Chinna Maata
పాట పాడితే అవార్డులే
శ్వేతా రావు యల్లాప్రగడ అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్నారు ఆమెను రాజకుమారి అని కూడా పిలుస్తారు. తెలుగు అమ్మాయి అయినా అమెరికాలో పుట్టి పెరిగింది. ఐదేళ్ల వయసు నుంచే కూచిపూడి, కథక్, భరతనాట్యం నేర్చుకున్నది. 14 ఏళ్లు వచ్చేసరికి హిప్ హాప్ ర్యాపర్ గా పాటలు వ్రాస్తూ పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నది.పాటల రచనకు ప్రతిష్టాత్మక BMI అవార్డు అందుకున్నది కాశీ టు కైలాశ్ ఆమె తాజా ఆల్బమ్. ఈ భారతీయ అమెరికన్ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది కూడా.
ప్రపంచ సాహిత్యంలో దీపకాంతి
బాను ముష్తాక్ బుకర్ ప్రైజ్ అందుకొన్న తొలి ప్రాంతీయ భాషా రచయితిగా రెండో భారతీయురాలిగా నిలిస్తే అదే రచనలో అనువాదకురాలిగా దీపా భస్తీ తొలి భారతీయ అనువాదకురాలిగా నిలిచారు వారిద్దరూ సృష్టించిన హార్ట్ లాంప్ వారి హృదయ స్పందన అని చెప్పుకోవచ్చు బాను ముష్తాక్ తన కమ్యూనిటీ లోని స్త్రీల సమస్యలు చిన్న కథలుగా రాశారు అంతే సున్నితంగా సహజంగా దాన్ని అనువాదం చేశారు దీప. దీప సొంత ఊరు కర్ణాటక లోని కొడగు జిల్లా పాఠకులను […]
పుస్తకానికో ఆలయం
కేరళ రాష్ట్రంలో ఒక విశేషమైన జ్ఞాన ఆలయం ఒకటి ఉంది కన్నూర్ కు 64 కిలోమీటర్ల దూరంలో చెరుపుళ పట్టణ సమీపంలో ప్రపోయిల్ అన్న చిన్న గ్రామంలో పుస్తకానికి గుడి కట్టారు లోపల దేవుళ్ళు ఉండరు సహజ సిద్ధమైన పెద్ద రాతి పై విగ్రహ రూపంలో పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకానికే పూజ చేస్తారు.నైవేద్యంగా సమర్పించిన పుస్తకాలే తిరిగి ప్రసాదంగా వితరణ చేస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ పుస్తక దేవుడికి ఎవరైనా పూజలు చేయచ్చు.
ఆ రింగే ప్రత్యేకం
మామూలు దుస్తుల్లో ఫ్యాషన్ గా స్టైలిష్ గా కనిపించాలి అనుకుంటే స్టేట్‌మెంట్ రింగ్స్ వైపు ఓ లుక్ వెయ్యాలి చిన్నవైన,పెద్దవైన అవి రూపానికి ఒక ప్రత్యేకమైన ఎలిగేన్స్ ఇవ్వగలదు స్టేట్‌మెంట్ రింగ్స్ ఇతర ఆభరణాల తో స్టైలింగ్ చేయకూడదు.గోళ్ళకు మ్యాటీ షేడ్స్ నెయిల్ పాలిష్ వేసుకుని ఈ రింగ్ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది అలాగే కాంప్లిమెంటరీ జ్యువలరీ చెవులకు ఉంటే అసలా స్టైలే మనల్ని గురించి మాట్లాడుతుంది అంటున్నారు స్టైలిస్ట్ లు.
ఆమె ధీర
ఇందిరా బైరికర్ తీసిన ‘ది సెకండ్ విండ్’ సినిమాలో నటించిన మయూర శివల్కర్ జీవితం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ 30 ఏళ్ల వయసులో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది.వైద్యం పూర్తయ్యాక ఆ అనారోగ్యాన్ని మర్చిపోయి అథ్లెట్ గా గుర్తింపు పొందింది.ఆమె ఆశావాదానికి నిలువెత్తు ప్రతీక బైకింగ్ లోను ఆమె ఎక్స్ పర్టే స్విమ్మింగ్ నేర్చుకుని తొలి స్వీ స్విమ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె సొంత ఊరు కర్ణాటక లోని బెల్గామ్.
స్వాగత గీతం
కేరళ స్కూళ్లలో ఒకటో తరగతి లో చేరే పిల్లల కోసం ప్రవేశోత్సవం చేస్తారు.ఆ ఉత్తరం కోసం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భద్ర హరి ఒక పాట రాసింది.శస్త్ర సాంకేతిక,వ్యవసాయ రంగాల్లో కేరళ సాధిస్తున్న పురోగతి గురించి ఆ పాట లో రాసింది భద్ర హరి ప్రభుత్వం ఈ పాటను స్వాగత గీతం గా ఎంపిక చేసింది.ప్రముఖ సంగీత దర్శకుడు అల్ఫాన్స్ జోసెఫ్ ఆ పాటకు ట్యూన్ కట్టాడు.అంత చక్కని పాట రాసిన భద్ర హరి మలయాళ […]
మహిళల విద్య ఆరోగ్యం దెయ్యం
మిస్ వరల్డ్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి అత్యున్నత ర్యాంకింగ్ సాధించింది ఇథియోపియా కు చెందిన హస్సేట్ డెరెజే అడ్మస్సు.క్రితం సంవత్సరం ఆమె మిస్ వరల్డ్ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు మహిళల విద్య ఆరోగ్యం కోసం ఆమె పనిచేస్తోంది.మాయ చారిటబుల్ ఆర్గనైజేషన్ కు అంబాసిడర్ గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహనా కల్పిస్తోంది కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న హస్సేట్ తాను ఇథియోపియా పిల్లల ఆరోగ్యం గురించే నిరంతరం ఆలోచిస్తా నంటోంది.
ప్రపంచ సుందరి సుచతా
ఒపాల్ సుచతా థాయ్‌లాండ్ తొలి మిస్ వరల్డ్,ఇప్పుడు 72 వ మిస్ వరల్డ్ గా కిరీటం అందుకొన్నది చైనీస్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ లో ఉన్నత విద్య పూర్తి చేసిన సుచతా ప్రస్తుతం బ్యాంకాక్ థమ్మసాట్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ లో బాచిలర్స్ చదువుతోంది.పదహారవ ఏటనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఆమె తన కాన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది.రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం ఫర్ హర్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది.2024 లో థాయ్‌లాండ్ మిస్ […]
ఏదైనా సాధ్యమే
కళాకారిణి సాఫ్రినా అతిఫ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. కేరళలోని కన్నుర్ లో పుట్టి పెరిగిన సాఫ్రినా జఫ్రిన్ జెస్పోక్ సుగర్ టేల్స్ బ్రాండ్ తో కేక్స్ తయారు చేస్తారు. పర్వతారోహణ ఆసక్తితో కిలిమంజారో, రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతాలు ఎక్కారు 8846 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ ఎక్కడం అక్కడ జాతీయ జెండా ఎగరవేయడం, తన జీవితంలో సాధించిన అపూర్వ విజయం అంటారు సాఫ్రినా. ఈ ఘనత సాధించిన తొలి కేరళ మహిళగా చరిత్ర […]
మొదటి మహిళ క్విజ్ మాస్టర్
క్విజ్ ఎక్సపర్ట్ శరణ్య జయ కుమార్ 85 ఏళ్ళ వయసులో క్విజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకొన్నారు.ఆమె రాసిన థౌజండ్ రెలిజియన్ క్వశ్చన్స్ కు ఎంతో మంచి పేరుంది.ఇందులో మతాలకు సంబంధించిన వెయ్యి ప్రశ్నలుంటాయి.ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసిన శరణ్య ఎన్నో క్విజ్ కాంపిటిషన్స్ లో పాల్గొని ట్రోపీలు గెల్చుకున్నారు.ఔత్సాహిక క్విజ్ ప్రేమికుల తో మోటెల్ క్రూ అనే టీమ్ స్థాపించారు.భారత దేశం లో మొదటి క్విజ్ మాస్టర్ కూడా శరణ్య […]
పాఠాలు చెప్పే కెమెరా
ఫోటోగ్రఫీ తో డాక్యుమెంటరీ స్టోరీ టెల్లింగ్ ద్వారా సామాన్యుల జీవితాలను ప్రపంచానికి ఆవిష్కరిస్తుంది దీప్తి ఆస్థాన ఎద్ జెడ్ డ్రోన్స్ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ థార్ ఎడారి లోని ఎడారి ప్రాంత మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే వెయిట్ ఆఫ్ ది వాటర్ స్టోరీ పుస్తకం ద్వారా హిమాలయ ప్రాంత నీటి సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల కన్నీటి గాధలు ప్రపంచానికి చెప్పింది కెమెరా అంటే ఒక సాంకేతిక పరికరం కాదు అది జీవితాలను ఆవిష్కరించే సాధనం […]
పర్యావరణ హితం ఆమె స్లోగన్
అర్చన కొచ్చర్ కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్, బాలీవుడ్ లో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్, మలైకా అరోరా, కంగనా రనౌత్, లకు ఫ్యాషన్ స్టైలిస్ట్ పర్యావరణ హితమైన ఫ్యాషన్ ను సృష్టించాలని ఆలోచన తో పట్టుపురుగులను హింసించి చంపకుండా పట్టు తీసి ఆ ప్రోడక్ట్ కు అహింస సిల్క్ అని పేరు పెట్టి ప్రమోట్ చేశారు. జార్ఖండ్ లోని గిరిజన స్త్రీల తో పనిచేసి వారికి ఉపాధి అవకాశాలు దొరికేలా చేశారు. అందరూ కలిసి […]
తండా నుంచి జాతీయ స్థాయికి
2024- 25 కు గాను ఎ ఐ ఎఫ్ ఎఫ్ నుంచి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నది సౌమ్య గూగులోత్ ఫుట్‌బాల్ ప్లేయర్ సౌమ్య గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగింది అండర్ 14 జట్టుకు ఎంపికైంది అండర్ 16,17 లకు కెప్టెన్ గా వ్యవహరించింది. ఇటీవలే ఆమెకు స్పోర్ట్స్ కోటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వచ్చింది ఆమెది నిజామాబాద్ జిల్లాలో కూనేపల్లి కిషన్ అనే చిన్న తండా. కట్టుబాట్ల […]
ఆధ్యాత్మిక తో ఆదాయం
జె.కె ఆరోమేటిక్ అండ్ హెర్బ్స్ పేరుతో స్టార్ట్ అప్ ప్రారంభించి పువ్వులతో అగరబత్తీలు తయారు చేయడం మొదలుపెట్టింది పాయల్ శర్మ ఆమె వ్యర్థమైన పూలతో చేసే వ్యాపారం జీవన భృతి ఆధ్యాత్మికత పర్యావరణ సంరక్షణల సమ్మేళనం జమ్ము నగరం చుట్టూ ఉండే లెక్కలేనన్ని ఆలయాలు, మసీదులు అనునిత్యం ఉపయోగించే చెత్త కుప్పల్లో కి వీధుల్లోకి చేరకుండా ఆమె ఆ పువ్వులన్ని సేకరించి అగరబత్తి తయారీ మొదలుపెట్టారు. పువ్వులన్ని శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసి చెట్ల బంక […]
అది మహిళా రాజ్యం
అందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా మండీ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ఎం పీ కల్చరల్ ఎస్పీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వెల్ఫేర్ పబ్లిక్ రిలేషన్స్ మిగతా అన్ని విభాగాలు మహిళా అధికారులే ఎమ్మెల్యే అనురాధ రాణా డిప్యూటీ కమిషనర్ కిరణ్ భరదన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సిమ్తియా ఎస్పీ ఇల్మా అప్రొజ్,జిల్లా పరిషత్ చైర్మన్ బీనా దేవి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆకాంక్ష శర్మ […]
మైక్రో గ్రీన్స్ ఎంతో ఆరోగ్యం
రెస్టారెంట్స్ లో ఈ మధ్య సలాడ్స్ లో మైక్రో గ్రీన్స్ ఇస్తున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, లైకోపిన్, ఫాలి పినల్స్ మొదలైన యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మైక్రో గ్రీన్స్ అన్నవి, కొన్ని రకాల కూరగాయలు విత్తనాలు మొలకెత్తి ఒక చిగురాకు వేసినవి, ఉంటాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు 7-14 లోపు అభివృద్ధి చెందిన ఆకులు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ.బ్రకోలి,ముల్లంగి,బీట్రూట్,ఆవాకు,మెంతి మొదలైన మైక్రో గ్రీన్స్ దొరుకుతున్నాయి. రోజుకు పాతిక గ్రాములు మైక్రో గ్రీన్స్ తో […]
ఆమె అభిరుచి పాటే
54 ఏళ్ళ వయసులో తొలి పాప్ గీతాన్ని విడుదల చేశారు మోహిత గులాటి. ఢిల్లీ తాజ్ హోటల్ గ్రూప్ మార్కెటింగ్ విభాగంలోనూ, కొలంబస్ కంపెనీ లో బిజినెస్ డెవలప్ మేనేజర్ గా వండర్ లిస్ట్ కార్పొరేట్ డైరెక్టర్ గా బ్రాడ్ విజన్ లో వైస్ ప్రెసిడెంట్ గా అనేక ఉద్యోగాల తర్వాత ఆమె తన చిన్ననాటి అభిరుచి కి సమయం ఇచ్చారు. ‘దట్ వన్ ఎమోషన్’ అన్న పాట ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో యూట్యూబ్ […]
గుండె ఆరోగ్యం ముఖ్యం
సంగీత కళాకారునిగా వ్లోగర్ గా సోషల్ మీడియాలో ప్రఖ్యాత పొందిన కలకత్తాకు చెందిన సావన్ దత్త ఇప్పుడు గుండె ఆరోగ్యాన్ని గురించిన అవగాహన కల్పించడం లో మునిగారు. గుండె ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో పదార్థాలు మన వంటింట్లో ఉన్నాయి హార్ట్ హెల్తీ చికెన్ బిర్యాని మొదలు కాఫీ వరకు అనేక వంటకాలు ఇన్స్టా లో పెడుతున్నారు సావన్ పసుపు వెల్లుల్లి నీరుల్లి నట్స్ సీడ్స్ కూరగాయలు మిల్లెట్స్ ఆకుకూరలు వంటివి కొలెస్ట్రాల్ రాకుండా గుండెను ఆరోగ్యంగా […]
ఐదోసారి గగనం లోకి
మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న బృందంలో నాసా లో పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ కూడా ఉన్నారు.ఈమెకు అమెరికన్ వ్యోమగామి ఎక్స్ 4 మిషన్ కు కమాండర్ గా పనిచేసిన అనుభవం ఉంది. నాసా తరపున మూడు సార్లు ఆక్సియమ్ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లిన అనుభవం కూడా ఉంది. ఐ ఎస్ ఎస్ కు తొలి మహిళ కమాండర్ అయిన ఘనత ఆమెదే. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపారమె. 2018 లో నాసా […]
మహిళా బౌన్సర్
అను కుంజుమన్ కేరళలో తొలి మహిళ బౌన్సర్ గా గుర్తింపు పొందారు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన అను కుంజుమన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసేది వృత్తిరీత్యా ఒక కార్యక్రమంలో ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆమెకు బౌన్సర్స్ తో పరిచయం అయింది. దేశంలో ఎక్కువమంది బౌన్సర్లు లేరని వాళ్ళు చెప్పిన తర్వాత కొంత శిక్షణ తీసుకుని మహిళా బౌన్సర్ గా ఈవెంట్స్ కు వెళ్తోంది ఆ క్రమంలో ఒక కార్యక్రమానికి మోహన్‌లాల్ కు బౌన్సర్ గా […]
