స్లో లివింగ్ వాట్ యు కెన్ డు అబౌట్ క్లైమేట్ చేంజ్ అనే పేరుతో భూమికి మేలు చేయాలని కోరుతూ చక్కని పుస్తకం రాశారు వందన శివ .ఆమె స్నేహితురాలు శ్రేయ జానీ తో కలిసి రాసిన ఈ పుస్తకం మనిషి తొందరపాటుతో భూమిని ప్రమాదంలోకి వెళుతున్నాడు .ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్ పేరుతో జీవితం పాడు చేసుకుంటున్నారు.కాలుష్యంతో నీరు మురికి అవుతుంది. భూతాపానికి జంతువులు మరణిస్తున్నాయి అందుకే స్లో లివింగ్ అవసరం అంటున్నారు వందన శివ .భూమిని గౌరవించు, చెట్లు నాటు,వర్షం నీటిని ఒడిసి పట్టి నీటిని కాపాడుకో అంటోంది ఈ పుస్తకం.













