ఢిల్లీ లోని వసంత విహార్ సబ్ కలెక్టర్ గా పని చేస్తున్నారు ఆయుషి సుడాన్. ఆమె దృష్టిలోపం. ఢిల్లీలోని రాణి ఖేరా ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయుషి కి చూపు లేదని తెలిశాక ఆమె తల్లి తాను చేస్తున్న సీనియర్ నర్సింగ్ అధికారిణి బాధ్యతల నుంచి స్వచ్ఛంద విరమణ పొందారు.ఆయుషి చక్కగా చదివి ఎం ఎ హిస్టరీ చేసి బియిడి రాసి ముందుగా చరిత్ర లెక్చరర్ అయ్యారు తర్వాత ఐఏఎస్ కోసం ప్రయత్నించి 48 వ ర్యాంక్ సాధించి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఐ ఎ ఎస్ గా ఎంపికై చరిత్ర సృష్టించారు.













