మహారాష్ట్ర కు చెందిన 50 ఏళ్ల వనితా బొరాడే 60 వేలకు పైగా సర్పాలను కాపాడి స్నేక్ ఉమన్ గా ప్రఖ్యాతి పొందారు ఆమెకు నారీ శక్తి పురస్కారం పేరిట పోస్టల్ స్టాంప్ గిన్నిస్ బుక్‌లో ఆమెకు శాశ్వతమైన పేరు ఉన్నాయి ఆమె పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నయ్‌గ్రామ్ దేశ్‌ముఖ్ అనే గ్రామంలో సమీపంలోని ఘాట్ బోరి అరణ్యంలో ఎక్కువ పాములు ఉండేవి. తండ్రి సాయంతో పాములు పట్టి అడవిలో వదిలేయడం నేర్చుకున్నది వనితా బోరాడే. పాము కరిస్తే ఏ చికిత్స చేయాలో గ్రామీణులకు నేర్పేందుకు మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ‘సోయ్రే వాంచరే మల్టీపర్పస్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారామె పాములను చంపేసే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని అంటారు వనితా.













