Thursday, 12 Nov, 2026

పెయింటింగ్స్  మన ఇమోషన్స్

ఆర్ట్ కనెక్ట్ అని ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది మిహికా దగ్గుబాటి. ప్రముఖ నటుడు రాణా భార్య. పెయింటింగ్స్ అన్నవి జీవిత కాలం మనతో ఉండే ఇమోషన్స్ అంటుంది. ప్రజలకు కళాకారులకు ఒక వంతెన నిర్మించాను అలాగే కొత్త కళాకారులను సుప్రసిద్ధులైన చిత్రకారులతో కలిపాను అంటారామె.దేశంలో ఉండే ఎంతోమంది చిత్రకారుల కళాకృతులను తన ఆర్ట్ కనెక్ట్ ఎగ్జిబిషన్స్ తో ప్రజల దగ్గరకు తీసుకువస్తోంది. మిహికా భూములకు భవంతులకు ఎంత విలువ ఉందో అలాగే పూర్వకాలం నుంచి వస్తున్న కళారూపాలకు కూడా […]

ఒకటే లక్ష్యం

ఢిల్లీ లోని వసంత విహార్ సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నారు ఆయుషి సుడాన్. ఆమె దృష్టిలోపం. ఢిల్లీలోని రాణి ఖేరా ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయుషి కి చూపు లేదని తెలిశాక ఆమె తల్లి తాను చేస్తున్న సీనియర్ నర్సింగ్ అధికారిణి బాధ్యతల నుంచి స్వచ్ఛంద విరమణ పొందారు.ఆయుషి చక్కగా చదివి ఎం ఎ హిస్టరీ చేసి బియిడి రాసి ముందుగా చరిత్ర లెక్చరర్ అయ్యారు తర్వాత ఐఏఎస్ కోసం ప్రయత్నించి 48 […]

అందరూ స్త్రీలే

సి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో అధికశాతం ఆడవాళ్లే ఉంటారని మెరైనా ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చెబుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటే అందులో ఒడిశా నుంచే 1. 2 లక్షల మెట్రిక్ టన్నులు వెళతాయి. ఇక్కడ మహిళలే తడి వాతావరణం లో రొయ్యల పొట్టు వలిచి గ్రేడింగ్ చేసి ప్యాకేజింగ్ కు పంపిస్తారు. దశాబ్దాల నుంచి పేద మహిళలు ఈ ఉపాధి […]

కర్ర పెండలం గౌను కు అవార్డు

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు వాడే సింథటిక్ ఈ సి జి ఎలక్ట్రోడ్స్ రీసైకిల్ చేయట కూడా చాలా కష్టం.కొచ్చి కి చెందిన మాళవిక బైజు కర్ర పెండలం రూపాలతో ఏకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రోడ్స్ తయారు చేసింది.ఈ సి జి పరీక్షల సహాయంతో దుస్తులు తియ్యకుండా ఈ ఎలక్ట్రోడ్ లు అమర్చిన గౌను ధరించవచ్చు. మెల్ క్రో సెక్యూర్డ్ జేబులు,పౌచ్ లతో ఉండే ఈ గౌనులో స్పెన్సర్స్ ను నేరుగా శరీరానికి అంటించవచ్చు. ఈ వినూత పరిష్కారానికి గౌను […]

అందమైన ఐరన్ మ్యాన్  

ఎంతో క్లిష్టమైన ఐరన్ మాన్ 70.3 రేస్ పూర్తి చేసిన మొదటి భారతీయ నటి గా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఐరన్ మాన్ రేస్ ను వరల్డ్ ట్రయాథ్లాన్‌ కార్పొరేషన్ డబ్ల్యూ టి సి నిర్వహిస్తోంది.ఇందులో 12 మైళ్ళ స్విమ్మింగ్,56 మైళ్ళు సైకిలింగ్,13.1 మైళ్ళు రన్నింగ్ ఉంటాయి.మొత్తం కలిపి 70.3 మైళ్ళు.2015 లో ‘రేయ్’ చిత్రంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన సయామీ విలక్షణమైన ఎన్నో పాత్రల తో సినిమాల్లో నటించింది.సెయింట్ జేవియర్ కాలేజ్ లో డిగ్రీ తీసుకున్న సయామీ […]

