ఇవన్నీ వింటే తినేందుకు ఏవీ మిగాలవు
గర్బిణీ స్త్రీలు బొప్పాస, అనాస వంటివి తినకూడ దని, ఆహారానికి సంబంధించి ఒక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు. అవన్నీ వింటూ పొతే అస్సలు తినేందుకు ఏమీ మిగలవు. ఇది మంచి ఆలోచన కూడా కాదు. అలాగే మీట్, చేపలు, సాల్ట్, స్పైసెస్ ఎవీ తినోద్దంతారు కొందరు. కానీ వాటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాదారాలు ఏవీ లేవు. ప్రాసెస్డ్ మీట్, సాఫ్ట్ చీజ్ వంటి బాక్టీరియా ఎక్కువగా వుండే పదార్ధాలు మాత్రం కొంచం తగ్గిస్తే మంచిది. కొందరికి […]
ఎప్పటికప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలి
బయట కన్నా మనం 24 గంటలు శుభ్రం చేసే ఇంట్లో ఎక్కువ కాలుష్యం వుంటుంది అంటున్నారు నిపుణులు. ఎక్కువ సమయం ఇంట్లోనే వుంటాం కనుక మరింత శ్రద్దతో మరచిపోకుండా కొన్నింటిని క్లీన్ చేస్తూనే వుండాలి. ఇప్పుడు టీ.వి రిమొట్ వుంది కదా వస్తూనే రెమొట్ పట్టుకుంటాం. ఇంక ఇంట్లో అందరు చేసేది అదే. మరి ఇన్ని చేతులతో ముట్టుకునే రీమొట్ ని పాపాయి అందుకుని నోట్లో పెట్టుకుంటూ వుంటుంది. క్రమం తప్పకుండా మరి క్లీన్ చేయాలిగా. అలాగే […]
పేరే కాదు నిజంగానే అంమృతాహారం
కార్పోరేట్ వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది కనుకే చాలా మంది ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ద్రుష్టి సాదిస్తున్నారు. రోగాలు రాకుండా ఆపడం, నయం చేయడం శరీరాన్ని దృడంగా చేయడం ప్రకృతి చికిత్స లక్షణాలు వున్నాయి. ఈ చికిత్సలో వనమూలికలు కీలకం. గోధుమ గడ్డి ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది. దీన్ని సూపర్ ఫుడ్, అద్భుతాహారం అంటారు. రెండు గ్రాముల గోధుమ గడ్డి జ్యూస్ ను పాలతో కానీ మజ్జిగ తో కానీ లేదా […]
ఇలాంటి అపోహల వల్ల నష్టం
అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక నిపుణులు. ఇలా చేస్తేనే సరైన సమయంలో జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది అంటారు. కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవడంలో శరీరంలోని గ్లూకోజ్ స్దిరంగా వుంటుంది. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. ఇది కూడా అపూహానే. అన్ని రకాల బ్రేడ్స్ లోను కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. రెండు […]
అప్పుడు కూడా ఫోన్ వదలరు
18 నుంచి 25 సంవత్సరాల వయసు గల మహిళల్లో ఫోన్ లో మాట్లాడే ఇష్టం రోజురోజుకూ పెరుగుతుందని కనీసం పర్సనల్ టైమ్ ను కూడా వాళ్ళు ఫోన్ లేకుండా మెయింటెయిన్ చేయలేకపోతున్నారని మెరింత పేరెంట్స్ నెట్వర్క్ మామ్స్ అండ్ మీడియా సర్వే రిపోర్ట్ చెపుతుంది. భర్తతో సన్నిహిత సమయాల్లో కూడా వాళ్ళు టెలిఫోన్ వదలరని ఆ రిపోర్ట్. టెక్స్ట్ మెసేజ్ లకు సమాధానం ఇవ్వడం, ఫేస్ బుక్ అప్ డేట్స్ చూసుకోవడం కూడా నిమిషానికి ఫోన్ వంక […]
అన్ని ఒకేలా వుండవు
ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు […]
ఈ పరిమళాన్ని పరిమితంగా వాడాలి
అత్యుత్తమ సౌందర్య రక్షణకు నిపుణులు ఆరు రకాల ఎసెన్షియిల్ ఆయిల్స్ సూచిస్తున్నారు. గులాబీ, వీట్ జెర్మ్, ఇలాంగ్ ఇలాంగ్, రోజ్ మేరి, లైట్ లోటస్, లావెండర్ ఇవి శరీరానికి, చర్మానికి, కొన్ని జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎసెంషియల్ తైలాల్ని ఇతర తైలాల తో కలిపి పల్చగా చేయాలి. మంచి ఫలితాల కోసం కొబ్బరి,బాదం, ఆలివ్ ఆయిల్స్ కలిపి ఉపయోగించాలి. స్నానానికి వాడె బకెట్ నీళ్ళలో 10 చుక్కల ఎసెంషియల్ […]
ఆరోగ్య సిరి ఔషద గని బార్లీ
ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది. బార్లీ అద్భుతమైన అపురూప శక్తిగత గింజ ధాన్యం. రుచి పరిమళం కూడా వుంటుంది. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నల్గోవ పంట. శరీరానికి ద్రుడంగా దేహక్రుతి చెక్కగా తీర్చిదిద్దుకోవడానికీ ఈ చిన్ని గింజలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజల్లో పీచు, సెలీనియం పుష్కలంగా వున్నాయి. ఖనిజ లవణాలు ఫాస్పరస్, […]
అందం సరే… నొప్పోస్తే
హైహీల్స్ ఇష్టంలేని అమ్మాయిలు ఉన్నారా? ఇందులో బోలెడన్ని ఫ్యాషన్ వెరైటీలు కిచెన్, పెన్సిల్, పంప్స్, వెడ్జేస్, కొన్…… ఇలా దుస్తుల్ని బట్టి ఒక్కటి ఎంచుకొంటారు. కానీ ఈ హీల్స్ వాడుతున్నప్పుడు కాలి బొటన వేలి పైన బరువు పడుతుంది. ఎత్తు మడమల చెప్పుల తో పాదం లోని నరాలు శ్రమకు గురవ్వుతాయి. పిక్కలు కండరాళ్ళ పైన ఒత్తిడి పడుతుంది. దీర్ఘ కాలం పాటు ఇవి వాడితే పిక్కల పైన కండరాళ్ళు కుచించుకు పోతాయి. పాదాల అడుగున వంపు […]
పోషకాల నిలయం పుట్టగొడుగులు
పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా తాయారు చేస్తారు. ఎక్కువగా పౌష్టికాహార ఉత్పత్తుల్లో స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. వీటిల్లో 80 శాతం నీరు తక్కువ కేలరీలు సోడియం, ప్యాట్ కూడా చాలా తక్కువ. పొడిగా వుండే పుట్ట గోడుగుల్లో ఫైబర్ 8 నుంచి 10 శాతం వుంటుంది. ఒక అరటి పండు లేదా, బత్తాయి […]
ఎండల్లో పిల్లలు జాగ్రత్త
ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ […]
దీనికీ కొంత పరిమితి వుండాలి
అతి చిన్న సందేహం కలిగినా, ఏదైనా ప్రత్యేక మైన వంటకం చేయాలన్నా సౌందర్య పోషణకైనా అంతర్జాలంలోకి తొంగి చూడటం ఈ రోజుల్లో అందరికీ సహజమైన ఆలవాటై పోయింది. ఇది మంచిదే కానీ రోజులో ఎంతో సమయం ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఖర్చు పెట్టడం కూడా డబ్బు వృధా చేసినట్లే. కాలక్షేపం కోసం కావొచ్చునెట్ ని గంటల కొద్దీ ఉపయోగించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రయోజనం పొందుతాం సరే, ఖర్చు పెట్టే సమయం మాటేమిటి? ఆఫీస్ పని […]
టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి
ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం […]
అప్పుడప్పుడూ అవనూనె వాడాలి
అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న […]
అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం
సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త […]
ఈ కారణంతోనే అల్పాయుద్దాయం
మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే […]
ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు
పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం […]
బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా
వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర […]
పల్లీలు తింటే గుండెకి సమస్యే రాదు
సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా […]
తక్షణ శక్తికి చెరుకురసం
చెరుకు రసాన్ని వేసవి పానీయం అంటారు. డీ హైడ్రేషన్ కు గురైతే తక్షణ శక్తి ఇస్తుంది చెరుకురసం. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది. అంచేత మధుమేహం వున్న వాళ్ళు కూడా ఈ రసం తాగొచ్చు. చెరుకురసంలోని ఫినాల్, ఫ్లేవనాయిడ్ లు శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా కామెర్లు రాకుండా కాపాడుతుంది. అలసట నివారించగల మెగ్నీషియం, పోటాషియం, పాస్పరస్, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ చెరుకురసం లో పుష్కలంగా ఉన్నాయి. దాహం తీర్చి బలాన్ని […]
