ఢిల్లీలోని బికనీర్ హౌస్ ‘రూట్స్ టు రివర్స్’ పేరుతో ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు రమణి మైలవరపు. హైదరాబాద్ కు చెందిన రమణి లండన్ లో కాంటెంపరరీ ఆర్ట్స్ లో టెక్నిక్స్ నేర్చుకున్నారు గ్రామీణుల జీవితాలను అన్నదాతల కష్టాలను పర్ఫామెన్స్ ఆర్ట్ గా మార్చారు. అంటే వేయాలనుకున్న చిత్రంలో ఆమె కూడా భాగంగా ఉంటారు. వాయిస్ ఆఫ్ వేవ్స్ తో ఉప్పాడ మత్స్యకారులు,ఇన్విజిబుల్ రూట్ లలో అరకు గిరిజనులు, “మోనాలిసా విత్ మాస్క్” పేరుతో బోడో గిరిజనుల జీవితాలు సంస్కృతులో ఆ చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మొత్తం 80 చిత్రాలు ఉన్న ఈ ఎగ్జిబిషన్ ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది.













