April 2017
మా నాన్న లాగ నేను చేయలేను
హీరోయిన్ లయితే ఏ వయస్సులో చెయ్యాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి కానీ లేని పోని ప్రయోగాల జోలికి పొతే నష్టం అంటోంది. శృతి హాసన్. మానాన్న గారు కమల్ హాసన్ చిన్న వయస్సులో పండు ముసలి వాడిగా నటించాడు. మరగుజ్జుగా నటించాడు. కధానాయకుల కు అలంటి ప్రత్యామ్నాయం వుండదు. మేం వయస్సైపోయినట్లు నటిస్తే ఎవ్వరూ చూడరు అంటోంది శ్రుతి నిజంగా నడి వయస్సులో జరగాల్సినట్లు నిజంగా నడివయస్కురాలి పాత్ర వస్తే అది ఆ వయస్సులో చేయాలి. […]
ఈ కొంచెం చేయగలిగితే చాలు
డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ […]
రోజుకొక్కటి చాలు
https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-39.html
పూర్తి స్థాయి ధన్యాల్ని ఎంచుకోవడం బెస్ట్
రోజుకు 70 గ్రాముల పూర్తి స్థాయి ధాన్యాలు తినేవాళ్ళలో ఇరవై రెండు శాతం మరణం రేటు తక్కువగా వుందని అధ్యాయినాలు పేర్కొంటున్నాయి. ఆహారం వీలైనంతగా హోల్ గ్రైన్స్ వుంటే బరువుపైన అదుపు వుంటుంది. ముఖ్యంగా వీట్ జర్మ్, బ్రౌన్ రైస్, డార్క్ బ్రెడ్, పాప్ కార్న్ ఇతర ధాన్యాలు తినే మహిళల్లో తినని వాళ్ళతో పోలిస్తే బరువు పెరిగ్ర్ రిస్క్ సగం తక్కువే పూర్తి స్థాయి ధాన్యాలు 16 గ్రాముల చొప్పున ఒక సర్వింగ్ అనుకోవాలి. వీటిలో […]
ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం
ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి తప్పించుకోవాలంటే తీరిగ్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. యాంటీ బాక్టిరియల్ గుణాలున్నా సోపు వాడాలి. వేడి నీళ్ళు బాక్టిరియా చంపేస్తాయి. స్నానం అయ్యాక శరీరం పూర్తిగా తడి ఆరేలా తడుచుకుని వదులుగా వుండే నూలు దుస్తులే వేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి కాస్త తగ్గిస్తేనే మంచిది. […]
నేచురల్ బ్లీచ్ అంటే ఇవే
ఎండలోని వెళితే చాలు మాడి పోతుంది. ఎంత కళ్ళజోళ్ళు వాడినా ఏం చేసినా సెగలు పొగలకి చర్మం నల్లబడుతుంది. అందుకే సన్ స్క్రీన్ ని తప్పని సరిగా చర్మనికి రాసుకోవాలి. ఈ సీజన్ లో యాపిల్ సైడర్ వెనీగర్ ని వాడాలి. ఇది కమిలిన చర్మం వేడిని లగేస్తుంది. కళ్ళకు వేడి తగలకుండా గొడుగు పట్టుకు పోయినా నామోషీ ఫీల్ అవ్వోద్దు. వాటర్ బేస్డ్ స్కిన్ ప్రోడేక్ట్స్ మాత్రమే సమ్మర్ లో వాడాలి. S.P.F రక్షణ వున్న […]
వేసవి వెళ్ళేదాకా ఇవే ఫ్యాషన్
సమ్మర్ కాటన్స్ అంటాం. సమ్మర్ లో నూలు దుస్తులకు వున్న డిమాండ్, సప్లయ్, మన ఇష్టం అన్నీ కలిసి కాటన్స్ ని ముందు వరుసలో కుర్చోనిస్తాయి. మిగతా ఫ్యాబ్రిక్స్ వైపు చూస్తామా అంటే కాస్త కష్టమే. మెత్తగా తగులుతూ, వేడిని రానివ్వకుండా చేస్తూ. చమటతో తడిసి ముద్దయ్యె ప్రమాదం నుంచి కాపాడే కాటన్స్ తో ఫ్యాషన్ డిజైనర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఇవి సాదా సీదాగా ఫుల్ గా కూడా వుండవు. మంచి డిజైనర్ లుక్ తో, […]
