ఒక కేర్ గివెర్ కధ

ఒక కేర్ గివెర్ కధ

ఒక కేర్ గివెర్ కధ

సెప్టెంబర్ 21 సినిమా తీసి 22 ఏళ్లకే గొప్ప దర్శకురాలుగా పేరు సంపాదించింది కరెన్ క్షితి సువర్ణ. మే 22న విడుదలైన ఈ సినిమా అంతకు కొద్ది రోజుల క్రితం కేన్స్ ఫెస్టివల్ ఫిల్మ్ మార్కెట్ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్నది. ఇది ఒక అల్జీమర్స్ రోగికి సేవలు చేసే కేర్ గివెర్ కధ ఒక రిటైర్డ్ ఉద్యోగి కొడుకు దగ్గర ప్రశాంతంగా ఉంటాడు. ఆయనకు అల్జీమర్స్ సూచనలు మొదలయ్యాయి అన్ని మర్చిపోతున్నాడు. ఆయనను చూసుకునేందుకు కమల అనే ఆమెను పెడతాడు కొడుకు. తన పేషంట్ జీవితం క్షీణించిపోతుంటే ఎంతో ఓపిక,మానసిక ధైర్యం ఆ వృద్ధుని పట్ల చూపించే ప్రేమ కు సంబంధించిన ఈ సినిమా చాలా గొప్పగా తీసింది దర్శకురాలు క్షితి సువర్ణ.