ఈ రగ్గు కు చక్కని అవార్డ్

కేరళ కు చెందిన జామియా జోసెఫ్,’గిల్డెడ్ ఒయాసిస్’ పేరుతో రూపొందించిన ఒక రగ్గు పర్యావరణహిత కేటగిరి లో యూరోపియన్ ప్రోడక్ట్ డిజైన్ అవార్డుకు ఎంపికైంది.నిఫ్ట్ కన్నూర్ లో డిజైనింగ్ చదివిన జామియా, తూర్పు ఆఫ్రికా నుంచి మెటీరియల్ తెప్పించి టెన్సిల్,వూల్, సీసాల్ కలయికతో హ్యాండ్ టఫ్టింగ్ టెక్నీక్ వాడి ఈ రగ్ తయారు చేసింది.గతంలో ఈమె కేరళ లోని పడవ పందాలు,వరి పొలాలు వంటివి చిత్రించిన ‘వల్లంకలి’ రగ్ కూడా డిఎన్ఏ పారిస్ డిజైన్ అవార్డుకు ఎంపికైంది.

కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025

వృద్ధులు ఆన్ లైన్ మోసాలకు గురి కాకుండా ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్ సైట్ రూపొందించి టైమ్స్ మ్యాగజైన్ వారి కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 ఘనత సాధించింది తేజస్వి మనోజ్. ఈ ఇండియన్ అమెరికన్ అమ్మాయి తేజస్వి వయసు 17 సంవత్సరాలు మోసానికి గురైతే ఏం చేయాలి, దగ్గర నుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు వరకు తన వెబ్ సైట్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తోంది తేజస్వి సీనియర్స్ సిటిజన్స్ ఈ షీల్డ్ సీనియర్స్ వెబ్ […]

చదవాల్సిన మంచి పుస్తకం

ప్లాట్ ఫామ్ టికెట్ పుస్తకం రాశారు సంగీత వల్లట్.రైల్వే డిపార్ట్మెంట్ లో కమర్షియల్ క్లర్క్ గా 14 సంవత్సరాలు ఉద్యోగం చేశారు సంగీత. చెన్నై రైల్వే స్టేషన్ లో 70 మంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో ఆమె ఒక్కరే మహిళా ఉద్యోగి రైల్వే డిపార్ట్మెంట్ లో ఆమె అనుభవాలే అంత చక్కని బుక్ రాసే స్ఫూర్తి ఇచ్చాయి. రైల్వే స్టేషన్ లో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలే కాదు భారతీయ రైల్వే వ్యవస్థ విశ్వరూప దర్శనం […]

నేపాల్ ప్రధాని సుశీల కర్కీ

నేపాల్ తొలి మహిళా న్యాయమూర్తి సుశీలా కర్కీ నేపాల్ పగ్గాలు అందుకున్నారు. అవినీతి వారసత్వం వివక్షలకు వ్యతిరేకంగా నేపాల్ జెన్ జీ లు మొదలుపెట్టిన పోరాటంలో ప్రభుత్వం పడిపోయింది. టీచర్ గా కెరీర్ మొదలు పెట్టి న్యాయవాది వృత్తి లోకి వెళ్లిన సుశీలా కర్కీ స్వచ్ఛమైన వ్యక్తి గా యువత భావించి ఆమెకు ప్రధాని పదవికి ఎంపిక చేసుకున్నారు.ఎలాంటి రాజకీయ వతుళ్ళను లొంగని అవినీతి లేని వ్యక్తి గా సుశీలా కర్కీ అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి.

