శక్తి కి మరో పేరు రేణు సింఘీ

శక్తి కి మరో పేరు రేణు సింఘీ

శక్తి కి మరో పేరు రేణు సింఘీ

జైపూర్ కు చెందిన రేణు సింఘీ వయసు 60 ఏళ్ళు. టీనేజర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె 9 ఏళ్ల కాలంలో 1.5 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్  చేసింది.1200 కిలోమీటర్ల పారిస్ బ్రెస్ట్ పారిస్ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే. ఇంతకీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె సైక్లింగ్ మొదలు పెట్టింది 51 ఏళ్ల వయసులో మామూలు ట్రాక్ పైన కాకుండా మిట్ట ఫలాలున్న కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాల్లో సైకిల్ తొక్కుతూ తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది.