హాయిగా నిద్ర పట్టాలి అంటే ఈ చిట్కాలు పాటించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. శారీరక మానసిక ఆరోగ్యానికి నిద్ర అత్యవసరం పని ఒత్తిడి,ఆరోగ్య సమస్యలు,ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. రాత్రివేళ గ్లాసు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడి లేదా అశ్వగంధ చూర్ణం ఒక చిటికెడు వేసి తాగితే నాడీ వ్యవస్థ నెమ్మదించి నిద్ర పట్టేస్తుంది. చామంతి, తులసి వంటి హెర్బల్ టీ లు కూడా నిద్రకు సహకరిస్తాయి. రాత్రి భోజనంలో మసాలాలు, నూనె వస్తువులు తగ్గించి తేలిగ్గా అరిగిపోయే ఆహారం తీసుకోవాలి.













