లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్, నటి మనీషా కొయిరాలా కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. హీరామండీ ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ లో మనీషా చాలా విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యు.కె సిటీ ఆఫ్ కల్చర్ 2025 లో ఈ గౌరవ డాక్టరేట్ అందుకున్న మనీషా ఈ గౌరవం తన జీవితానికి ఇచ్చిన విలువగా భావిస్తున్నాను అన్నది. జీవితంలో ఎన్నో వైఫల్యాలు కష్టనష్టాలు ఎదుర్కొని నిలబడ్డానని నిజానికి నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది అన్నారామే ఇన్‌స్టా వేదికగా తను డాక్టరేట్ అందుకున్న ఫోటోలు షేర్ చేసింది మనీషా కొయిరాలా.













