తమ్ముడు సూర్యకు డయాబెటిస్ ఉండటంతో దివ్య ఉత్కర్ష దృష్టి ఈ మధుమేహంతో బాధపడే పేద పిల్లల వైపు మళ్ళింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. సూర్య పేరు మీదుగా ప్రాజెక్టు సూర్య ఎన్జీవో స్థాపించి వర్కర్స్ కు పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది .విరాళాలు సేకరించి సిరంజీలు గ్లూకోజ్ స్ట్రిప్స్ వంటి నిత్యావసర వైద్య సామగ్రి ఉచితంగా ఇస్తుంది. సామాజిక సేవారంగం లో ఆమె చేసిన కృషికి గాను బ్రిటన్ ప్రభుత్వం నుంచి 2023లో డయానా అవార్డు తీసుకుంది. దివ్య తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 20 26 జాబితాలో పేరు సంపాదించింది దివ్య ఉత్కర్ష.













