ఉల్హాసనగర్ (Ulhasnagar) ముంబై కి చెందిన కాషిష్ మెత్వాని 2023 లో మిస్ ఇంటర్నేషనల్ గా ఎంపిక అయింది. అందాల వేదిక మీద నుంచి ఆర్మీ లోకి వచ్చి చేరింది మెత్వాని. ఒకప్పుడు ఆమెకు అందాల పోటీలే ఫ్యాషన్ సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి బయో టెక్నాలజీ లో మాస్టర్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పి హెచ్ డి చేసే అవకాశం వచ్చిన ఆమె సైన్యంలో చేరేందుకు నిశ్చయించుకుంది. దీనికి స్ఫూర్తి ఆమె తల్లి శోభ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ అందాల పోటీల్లో గెలిచిన తర్వాత సి డి ఎస్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది.అనంతరం చెన్నైలో సైనిక శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా సైన్యంలో చేరింది మెత్వాని.













