వాడి పారేయచ్చు

వాడి పారేయచ్చు

వాడి పారేయచ్చు

రియా సింఘాల్ లండన్ లో చదువుకున్నారు పర్యావరణానికి మేలు చేసే విధంగా 90 రోజుల్లో భూమిలో కలిసిపోయే వెదురుతో చేసిన టేబుల్ వేర్ ను ‘ఎకోవేర్’ పేరుతో తీసుకువచ్చారు. వెదురు తో పాటు చెరుకు పిప్పి అరెకా ఫామ్ మొక్కల భాగాల తో సింగిల్ యూజ్ కప్పులు,ప్లేట్లు, ట్రే లు కత్తిపీటలు ఇవన్నీ మొక్కల బయోమాస్ తో తయారు చేసినవి.ఎకోవేర్ ఉత్పత్తులు రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ లో, ఓవెన్ లలో ఉపయోగించవచ్చు.ఎకోవేర్ లో ఎక్కువ మంది మహిళలే పని చేస్తారు. ఈ ఉత్పత్తులకు గాను రియా నారీ శక్తి తో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.