ఈ యాత్ర ఎందరికో స్ఫూర్తి

ఈ యాత్ర ఎందరికో స్ఫూర్తి

ఈ యాత్ర ఎందరికో స్ఫూర్తి

17 సంవత్సరాల వయసులో ఎవరెస్టు సినిమా చూసి ఆ పర్వతాన్ని అధిరోహించాలి అనుకున్నది  సానిక షా. తల్లిదండ్రులు ఇద్దరికీ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. వారి ప్రోత్సాహంతో పర్వతారోహణ లో శిక్షణ తీసుకున్నది సానిక. 15 కిలోల బ్యాక్ ప్యాక్ తో రోజుకి 20  కిలోమీటర్లు పరిగెత్తుతూ,జిమ్ చేస్తూ శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖర యాత్రకు సిద్ధమైంది .మే 20 ఉదయం 11:30 గంటలకు ఎవరెస్టు శిఖరాగ్రాన సముద్రమట్టానికి 8848 అడుగుల ఎత్తులో నిలబడింది సానిక .ఎన్నో ఏళ్ళ తన కఠోర శ్రమకు ఫలితం లభించిందని, తన ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందని చెప్తోంది సానిక షా.