ఇంటి ఆవరణలో కుండీల్లో పెంచుకోగలిగే కొన్ని రకాల ఔషధ మొక్కల వలన దోమల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రధానంగా నిమ్మ గడ్డి సిట్రోనెల్లా అనే రసాయనాన్ని విడుదల చేయటం వల్ల దోమలే కాదు ఇతర ఏ కీటకాలు లోపలికి రావు. ఈ నిమ్మగడ్డి కి బ్యాక్టీరియా వైరస్లను దూరం చేసే శక్తి ఉంది. అలాగే తులసి,పుదీనా,బంతి,లావెండర్ కూడా దోమలకు నచ్చని వాసనలే ఇస్తాయి. లావెండర్ మొక్క కుండీల్లో పెంచితే మలేరియా,డెంగ్యూ రకాల దోమలు ఇంట్లోకి రావు. తులసి ఆకులు పిల్లలకు తాగే నీళ్లలో వేసి తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి వస్తుంది పుదీనా ఆకులు నీళ్లల్లో మరిగించి తాగితే జలుబు,దగ్గు తగ్గుతాయి ఇవి చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు.













