కండలు తిరిగిన శరీరం అబ్బాయిల కే సొంతం అన్న ఆలోచనకు చెక్ పెట్టారు షెహనాజ్ బేగం. తమిళనాడు లోని కొడంగయూర్ లో పుట్టిన షెహనాజ్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ బాధ నుంచి కోలుకునేందుకు తండ్రితో కలిసి జిమ్ కు వెళ్లిందామె తండ్రిని చూసి బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకున్నది. మిస్ చెన్నై బాడీ బిల్డింగ్, మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ వంటి టైటి ళ్ళే కాదు గత సంవత్సరం మిస్ ఏషియా ఛాంపియన్షిప్ లోను వెండి పథకం సాధించారు. అమ్మాయిలు సుకుమారులు అన్న ఆలోచనను తప్పని నిరూపిస్తున్నారు.













