• డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీలోని కెఫెన్ జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. కాఫీలో చెక్కర కలపొద్దు. కొద్ది శాతంగా కెఫెన్, యాంటీ ఆక్సిడెంట్స్ వుండే గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా బరువు పెరిగే ప్రసక్తే లేదు. వంటకాల్లో కొబ్బరి నూనె ఉపయోగించ గలిగితే ఇందులో స్పెషల్ ఫ్యాట్స్ తో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. పిచు పదార్ధమైన గ్లూకోమనవ సప్లిమెంట్ వల్ల కుడా బరువు తగ్గించేందుకు ఇంతకంటే టిప్స్ ఇంకేం లేవు.

    ఈ కొంచెం చేయగలిగితే చాలు

    డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక…

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

    పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

    శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్…