• గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల తెలివితేటలు వృద్ది అయ్యే అవకాశం వుంది. అరిటాకులో భోజనం కడుపులో క్రిములు చంపేస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపే శక్తి అరిటాకులో వుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. అన్నం వేడిగా వందగానే అరిటాకులో వడ్డిస్తే అరిటాకులో వుండే ఔషద విలువలు భోజనంలో కలుస్తాయి. రక్తం శుద్ధి అవ్వుతుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెపుతున్నారు. చర్మ కాంతి మెరుగు పడుతుందని వైద్యుల సూచన. కొన్ని హోటల్స్ లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా ఆకు కట్ చేసి భోజనం పళ్ళెం లో వేసుకున్నా మంచిదే.

    అరిటాకు భోజనం చాలా మంచిది

    గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్…

  • అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని విశ్లేషించింది. నిల్వ చేసిన ఆహారం తినే అమెరికన్ల కంటే అన్నం పచ్చడి .పప్పు పాయసం సాంబారు పెరుగు ఊరగాయల్లో ఎన్నెనో క్యాలరీలు. అత్యంత రుచీ ఉన్నాయని పరిశోధన సారాంశం. పైగా మనం తినే భోజనం ఖర్చు తక్కువదీ పోషకాలు ఎక్కవదీ అనేసింది. ఊరగాయలు అప్పడాలు వడియాలు ఒరుగులూ తప్ప మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూరలు కోసి వండుకుని తింటాం కనుక ఈ అలవాటే ఎంతో మంచిదనీ పోషక విలువల తో కూడి వుంటుందని తేల్చింది.

    మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

    అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం…