• మృదువుగా వుండే నాయికా పాత్రలో ఒదిగిన జయలలిత తనలోని నటిని వెనక్కి తోసి నాయకురాలయ్యారు. అలాగే రాజకీయ జీవితంలో తిరుగులేని స్థానం సంపాదించాక నాయకురాలి వెనక్కి తోసి విప్లవ నాయకి బిరుదుని వదిలేసి అమ్మగా ఆదరించే దేవతగా నిలబడ్డారు. రెండు చేతులా ఆమె అందించిన సంక్షేమ పథకాలతో ఆమెకు అన్ని వర్గాలు నీరాజనం పట్టాయి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి బ్రాహ్మణ స్త్రీ నాయకత్వం వహించిందీ అంటే రాజకీయాల్లో ఆమె ఎంత కఠినమైన నిర్దాక్షణ్యమైన నేతగా రూపం మార్చుకుందో తెలుస్తుంది. సొంత కుటుంబం అంటూ లేదు జయలలిత తమిళనాడు ప్రజలందరికీ అమ్మ అయిందని నిరూపించేందుకు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించికొనేందుకు ఆమెకు చివరివీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్ లో హాజరైన జన సందోహంమే నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆమెదో ప్రత్యేక అధ్యాయం. వెండి తేర నేలిన ఈ ఒకనాటి తార అఖండ జ్యోతిగా వెలిగేందుకు ఆకాశానికి చేరింది పది కోట్ల మంది తమిళ ప్రజల అమ్మ అన్న పిలుపుకి అందనంత దూరoవెళ్లిపోయింది

    అమ్మకు అక్షరాంజలి

    వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు…