• ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి తప్పించుకోవాలంటే తీరిగ్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. యాంటీ బాక్టిరియల్ గుణాలున్నా సోపు వాడాలి. వేడి నీళ్ళు బాక్టిరియా చంపేస్తాయి. స్నానం అయ్యాక శరీరం పూర్తిగా తడి ఆరేలా తడుచుకుని వదులుగా వుండే నూలు దుస్తులే వేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి కాస్త తగ్గిస్తేనే మంచిది. మెగ్నీషియం ఎక్కువ వుండే ఆకుకూరలు, బ్రోకోలీ, బంగాళదుంప, నట్స్, తృణధాన్యాలుతీసుకుంటు, నీళ్ళు ఎక్కువ తాగాలి. వంటసోదలో నిమ్మరసం కలిపి శరీరానికి పూనుకుని పదినిమిషాల్లో కడిగేసుకోవాలి. రాత్రి పూట యాపిల్ సైడర్ వెనిగర్ రాసుకోవచ్చు. స్నానానికి ముందు పసుపు చందనం పూత కూడా మంచిదే. వీలున్నప్పుడు, రిలాక్స్ అయ్యేందుకు మంచి గంధపు పొడి మెడకు చేతులకు రాసుకున్న ఈ చమట వాసన నుంచి తప్పించుకోవచ్చు.

    ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం

    ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి…

  • వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దీని వల్ల శరీరం తాజాగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ పుదీనా ఆకులు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఎక్కువ స్పైసి పదార్ధాలు తినకూడదు. నీరు బాగా తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్లు విడుదలై శారీరిక దుర్వాసనలు ఉండవు. యాంటీ పరిస్పిరెంట్ ప్రభావం రోజంతా ఉండి ఏ విధమైన తెల్లని మచ్చలు రాకుండా చర్మం తాజాగా ఉంటుంది . ఫ్రూట్ స్ప్రే వల్ల పాదాల దుర్వాసన రాదు. పైగా హాఫ్ షూ వేసుకునేవారికి ఇది అవసరం కూడా. అన్నిటి కంటే ముఖ్యం రెండు పూటలా స్నానం చేయటం. అలాగే టీవీ ల్లో ఎన్నో డెమోలు చూస్తూ ఉంటాం. చర్మం చెమటలు పొడిగా ఉంటుందనీ దుర్వాసన రాదనీ అంటారు. కానీ ప్రతి బ్రాండ్ లోను టీ ట్రీ ఆయిల్ నుండి బేకింగ్ సోడా అలోవెరా వంటివే ఉంటాయి . ఎసెన్షియల్ ఆయిల్స్ హెర్బ్స్ తో ఆహ్లాదకరమైన పరిమళాలు ఉంటాయి. కానీ వాటంతట అవి సేద్యం తగ్గించలేవు. మంచి సువాసన ఎంచుకోవటమే.

    శరీరం తాజా సువాసన కోసం

    వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో…