సాధించలేనిది ఏముంది!
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో ఎంఫిల్ పూర్తి చేసిన వినయనా ఖురానా జీవితం స్ఫూర్తి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ఢిల్లీకి చెందిన వినయనా సెలెబ్రెల్ పార్సీ తో జన్మించింది .కాళ్లు, చేతులు, మాట, నడక అన్ని సమస్యలే. అయినా చక్కగా చదువుకొని ఢిల్లీ యూనివర్సిటీ లోనే గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఎంతోమందికి మెంటారింగ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదిక గా ఎంతో మంది లో స్ఫూర్తి నింపుతోంది .ఆ క్రమంలో ఎన్నో అవార్డులు […]
డ్రోన్ పైలెట్ శాంతి విశ్వకర్మ
ఛత్తీ్సగఢ్ రాష్ట్రం రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌గఢ్ ప్రాంతం గట్ ప్రాంతానికి చెందిన శాంతి విశ్వకర్మను డ్రోన్ దీదీ అంటారు. డిగ్రీ పూర్తి చేసిన శాంతి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ కు ఎంపికై గ్వాలియర్ లో శిక్షణ తీసుకున్నారు .డ్రోన్ పైలెట్ అయ్యారు. డ్రోన్ వినియోగం లో వచ్చిన నైపుణ్యంతో ఆమె వందలాది మంది మహిళలకు డ్రోన్ శిక్షణ ఇచ్చారు . డ్రోన్ల ద్వారా రైతుల పొలాల్లో ఎరువులు పురుగు మందులు […]
వీల్ చైర్ మోడల్
అరియానా రోజ్ ఫిలిప్ ఆంటిగ్వాలో సెలబ్రిల్ ప్యారిస్ లో జన్మించింది న్యూయార్క్ లో స్థిరపడిన ఆమె 14 ఏళ్ల వయసులో తన వైకల్యానికి కుంగిపోకుండా బ్లాగ్ లో రాయడం మొదలు పెట్టింది ఆమె రాసిన దిస్ కిడ్ కెన్ ఫ్లై ఇట్స్ అబౌట్ ఎబిలిటీ పుస్తకం ఆమె రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నది తర్వాత ఆమె మోడలింగ్ ఎంచుకొని 2018 లో మొట్టమొదటి నల్లజాతి ట్రాన్స్ జెండర్ దివ్యాంగ మోడల్ గా ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీ కి […]
ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్
లారెన్ వాసర్ ను ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్ అనే పేరుతో పిలుస్తారు ఈ మోడల్ యాక్టివిస్ట్ 24 ఏళ్ల వయసులో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కు గురైంది.2012లో ఎడమ కాలును 2018లో కుడికాలు తీసేశారు అర్ధాంతరంగా అంగవైకల్యం బారిన పడిన లారెన్ వాసర్ నెమ్మదిగా కోలుకొని కృత్రిమ కాలు ధరించి ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. కాలం ఏ గాయాన్నైనా మాన్పినట్లే వాసర్ కాలిగాయాలు, మానసిక గాయాలు మానిపోయి ఆమె మళ్ళీ తనదైన మోడలింగ్ కెరీర్ […]
సుపర్ణ కు పులిట్జర్ అవార్డ్
జర్నలిజంలో సుపర్ణ శర్మకు 30 ఏళ్ల అనుభవం ఉంది .దేశం లోని ఎన్నో ఆంగ్ల పత్రికల్లో పని చేశారు .ప్రస్తుతం స్వతంత్ర జర్నలిస్టుగా ఆల్ జజీరా రోలింగ్ స్టోన్ ఇండియా, బీబీసీ లాంటి సంస్థలకు కథనాలు రాస్తున్నారు. ఒక డాక్టర్ డిజిటల్ అరెస్ట్ వ్యవహారాన్ని గ్రాఫిక్ కథనంగా రూపొందించినందుకు కాను ఆమె పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ అవార్డు కి ఎంపికయ్యారు. ఈ కథనం అమెరికా కు చెందిన బ్లూమ్ బర్గ్ పత్రిక లో […]
ప్రకృతి రక్షణకు ఆస్కార్
ముంబై కి చెందిన పర్వీన్ షేక్ ఈ సంవత్సరం గ్రీన్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసిన ఈమె బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ తో కలిసి పని చేస్తున్నారు. నదులు వాటి చుట్టూ బతికే పక్షి జాతుల పైన పరిశోధనలు చేశారు. చంబల్ నది పై పరిశోధన చేస్తున్నప్పుడు స్కిమ్మర్ పక్షులు అంతరించిపోవడం గమనించారు. అవి ఇసుక మేటలో గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. వేట కారణంగా, ఇసుక […]
ట్రాఫిక్ రూల్స్ డాన్స్
డాన్స్ అన్నది కేవలం సరదా కోసం మాత్రమే కాదు అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని నమ్ముతుంది ఇండోర్ కు చెందిన ఎం బి ఏ స్టూడెంట్ శుభి జైన్. ట్రాఫిక్ అవేర్నెస్ పైన తన డాన్స్ మూమెంట్ తో వినోదంగా ప్రచారం చేస్తుంది. శుభి జైన్. ప్రజలకు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించడం నా లక్ష్యం అంటున్న శుభి జైన్ ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి వినూత్నమైన డాన్స్ స్టెప్ లతో సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు […]
సమాజ సమస్యల కోసం నృత్యం
పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ నర్తకి శోవన నారాయణ్ తన నృత్యానికి సామాజిక చైతన్యం జోడించి ఎన్నో నృత్య రూపకాలు తయారు చేశారు మహిళల సమస్యలు దివ్యాంగుల సమస్యల పైన రూపకాలు ప్రదర్శిస్తున్నారు ‘అసవరి’ పేరుతో నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నృత్యంలో అసాధారణ అంశాలు జోడించి ఆమె రూపొందిస్తున్న రూపకాలు ఆమె నృత్య కళాశాల విద్యార్థుల్లో మానవతా విలువలు క్రమశిక్షణ నేర్చుకునే అంశాలుగా ఉంటున్నాయి వినాశకరమైన వరదల బారిన కుటుంబాలు, భృణ హత్యలు వంటి సమస్యలు […]
యువత కోసం జెడ్ స్పాన్!
శ్రేయ నాయక్ ఉద్యోగం వెతుక్కునే యువతకు, మెంటర్లు, పెట్టుబడిదారులు కలిసి పనిచేసే వాళ్ళను దగ్గరకు చేర్చేలా జెడ్‌స్పాన్ యాప్ తీసుకొచ్చింది. ఇది డేటింగ్ యాప్ తరహాలో సరళంగా ఉంటుంది .ప్రస్తుతం ఈ యాప్ సేవలు ఉచితంగా పొందవచ్చు ప్రొఫెషనల్స్ కి సాయపడే ఇలాంటి ప్లాట్ఫారం ఇంకొకటి లేదు. టెక్ మహేంద్ర, గ్రోత్ కోచ్ వంటి సంస్థలతో పాటు ఒక అంతర్జాతీయ పాఠశాల లో ఇన్స్ట్రక్టర్ డిజైనర్, కంటెంట్ స్ట్రాటజిస్ట్ ,లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేసిన […]
గిన్నిస్ వరల్డ్ రికార్డ్
కటక్ లోని కుసుపూర్ కు చెందిన మధు స్మిత చీరకట్టుతో మాంచెస్టర్ మారథాన్ లో పాల్గొన్నది. చిన్నతనంలో యూకే లో పెరిగిన మధు స్మిత సొంత ఊరికి తిరిగి వచ్చాక స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. బాబు పుట్టాక అనారోగ్య కారణాలతో రన్నింగ్ మొదలుపెట్టిన మధు స్మిత స్థానిక పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2018 లో బెర్లిన్ మారథాన్ లో చీరకట్టుతో పాల్గొని మూడు గంటల 57 నిమిషాల 7 సెకండ్లలో […]