నేపాల్ లో మహిళా నాయకత్వం  

నేపాల్ లో జరిగిన జెన్ జీ ఉద్యమం మహిళా నాయకత్వానికి దారి తీసింది ప్రధానిగా ఎంపికైన సుశీలా కార్కి ప్రభుత్వ అటార్నీ జనరల్‌ గా సబితా భండారీ నియమించారు. సబితా ఖాట్మండు కు చెందిన  ప్రముఖ న్యాయవాది కృష్ణా భండారీ కుమార్తె.సబితా న్యాయవాదిగా పనిచేస్తూనే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఐదేళ్లపాటు కమిషనర్ గా సేవలు అందించారు. నేపాల్ బార్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా. మహిళా సాధికారత కోసం పనిచేసే విమెన్ లీడ్ సంస్థ కు వైస్ […]

సైన్యంలో చేరిన అందాల రాణి

ఉల్హాసనగర్ (Ulhasnagar) ముంబై కి చెందిన కాషిష్ మెత్వాని 2023 లో మిస్ ఇంటర్నేషనల్ గా ఎంపిక అయింది. అందాల వేదిక మీద నుంచి ఆర్మీ లోకి వచ్చి చేరింది మెత్వాని. ఒకప్పుడు ఆమెకు అందాల పోటీలే ఫ్యాషన్ సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి బయో టెక్నాలజీ లో మాస్టర్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పి హెచ్ డి చేసే అవకాశం వచ్చిన ఆమె సైన్యంలో చేరేందుకు నిశ్చయించుకుంది. దీనికి స్ఫూర్తి ఆమె తల్లి […]

అంబులెన్స్ డ్రైవర్ గా విసువస

తమిళనాడు లోని మేళపుతుక్కుడి కి చెందిన విసువస మేరీ ఇంగ్లీష్ లిటరేచర్ లో పిజి చేసింది. ఆమెకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం బైకు,కారు అన్ని వాహనాలు నడపడం నేర్చుకుంది. అంబులెన్స్ డ్రైవర్ కావాలని ప్రకటన చూశాక వెంటనే చేరి పోయేందుకు సిద్ధమైంది. రాత పరీక్ష తో పాటు అంబులెన్స్ నడిపే పరీక్షలోనూ ఉత్తీర్ణురాలై ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం చేస్తోంది. ఇది ఉద్యోగం కాదు మానవాళికి చేసే సేవ అంటుంది మేరీ.

అనుపర్ణ కు అవార్డు  

ప్రతిష్టాత్మక వెనిస్ చిత్రోత్సవం లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్నారు అనుపర్ణ రాయ్. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో పుట్టిన అనుపర్ణ సినిమా దర్శకురాలో,రచయితో అవ్వాలి అనుకుందట.అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంది. 2022 లో ముంబై వెళ్లి అక్కడ ‘సాంగ్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. ఆ చిత్రానికి వెనిస్ చిత్రోత్సవం ఒరిజోంటి విభాగంలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు వచ్చింది.ఇటలీ లోని […]

మూడుల డిజైన్లే ‘బాంధీని’

కాటన్,సిల్క్,చందేరి,షిఫాన్,టస్సర్,ఆర్గంజా రకాల చీరల పైన బాందిని డిజైన్స్ వస్తున్నాయి వీటికి జర్దోసి,ఎంబ్రాయిడరీ,కుందన్,అద్దాలు,పూసల వర్క్ జోడించి మరింత గ్రాండ్ గా తయారు చేస్తున్నారు డిజైనర్లు. బాంధీని అన్నది ఒక సాంప్రదాయ వస్త్ర కళ. సాదా చీర పైన దారాల సహాయంతో ముడులు చుడతారు. ముడుల తోనే రకరకాల డిజైన్లు రూపొందిస్తారు. అప్పుడు ఆ చీరను రంగులో ముంచి ఆరబెట్టి ముడులు విప్పదీస్తే బాందినీ చీరే తయారవుతుంది. ఇట్లా టై అండ్ డై విధానం తో చుక్కలు,చదరాలు,పూలు లతలు సమూహాలతో […]

ఐదు తరాల దేశసేవ

పారుల్ ధద్వాల్ తన సైనిక కుటుంబంలో ఐదవ తరానికి చెందిన తొలి మహిళ ఉమెన్ ఆఫీసర్. ఈ అంశాన్ని ఇన్ఫినిటీ ఫ్రెండ్ ఏ లెగసి ఆఫ్ ఫైవ్ జనరేషన్ క్యాప్షన్ తో ఎక్స్ వేదికగా పారుల్ ధద్వాల్ కుటుంబానికి అభినందనలు తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. పంజాబ్ లోని హోషియార్‌పూర్‌ జిల్లాల్లోని జనౌరీ గ్రామానికి చెందిన పారుల్ ఐదవ తరం మిలటరీ వారసత్వానికి ప్రాధాన్యత వహిస్తుంది. పరుల్ ముత్తాత తాత హర్నామ్ సింగ్ ఎల్ ఎస్ ధద్వాల్ దల్జిత్ […]

అమ్మాయిలు బలవంతులే

కండలు తిరిగిన శరీరం అబ్బాయిల కే సొంతం అన్న ఆలోచనకు చెక్ పెట్టారు షెహనాజ్ బేగం. తమిళనాడు లోని కొడంగయూర్ లో పుట్టిన షెహనాజ్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ బాధ నుంచి కోలుకునేందుకు తండ్రితో కలిసి జిమ్ కు వెళ్లిందామె తండ్రిని చూసి బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకున్నది. మిస్ చెన్నై బాడీ బిల్డింగ్, మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ వంటి […]

మనీషా కు డాక్టరేట్

లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్, నటి మనీషా కొయిరాలా కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. హీరామండీ ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ లో మనీషా చాలా విరామం  తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యు.కె సిటీ ఆఫ్ కల్చర్ 2025 లో ఈ గౌరవ డాక్టరేట్ అందుకున్న మనీషా ఈ గౌరవం తన జీవితానికి ఇచ్చిన విలువగా భావిస్తున్నాను అన్నది. జీవితంలో ఎన్నో వైఫల్యాలు కష్టనష్టాలు ఎదుర్కొని నిలబడ్డానని నిజానికి నా […]

ఈ వాసనకే దోమలు పరార్

ఇంటి ఆవరణలో కుండీల్లో పెంచుకోగలిగే కొన్ని రకాల ఔషధ మొక్కల వలన దోమల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రధానంగా నిమ్మ గడ్డి సిట్రోనెల్లా అనే రసాయనాన్ని విడుదల చేయటం వల్ల దోమలే కాదు ఇతర ఏ కీటకాలు లోపలికి రావు. ఈ నిమ్మగడ్డి కి బ్యాక్టీరియా వైరస్లను దూరం చేసే శక్తి ఉంది. అలాగే తులసి,పుదీనా,బంతి,లావెండర్ కూడా దోమలకు నచ్చని వాసనలే ఇస్తాయి. లావెండర్ మొక్క కుండీల్లో పెంచితే మలేరియా,డెంగ్యూ రకాల దోమలు ఇంట్లోకి రావు. తులసి […]

చిత్తు కాగితాలకు పుస్తకం

వారణాసి లో పుట్టి పెరిగి, కామర్స్ చదువుకున్న ప్రీతు ‘లిటిల్ లీఫ్’ సంస్థ స్థాపించారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చెత్త కాగితాలు సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయించి నోట్ బుక్స్ తయారు చేస్తుంది. ఇంటింటా సేకరించిన లక్ష కిలోల చిత్తు కాగితాలను 50 వేలకు పైగా నోట్ బుక్స్ గా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు వాటిని పంచారు.పర్యావరణ స్పృహ ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ కు ఎవరైనా చెత్తకుండీల్లో […]

ఆన్‌లైన్ లో కాశ్మీర్ వస్త్రాలు

కాశ్మీర్ సాంప్రదాయ దుస్తులను అమ్మేందుకు ఫ్యాషన్ స్టోర్ నెలకొల్పింది ఇక్ర అహ్మద్. సైకాలజీ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన ఇక్ర  సొంతంగా వివిధ మధ్య మాల ద్వారా డిజైనింగ్ నేర్చుకుంది. 2015 లో ఆన్‌లైన్ స్టోర్ తుల్పలావ్ ప్రారంభించింది. ఈ స్టోర్ తో కాశ్మీర్ కే ప్రత్యేకమైన ఫిరాన్ కుర్తీలు వెడ్డింగ్ డ్రెస్ లు ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. ఈ స్టోర్స్ లో ప్రత్యేకంగా టిల్లా వర్క్ ఫిరాన్ అంటే బంగారం వెండి దారాలతో తయారు చేసే […]