ఆసియా ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది సురేఖ యాదవ్. మహారాష్ట్రలోని సతారా లో పుట్టి పెరిగిన సురేఖ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింది. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసే అవకాశం వచ్చాక ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్ గా జాయిన్ అయింది. దక్కన్ క్వీన్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. రైలు కోసం రెండు ఇంజన్ల ప్యాసింజర్ ట్రైన్ నడిపే శిక్షణ తీసుకోంది తర్వాత ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్ గా ప్రమోట్ అయింది. ఆమె స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు గూడ్స్ ట్రైన్ డ్రైవర్స్ గా ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్ళు మహిళలకు ఉద్దేశించిన ట్రైన్ నడిపే సురేఖ ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకుంది.