రెండూ అద్భుతమైన కళలే
నీహారికా, మాట్లాడటమా? వినడమా? ఏది మంచి కళ అన్నావు. మాట్లాడటం సందేహం లేకుండా మంచిదే. కానీ వినడం కూడా మంచిదే తెలుసా ఎక్స్ పర్ట్స్ అంటారు, మనం సాధారణంగా నిమిషానికి 225 పదాలు మాట్లాడతామాట కానీ 500 వందల పదాలు వినగాలమాట. అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వింటూ మన మనస్సు తనలో తానుఎదుటి మనిషి మ్యాటర్ విశయాన్ని చెప్పేది వింటూ విషయాన్నీ ఎనలైజ్ చేసుకుంటూ వింటుంది. ముందు మంచి శ్రోతగా వుంటే, ఆ తర్వాత మంచి […]
'చెలియా' తో నా కల నిజమైంది
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-7.html
పద్మావతి కోసం రహస్యంగా వెళ్ళొచ్చా
సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో, మస్తానీ గా ప్రేక్షకులను అలరించిన దీపికా పడుకొనే పద్మావతి చిత్రం కోసం చాలా కష్టపడిందిట. ఎప్పుడు చూసినా పద్మావతి చరిత్రకు సంబందించిన పుస్తకాలతోనే కనిపిస్తుందిట. ఈ చరిత్రలో తన పాత్ర కోసం రాజస్థాన్ లోని బిత్తుర్ ఘడ్ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలను చుసిందిట దీపికా. చిత్ర బృందం […]
తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం
తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై […]
ఏదీ నిరుపయోగం కాదు
ఎన్నో డిజైనర్ డ్రెస్సులకు లేస్ ఏటాచ్ చేస్తుంటారు. డ్రెస్ పని అయిపోయినా లేస్ చేక్కుచెదరకుండా వుంటుంది. దాన్ని అలా పారేయకుండా. ఇంటి అలంకరణ కోసం ఉపయోగించింది అని చేఅపుతున్నారు. ఇంటీరియర్ డెకరేటర్లు. పాత కుండీలకు చెక్కగా రంగులు వేసి వాటి చుట్టూ జిగురుతో ఈ లేస్ అంటించి మద్య మధ్యలో కుందన్ రాళ్ళు అతికించి అందులో ఆర్టిఫిషియల్ డెకొరేషన్ కోసం పెట్టే పువ్వులు, ఆకులూ పెట్టొచ్చు. దీన్ని కదలకుండా హాల్లో ఉంచుతాం కాబట్టి ఈ కుండీ మురికిగా […]
పనికొస్తుందో, రాదో ముందే చూడండి
బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా మూలన పడేయడం జరుగుతుంది. అందుకే బ్యాగ్ కొనే ముందే అది ఏ సందర్భంలో వాడబోతున్నామో ద్రుష్టిలో పెట్టుకోవాలి. ఖరీదు ఎక్కువైన నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫిస్ కు తీసుకెళ్ళె బ్యాగ్ లో టిఫెన్ డబ్బాలు, కాలేజీ బ్యాగ్ లో పుస్తకాలు ఎన్నో తీసుకోవాలి. అదే పార్టీలకయితే చిన్నది కావాలి. […]
డామినేషన్ హీరోలదే
ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక ప్రాధాన్యం వున్న సినిమాలు ఇక్కడ రావని చాలా మంది అనడం, ఇది వున్న మాటే అంటోంది కధానాయిక రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఐఫా ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ పైన నల్ల గౌనుతో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మాయి, సినిమా రంగమనే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న […]
