Saturday, 28 Nov, 2026

బంగారం గురించి కంగారొద్దు

బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా  మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా  ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం […]

పిల్లలకు నమ్మకం ఇవ్వండి

టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా కోపంగా వుంటున్నా  ప్రతి దానికీ కనీళ్ళు పెట్టుకున్నా  కారణాలు తెలుసుకునేందుకు సున్నితమైన ప్రయత్నం చేయాలి. తోటి పిల్లల్తో సర్దుకోలేకపోతున్నా  ఏదైనా లైంగిక హింసకు గురవుతున్నారా లేదా ఏదైనా సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారా? ఏదైనా వత్తిడి లోనయ్యారా ? అన్ని విషయాలను తరచి అడిగి తెలుసుకోవాలి. తల్లితండ్రుల కంటే […]

త్రీడి తో శిల్ప కళా సౌందర్యం

ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో  టీపాయి  పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో ఇల్లు బ్రహ్మాండమైన కళాఖండం చుపేయాలనుకుంటే త్రీడి స్టీరియోస్కోపిక్ ఉడ్ కార్వింగ్ వాల్ పేపర్లను ఒక్కసారి చూడండి. త్రీడి ఎఫెక్ట్ తో హాల్లో  మొత్తంగా విశ్వరూపంగా ఆక్రమించే దేవతా మూర్తినో పూలు రెమ్మలు చెక్కిన సహజమైన అడవి దృశ్యమో దారుశిల్ప సౌందర్యమో  అమ్మాయిలు నృత్యం చేసే పౌరాణిక దృశ్యమో దేన్నీ […]

విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం  ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే […]

674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్

షెరిల్ శాండ్ బర్గ్  రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని  చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG  అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. […]

అన్ హర్ట్ స్టోరీస్ ఇప్పుడు మనసారా చదవండి

హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా ఉన్న ఎందరో స్త్రీల గాధలు ఏవీ  అక్షరబధం  కాలేదు. భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ గూగుల్ ఒక చక్కని ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. విమెన్ ఇన్ ఇండియా అన్ హర్ట్ స్టోరీస్ అని గూగుల్ సర్చ్ చేస్తే ఒక అద్భుతమైన స్త్రీలకే సొంతమైన ఒక విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టచ్చు. పురాణాల […]

అందమంటే రంగూ శరీరపు లావణ్యమేనా

సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో పత్రాలు సహజంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అప్పుడు అందం మేకప్ సన్నగా ఉండటం. ఖరీదైన బట్టలు ధరించటం పక్కన పట్టేసి కెమెరా ముందుకు వెళ్ళిపోతారు హీరోయిన్లు హీరోలు కూడా. ధమ్ లగాకే పైసా సినిమాలు భూమీ ఫెడ్నేకర్  సౌత్ ఖాన్ మాఫ్ సినిమా లో ప్రియాంక చోప్రా […]

పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన  పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా […]

ఫుంకీ డిజైన్స్ తో బంగారు నగలు

బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి వాటిపైన ఫుంకిగా కనిపించే ఎనామిల్ రంగుల్ని అద్దటంతో అవి పిల్లలకు సరిగ్గా నప్పుతాయి. సాధారణంగా ఇలాంటి ఫుంకీ నగలు పిల్లలకు నచ్చుతాయి. కానీ వన్ గ్రామ్ గోల్డ్ లేదా పూసలతో, ప్లాస్టిక్ తో చేస్తే తమ పిల్లలకు వేసి ఆనందించే పెద్దవాళ్ళకు నచ్చవు. అందుకే ఈ బంగారు నగలు […]

సౌందర్య దేవత టాన్ హే అనేసారు

పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో […]

88 ఏళ్ల యవ్వన గుళిక

DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో  వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి  సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ […]

వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది

పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే.. ఊహు.. మాకొద్దు మాకు పేస్ట్రీలు పఫ్ లు కేకులే కావాలి. అని పంతం పట్టి కూర్చున్న పిల్లల సంఖ్యే 90 శాతంగా ఉందని డయాబెటిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెపుతోంది. లంచ్ బాక్స్ లో సమతులాహారం వుందా ? శరీరానికి కావాల్సిన కొవ్వులు పోషకాలు అందుతున్నాయా లేదా […]

ఎండపడనివ్వని సుకుమారులకో హెచ్చరిక

అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల  దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్  లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్  రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే  అవకాశం పెరుగుతుంది. […]

తెల్లనివి తింటేనే ఆరోగ్యం

ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం  అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా  కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్  ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. […]

ఇలా చేసి చుడండి ఫిదా అవుతారు

రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం  విసుగును మాయం చేస్తుంది. మెదడు రోజువారీ గందరగోళం నుంచి బయటపడి విశ్రాంతిగా ఉంటుంది. ముందుగా ఫోన్ చెక్ చేసుకోవటం కొద్ది సేపు ఆపండి లేదా రెండు మూడు గంటలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఓ వారంలో రెండు రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పై మనసుపెట్టి ఆ రెండు […]

జడ పక్కకు జరిగింది

ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో ఎన్నెనో ప్రయోగాలు చేసారు. ప్రతి సినిమాలో హీరోయిన్  ఒక కొత్త లుక్ లో కనబడిందీ  అంటే దాదాపు కొత్త హెయిర్ స్టయిల్ ప్రయోగం ముందుంటుంది. హై పోనీ ,లో పోనీ ..ఇవన్నీ పాత సస్టయిల్స్ ఇప్పుడంతా సైడ్ పోనీదే హవా. నడుస్తోంది. లూజ్ గా  హెయిర్ వదిలేయటం సరే. […]

వీటి ప్రేమలో పడతాం తప్పదు

ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్ పైగా ఎర్రని పచ్చని ఆకుపచ్చ వర్ణాలతో ఇల్లు వర్ణ మిశ్రమంగా అయిపోతుంది. ఈ చలికాలంలో మన ప్రాణం వాతావరణానికి  పిటానియా ,అంధురియం , సినరేరియా ,జినియా , చామంతి , బంతి వంటివి పెంచుకునేందుకు బావుంటాయి. ఇవన్నీ వివిధ రంగుల్లో పూలు పూసే కుండీల్లో పెంచుకునే ,మొక్కలు. పోషకాలు […]

అభాగ్యుల చెఫ్ కృష్ణన్

ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను పట్టించుకోము కానీ తమిళనాడు  మదురై కి చెందిన నారాయణ్ కృష్ణన్ తన జీవిత సార్ధకతని నిర్ణయించుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్. ఇరవై ఏళ్లకే స్విట్జర్లాండ్ లోని పెద్ద హోటల్లో లక్షల రూపాయిలు జీతం తో ఇంకో ఉద్యోగం ఎదురుగా వుంది. ఆకలితో అలమటించే మానసిక వికలాంగులు, […]

లెగ్గింగ్స్ తో ప్రాబ్లమ్

కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ లెగ్గింగ్స్ ని ఫ్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడో అధ్యయినం ఈ లెగ్గింగ్స్ అందం తో పాటు బరువునీ పెంచుతాయని చెపుతుంది. బిగుతుగా వుండే లెగ్గింగ్స్ వల్ల తొడలు, ఉదర భాగం పొత్తి కడుపు కండరాల్ల చలనం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు పెరుగుతుంది. వేసవిలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ […]

ప్రత్యేక సందర్భాల కోసం పార్టీ వేర్ సారీస్

పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ పార్టీ వేర్ సారీస్,ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్స్ లో కానీ అద్భుతం అనిపించేలా వుంటాయి. ఇవన్నీ దాదాపు మైసూర్ సిల్క్, బెనారస్, కంజీవరం, జ్యుట్, నెట్, బ్రాసో, వెల్వెట్ వంటి వస్త్రాల శ్రేణిలోంచే ఎంచుకుని, ట్రెండ్స్, సీజనల్ పార్టీ వేర్ గా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేకంగా మల్టీకలర్ రెయిన్ […]