• గుండెకు ఆరోగ్యం.

    చర్మం అందంగా ఆరోగ్యంగా వుండేందుకు జీడిపప్పు ను ఆహారంలో చేర్చుకొమ్మని, రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకుంటే అందులో భాగంగా జీడిపప్పు ఉండేలా చూసుకోమ్మని చెప్పుతున్నాయి అద్యాయినాలు.…

  • ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. అందుకే ప్రతి దానికి హైరానా పడకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెదర్లాండ్ పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర పోయే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశం 65 శాతం తక్కువట. అలాగే గుండె ఆరోగ్యం కోసం డి-విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. వంటకాల్లో ఉప్పు తక్కువగానే వాడాలి. వేరు వేరు రంగుల పండ్లను రోజుకు కనీసం ఒక్కటైనా తినాలి. వంటనూనెలో గుండెకు మేలు చేసే ఫ్యాటి యాసిడ్స్ ఒక్కో నూనెలో ఒక్కో రకంగా వున్నాయి. కనుక రెండు మూడు రకాల నూనెలు కలిపి వాడాలి. మెంతులు, ఆవాలు, అవిసలు, పాలకూర, చేపలు వుండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఈ అలవాట్లు, ఆహారం ఆరోగ్యం కోసం

    ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట.…