ఇదెంతో ఆరోగ్యం, ఉపయోగం
తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 7686, రెడ్యుసింగ్ చక్కర 1.66, కొవ్వు 0.19, మంసాకృతులు 1.04, కాల్షియం 0.86, ఖనిజాలవనాలు, ఇనుము వంటి పోషక విలువలుంటాయి. స్త్రీల లో, పిల్లల్లో రక్తహీనత తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ పొటాషియం, ఎక్కువ చక్కర […]
తోలి రిక్షా పుల్లర్ జాస్మిన్
మొసమత్ జాస్మిన్, బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక మహిళా రిక్షా పుల్లర్. మొసమత్ ఆక్సర్ ఫాతిమా, వయస్సు 45. ఐదేళ్ళుగా రిక్షాలాగుతుంది. భర్త వదిలేసి పొతే కుటుంబాన్ని గాలికి వదిలేసాయి లేక జీవనాధారం కోసం ఎంచుకున్న వృత్తి ఇది. ముగ్గుకు పిల్లలు సంప్రాదాయాలకు మరుపేరుగా వున్న బంగ్లాదేశ్ లో ఒక ఆడమనిషి రిక్షా లాగడం మాములు విషయం కాదు. అల్లా రెండు చేతులు, కళ్ళు ఇచ్చింది పని చేసుకుని బ్రతికేందుకే నా బిడ్డలను చదివించుకోవాలి. నేనెంచుకున్న మార్గంలో […]
ఎ.పి.ఎస్. నాలక్ష్యం
ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి ట్రాన్స్ జెండర్ ఎస్.ఐ ఆమె హిజ్రాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుతున్న విషయంపై న్యాయపోరాటానికి దిగి తన తో పాటు మరో 21 మంది హిజ్రాలకు పోలీస్ జాబ్స్ వచ్చేలా చేసింది. ఈ వారంలో శిక్షణ పూర్తి చేసుకొన్న ప్రీతికా త్వరలోనే ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించనున్నది. తమిళనాడుకు చెందిన ప్రీతికా అబ్బాయిగా పుట్టి లింగ మార్పిడితో ఆడపిల్లగా మారింది. కంప్యుటర్ అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్ […]
వాయిదా తత్వంలో అంతా నిరాశే
నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన […]
కూల్ డ్రింకుల్లో కలిపే ఐస్ తో సమస్యే
ఎండల్లో పిల్లల్ని బయటకు తీసుకు పోయే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు వరకు వేళ్ళనే వద్దు. అధిక ఉష్ణోగ్రతలో ఆరు మాసాలలోపు పిల్లలు త్వరగా డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం వుంది. కాటన్ డైపర్ క్లాత్ లే వేయాలి. ఆహారం తీసుకునే పెద్ద పిల్లలకు లస్సీ, మిల్క్ షేక్, ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. వీటిలోని పోషకాలు పిల్లలకు నీరసం రానీయవు. బయట దొరికే పండ్ల […]
కాలం చెల్లిన మందుల్ని అలా విసిరేయద్దు
తేదీ దాటిపోయిన మందుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తూ వుంటాం. అవి కాస్త చెత్తకుప్పల పైకి వెళ్ళి పోతాయి. అవులో, మేకలో వాటిని అమాంతం నమిలేస్తూ వుంటాయి. అందుకే అందుకే మందులను పాక్ చేసినవి చేసినట్లే ఎక్స్ పైరీ డేట్ అయిపొతే అలా విసిరేయకండి అంటున్నారు. పర్యావరణ వేత్తలు. ఒక వేల మన ఇంటిలో పిల్లలు, పెంపుడు జంతువులూ కుడా పొరపాటున ఆ మందుల్ని కొరికి తినే అవకాసం వుంది. లేబుల్ పైన ప్రత్యేక సూచనలు ఇచ్చారేమో చూడాలి. […]
