భారత యువతకు స్ఫూర్తి

భారత యువతకు స్ఫూర్తి

భారత యువతకు స్ఫూర్తి

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ,ఎల్స్వియర్ సంయుక్తంగా వెలువరించిన అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్ ల జాబితాలో సంధ్య షెనాయ్ కు మూడవ సారి స్థానం దక్కింది. సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు స్ఫూర్తి సంధ్య షెనాయ్ మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ప్రిన్సిపల్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సంధ్య షెనాయ్ కర్మ గారాల ఇతర యంత్ర పరికరాలు వల్ల వాడే వేస్ట్ హీట్ ను విద్యుత్ గా మార్చే పరిశోధనలు చేస్తున్నారు. అందుకే ఆమెకు 2021 లో యంగ్ సైంటిస్ట్ అవార్డ్,2024 లో కెమిస్ట్రీ మెడల్ లభించాయి. కెమిస్ట్రీ చదువుకున్న సంధ్య అధ్యాపక వృత్తిలో ఉంటూనే పరిశోధనలు కొనసాగిస్తున్నారు. లండన్ లోని రాయల్ సొసైటీ ఆమె కెమిస్ట్రీ ఆమెను లీడింగ్ ఫిమేల్  రీసెర్చర్ గా గుర్తించింది.