సంగీతం తో కొత్త జీవితం
గుజరాత్ లోని ఆరావళి పర్వత ప్రాంతంలోని అంబాజీ కి చెందిన గిరిజన బాలికల తలరాతను మార్చారు విద్యావేత్త సామాజిక కార్యకర్త ఉష అగర్వాల్. శక్తి పీఠాల్లో ఒకటైన ఈ అంబాజీ గుడి దగ్గర బిక్షాటనం చేసే బాలికలను చూశారు ఉష వారి కోసం 2011 లో అంబాజీ లోనే శ్రీ శక్తి సేవా కేంద్రం ఏర్పాటు చేశారు మొత్తం 200 మంది చిన్న పిల్లలను చేరదీసి వారికి బ్యాగ్ హైపర్ వాయిద్యాన్ని పరిచయం చేశారు. బ్యాగ్ పేపర్ […]
‘ఇంత సీరియస్ అనుకోలేదు’
రాజస్థాన్ కు చెందిన బాక్సర్ అరుంధతి చౌదరి భారత మహిళల జాతీయ బాక్సింగ్ జట్టు లో సభ్యురాలు, పాఠశాల విద్య అభ్యసిస్తూనే బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించి 15 సంవత్సరాల వయసులో బాక్సింగ్ కు మారింది అరుంధతి అశోక్ గౌతం ఆమె మొదటి కోచ్ లలో ఒకరు 2025 నవంబర్ లో నోయిడా లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నది అరుంధతి బాక్సింగ్ లో సరదా […]
ఫైనాన్షియల్ మెంటార్ నందిని
నందిని అగర్వాల్ దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఆడిటింగ్, ఫైనాన్షియల్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది విద్యార్థుల కోసం సంక్లిష్టమైన ఫైనాన్స్ అంశాలు సోషల్ మీడియాలో వేదికగా చెబుతూ ఒక యంగ్ ఫైనాన్షియల్ ఐకాన్ గా ఎదిగారు. 19 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో అత్యంత పిన్న వయసుకు రాలేనా సి ఏ గా గిన్నిస్ రికార్డు సృష్టించిన నందిని అగర్వాల్ ప్రయాణం ఒక అసాధారణ అకాడమిక్ వండర్ అని చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ కు చెందిన నందిని […]
సైకిల్ పై ఎవరెస్ట్ ప్రయాణం
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ క్యాంప్ కు సైకిల్ పై ప్రయాణం చేసి చేరుకున్నది దివ్య సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే దివ్య సింగ్. మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లాలనే ఆశయంతో తొమ్మిది రోజుల పాటు మైనస్ డిగ్రీల చలిలో 11 కిలోల బరువు మోస్తూ రాళ్లు రప్పల దారిలో సైకిల్ ను భుజాన పెట్టుకుని మోస్తూ కఠినతరమైన ప్రయాణం […]
గ్రామాల అభివృద్ధికి వంద కోట్లు
ఢిల్లీలో విలాసవంతమైన గృహాలను నిర్మించే ఎం త్రీ ఎం సంస్థ డైరెక్టర్లలో ఒకరు డాక్టర్ పాయల్ కనోడియా. హర్యానాలోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన పాయల్ సామాన్యుల కష్టాల గురించి ఆలోచించారు. ఆమె చొరవతో 2019లో ఎం 3 ఎం ఫౌండేషన్ ఏర్పాటు అయింది. విద్య నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, పర్యావరణం, క్రీడలు మొదలైన అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఈ సంస్థ 22 రాష్ట్రాల్లోని 50 లక్షల మంది జీవితాలని ప్రభావితం […]
కలల తీరానికి అబోలి
నాగపూర్ లో పుట్టిన అబోలి విజయ్ జరిత్ ఎత్తు మూడున్నర అడుగులు పుట్టుకతోనే కిడ్నీల సమస్య ఉండటంలో ఆమెకు మూడు నెలల వయసులో ఆపరేషన్ జరిగింది. అటు తరువాత ఎముకల బలహీనతతో ఆబోలి పొడుగు పెరగలేదు ఇవేమీ ఆమెకు కష్టం అనిపించలేదు సోషల్ మీడియా వేదికగా పాటలు డాన్స్ వీడియోలు చేస్తూ ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులు వేసింది. వీల్ చైర్ ఇండియా 20 21 ఫైనలిస్ట్ గా నిలబడింది. దివ్యాంగుల్లో మానసిక చైతన్యాన్ని తీసుకువచ్చే మోటివేషనల్ […]
పాత్రకు రూపం పొసే ప్రీతి
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రీతిశిల్ సింగ్ మేకప్ పైన మక్కువతో లండన్ లో ప్రోస్థటిక్ మేకప్ లో శిక్షణ తీసుకున్నది భర్త డిసౌజా తో కలిసి ముంబై లో డా మేకప్ ల్యాబ్ అనే స్టూడియోను నడిపే ప్రీతి కెరియర్ నానక్ నానక్ షా ఫకీర్ సినిమా లో తొలి జాతీయ పురస్కారాన్ని అందుకోవటం తో మలుపు తిరిగింది బాజీరావ్ మస్తానీ లో రణవీర్ సింగ్,పుష్ప లో అల్లు అర్జున్,గంగు బాయి […]
చేపల వేట సరదా
26 సంవత్సరాల ప్రాప్తి మెండన్ ఫిషరీస్ కాలేజీ లో అసిస్టెంట్ గా పనిచేస్తోంది.ఎగిసిపడే అలలు సముద్రంలో డీప్ సీ ఫిషింగ్ లో తనదైన ముద్ర వేస్తోంది.ఫిషింగ్ బోట్ పైన సముద్రం లోకి వెళ్లడం ఆమె ఇష్టమైన అభిరుచి.ఆ ఇష్టం తోనే ఆమె ఫిషరీస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసింది.చేపలు పట్టే పద్ధతులు,పడవ నిర్వహణ,చేపల వాలాను లగే టెక్నిక్ లను కోర్స్ ల్లో భాగంగా చక్కగా నేర్చుకుంది.ఖాళీ దొరికితే చాలు సముద్రంలోకి వెళ్లి డైవింగ్ చేస్తుంది.ఫిషింగ్ చేస్తుంది […]
ఫ్యాషన్ ప్రపంచంలో మెరుపు
భూమిక ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఎత్తు, శరీరవరణం కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో వివక్షులు ఎదుర్కొన్న భూమిక బికాం చదువుతూ ఇన్‌స్టా లో రీల్స్ చేసేది. ఆమె పోస్ట్ లు వీడియోలు చూసి నింజాస్ మోడల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు ఆమె ఊరికి వెళ్లారు. కెమెరా ముందు ఆమె పలికించే హావ భావాలు అంతర్జాతీయ బ్రాండ్ లకు సరిగ్గా సరిపోతాయని గ్రహించి అవకాశాలు అందించారు. ప్రఖ్యాత ఎలైట్ పారీస్, ఎలైట్ […]
శారీరక లోపాన్ని జయించి…
డౌన్ సిండ్రోమ్ తో జన్మించిన 15 సంవత్సరాల అహిదా సరమాయి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్ సినిమాల్లో రాణిస్తోంది. ఈ పాప పుట్టిన వెంటనే డాక్టర్లు ఆమెలో లోపాన్ని చెప్పేశారు. అహిదా అమ్మానాన్నలు ఆ అమ్మాయిని బలంగా పెంచారు. నాట్యం, నటన, పెయింటింగ్ వంటి రంగాల్లో శిక్షణ తీసుకుంది అహిదా. దురందర్ ది రివేంజ్ లో షరారత్ పాటకు డాన్స్ చేసిన సోషల్ మీడియాలో పెడితే అది కాస్త వైరల్ అయి దురందర్-2 లో అర్జున్ రాంపాల్ కూతురు […]
