున్నా, గోళ్ళు నోట్లోకి వెళ్లి పోతూ ఉంటాయి. ఈ అలవాటు చూసేందుకు ఎబ్బెట్టుగా వుండటమే కాదు. క్రీములు నోట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గోళ్ళు కొరుకుతూ, నోల్లో వెళ్ళు పోనిస్తూ వుండటం వల్ల పిల్లల్లో అలెర్జీలు ఎక్కువగా వస్తున్నాయని న్యూజిలాండ్ పరిశోధకులు గుర్తించారు. చిన్నతనం నుంచి గోళ్ళు కోరికే అలవాటు వుంటే, దాని దుష్పలితం […]

భావోద్వేగాలకు లోనై కర్చు పెడతాం.

నీహారికా, ఒక రిపోర్టు చాలా ఆలోచించదగిన విషయాలు చెప్పుతుంది. మన భావొద్వేగాలు మనం పెట్టే కర్చులను ప్రభావితం చేస్తాయిట. దీన్ని బిహేవియిరేల్ ఎకనామిక్స్ అంటున్నారు నిపుణులు. మన ఉద్యోగాలను అదుపులో పెట్టుకోగలిగితే కర్చులు అదుపులోకి వస్తాయన్నమాట. సాధారణంగా మనస్సు’ బాగోకపోతే షాపింగ్ చేస్తాం. అవసరం కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తాం. మనం కొనే వస్తువుల వల్ల మనకి సంతోషం వస్తుందనే ఆలోచన వల్లనే కావొచ్చు. న్యాయానికి మన సంతోషం మన మనసులోనుంచి వస్తుందని కానీ మనం డబ్బు […]

ఇవి హాని కారకాలు కాదు.

వాతావరణంలో వేడి పెరిగే సరికి ఎక్కడెక్కడో చీమలు, బొద్దింకలు, పురుగులు బయటకు వచ్చేస్తుంటాయి. ఇక వాటిని చంపేందుకు స్ప్రేలు, జెల్స్ ట్రాప్ లు కొనుక్కోవాలి. అయితే వీటితో పని లేకుండా ఇంట్లో వుండే వస్తువులతో ఈ కీటకాలను నిర్మూలించ వచ్చు. పావు కప్పు మౌత్ వాష్, పావు కప్పు నీళ్ళు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు బయట పడే సింకుల్లో అలమారాల్లో స్ప్రే చేస్తే తెల్లారే సరికి బొద్దింకలు పోటాయి. మౌత్ వాష్ లో […]

వక్క పొడితో ప్రయోజనం శూన్యం.

వక్కపొడి వేసుకోవ్వడం నోట్లో ఎదో ఒక్కటి నమలడం వల్ల కడుపు నిండిన భవన్ కలుగుతుంది అని అస్తమానం తిండి పైన ధ్యాస పోకుండా వుంటుంది అనుకుంటాం కానీ ఇది కేవలం అపూహే అంటారు నిపుణులు. తమలపాకుల్లో వక్కపొడి వేసుకున్నా, వక్కపొడి తినే అలవాటుతో తిన్నా, మాములు వాక్క అయినా తిండి పైన ధ్యాస మళ్ళించడం లేదా వరువు తగ్గించడంలో పరోక్షంగా ఉపయోగ పాడుతుందనో అనుకోవడం లో అర్ధం లేదు. వక్కల్లో స్టిములెంట్ యాక్టివిటి వుంటుంది. చురుకుదనం, ఫాస్ట్ […]