Saturday, 28 Nov, 2026

ఆడపిల్లవనే మినహాయింపులెందుకు ?

నీహారికా , ఎంత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కనిపించని అణచివేత స్పర్శకు తెలుస్తోంది అన్నావు. బాగా గుర్తించావు. ఈ పరోక్ష వివక్ష కు నువ్వే సంధానం చెప్పాలిసుమా.. ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఒక సమావేశం జరుగుతుందనుకో. ఆడవాళ్లే సర్వింగ్ అంతా చేస్తారనుకుంటారు. అలంటి వడింపులు  ఇక్కడ అందరూ ఉద్యోగులే కనుక అందరూ చేయాలి అని నీకు నువ్వే చెక్ పెట్టుకోవాలి. నలుగురు ఆడపిల్లలు మాట్లాడుకొంటుంటే ఆడవాళ్ల మీటింగ్ అనేశారనుకో వెంటనే తప్పు ఎవరైనా అలా మాట్లాడుకుంటారు […]

జిరాడే ఫ్యాషన్ ఇది

ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారేది ఒక్క డ్రెస్సులే. ఎప్పుడు ఒకే లాంటివి అమ్మాయిలు ఇష్టపడరు. ఒక్క పార్టిలో ఒక సెల్ఫీ దిగేసి, ఫేస్ బుక్ లో పెట్టేసాక అవి ఇంక పాత డ్రెస్సులే. ఇంకొ ఫంక్షన్ కు ఇవి పనికి రానివనే డిసైడ్ చేస్తారు.సల్వార్ కమీజ్ మోకాళ్ళ వరకో కాస్త కింద వరకో వుండేది కదా.అలాగే కాళ్ళాను కప్పేస్తూ నేలను జీరాడే లాగా చుట్టూ కుచ్చిల్లు కనిపించేలా వచ్చేసాయి. వీటి పైకి లాంగ్ స్కర్ట్స్ లేదా నడుము […]

ఈ విషయంలో శ్రద్ధగా వున్నామా ?

మన శరీరంలో విశ్రాంతి లేకుండా పనిచేసేది శ్వాసకోశాలే . ఆయష్షుని ఆరోగ్యాన్ని పెంచే ఈ శ్వాస కోశాలు పట్ల మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోమ్. రోజూ పది పదిహేను నిముషాలు లోతైన శ్వాస తీసుకోగలిగినా శ్వాస కోశాల శక్తి పెరుగుతోంది. స్విమ్మింగ్ జాగింగ్ ట్రెకింగ్ లాంటి ఏ వ్యాయామమైన ఊపిరితిత్తుల శక్తి వృద్ధి చేసేవే. సహజంగానే నీటికి ఎన్నో వ్యాధుల్ని నయం చేసే శక్తీ వుంది. సరిపడా నీళ్లు తాగితే చాలు. రక్త ప్రసరణ పెరిగి శ్వాస […]

ఆరోగ్య స్పృహ పెరిగింది

ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ […]

సరిగామలతో సంతోషం

సంగీతం ఎందుకు ఆనందపెడుతోంది. పశువులూ శిశువులూ  కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయంటారు ఎందుకూ ? అంటే సమాధానం దొరికింది. సరిగామలతో  ఆహ్లాద పరిచే భారతీయ సంగీతమైనా కోరేమీ అంటూ సాగే పాశ్చాత్య సంగీతమైనా వినగానే మెదడు లోని డోపమైనను ఈ ధ్వనులు నియంత్రించటం వల్ల సంతోషం కలుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమందికి మనసుకు నచ్చిన సంగీతంతో తమ కోపాల్ని భావోద్వేగాలను నియంత్రించుకోగలగటం చిరాగ్గా ఉన్నా సరే సంగీత ధ్వనులు కంతులేని ఆహ్లాదం ఇస్తాయిట. డోప్ మైన్ సంబంధించిన  మానసిక […]

ఈ పాటలు మూడు కోట్ల మంది వీక్షకులు

షారుక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రంలో అలనాటి లైలా మే లైలా రీమేక్ చేసారు. ఈ రీమిక్స్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ నటించింది. ఈ వీడియో  ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చూసిన వీడియోలో లైలా మే లైలా పాట టాప్ ప్లేసులో వుంది. ఇప్పటికే ఏ ఈపాటను యూట్యూబ్ ద్వారా మూడు కోట్లకు మందికి పైగా చూసారు. తాజాగా సృష్టించిన ఈ రికార్డు లో బాలీవుడ్ లో తన […]

బరువు తగ్గటం గ్యారెంటీ

ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే  జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం […]

30 రోజుల్లో తెల్చేయండి

ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ […]

ఖైదీ సుందరీ సాంగ్ విన్నారా ?

ఈ ఏడాది వరస హిట్స్ అన్నీ కాజల్ వే. అగ్ర కథానాయక అనిపించుకోవటం అంత ఈజీ ఏం కాదు. అందం అభినయం అదృష్టం అన్నీ కలిసి రావాలి. స్టార్ హీరోల తో పాటు పోటీగా నటించగలగాలి. కధానాయిక  ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయాలి. కాజల్ కి ఈ లక్షణాలన్నీ వున్నాయి. కనుకనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించగలిగింది. ఎంతో మంది వడపోత తర్వాతే కాజల్ ని ఎంచుకున్నారు. క్రిస్మస్ కి రిలీజ్ చేసిన […]

మురిపిస్తున్న వెండి నగలు

ఇది వరకు వెండి తో కాళ్ళకు పెట్టుకునే పట్టీలు మాత్రమే పెట్టుకోనేవాళ్ళు. మోడ్రన్ డిజైనర్స్ ఆ ట్రెండ్ మార్చేసారు. ఘల్లున మోగే వెండి మువ్వల పట్టీలు కాస్తా మామిడి పిందెలతో రంగులు అద్దుకుని వడ్డానాలు అయిపోతాయి. ఇలాంటివే రెండు వరుసలు వస్తే నడుము పైన అమరిపోతాయి చీరకే అందాన్ని ఇస్తున్నాయి. క్రిస్టల్స్ ని కలుపుకుని అందమైన నగలు అవుతున్నాయి. మెటాలిక్ మెరుపులద్దుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ అందమైన తెల్లని నగలు ఫ్యాషన్ పరుగుల్లో ఒక్క […]

ఆ నవ్వు వెల ఎంత?

నీహారిక, చాలా కరక్టయిన ప్రశ్న అడిగావు. మనకో లక్ష్యం తప్పని సరిగా వుండాలా? మన కధేమీటో ముందే  తలుస్తుందా? గుడ్. జీవితం లో జీవించి వుండేందుకు ప్రతి వ్యక్తికి తనదైన కారణం వుంటుంది. ఆ కారణమె జీవిత లక్ష్యం. దాన్ని మనం రుచి చూడాలి. నాతో ఏముంది ఒక లక్ష్యం సృష్టించేందుకు అనుకోని వాళ్ళకి వాళ్ళ బలం మీద వాళ్ళ ద్రుష్టి పెట్టలేదన్నదే సమాధానం. పుట్టి పెరిగేటప్పుడు మన సర్వెంద్రియాలు ఎదో ఒక ఇష్టంతో ఉంటాయి. ఆ […]

ఆరు నెలల సెలవు ఆమె ఆలోచనే

తమిళనాడు రాష్ట్రం లో ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన సంక్షేమ పధకాల విషయంలో తెర వెనక నుండి ఎంతో కృషి చేసిన గిరిజా వైద్యనాధన్ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. తంజావూరుకు చెందిన గిరిజ తండ్రి ఎన్.వెంకట్రామన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా విధులు నిర్వహించారు. 1981 లో సివిల్ సర్వీసెస్ లో చెరో వైద్య, వ్యవసాయ, రవాణా శాఖల్లో పని చేసారు. ఆమె శ్రద్ధ తీసుకుని కసరత్తు చేసిన ఆరు నెలల ప్రసూతి సెలవుల […]

వంటింట్లో డాక్టర్ ఈ వాము

వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి […]

నెయిల్ పాలిష్ కోటీ 25 లక్షలు

గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే కళ్ళు తిరుగుతాయి. లాస్ ఏంజెల్స్ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ ఈ నెయిల్ పాలిష్ విడుదల చేసింది. ఒక్క సీసా ఖరీదు 2,50,000 డాలర్లు అంటే కోటీ ఇరవై లక్షలు సుమారుగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్స్  కలగలిపి తయారుచేశారట ఈ […]

ప్రకృతి సహజమైన లిప్ స్టిక్ ఇది

హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల  దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం […]

ఆత్మీయులకో బహుమతి కోసం

కేరళ టూరిజం నిర్వహించే స్వర్గాలయ క్రాఫ్ట్ విలేజ్ ఓసారి ఆన్ లైన్లో చూడండి. హ్యాండ్ లూమ్ టెక్స్టైల్స్ జ్యూవెలరీ శిల్పాలు ఆధునికమైన బ్యాగ్స్ యాక్సెసరీస్ ఎన్నెనో అందమైన వస్తువులున్నాయి. కొబ్బరి పీచు అరటి వెదురు ఫైబర్ కొబ్బరి చిప్పలు గవ్వలతో చేసిన ఎన్నో కళాఖండాలున్నాయి. సంప్రదాయ క్రాఫ్ట్ తో  పాటు ఆధునికమైన వస్తువులు ఎన్నో వున్నాయ్. ఈ స్వర్గాలయ  క్రాఫ్ట్ విలేజ్ కొజె కోడి ,కన్నూర్ జాతీయ రహదారి పైన ఇరంగల్ వద్ద 20 ఎకరాల విస్తరంలో […]

ధనమిచ్చే శ్రామికుడు

సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని […]

మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని […]

అందానికే అందం ఇల్కాల్ శారీస్

కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం  ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల  పోగులతో చేత్తో ముడులు వేస్తూ  కూల్ బ్రైట్ కలర్స్ తో […]

కాస్తంత తక్కువ స్థాయిలో

మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం […]