సూది కుట్టు తో సందేశం
పశ్చిమ బెంగాల్ కు చెందిన మౌమిత బసక్ సూది కుట్టు తో నేర్పేది. సాంప్రదాయ ‘కాంతా’ అనే కుట్టును ఆధునికమైన ఆలోచన తో కలిపి చీర పైన అందమైన డిజైన్లు చేస్తుంది మౌమిత. టీ, కాఫీ రంగుల మరక తో మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు కలిపి కూడా ఆమె కుట్టి వినూతమైన డిజైన్లు స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర అంతర్జాతీయ అవార్డ్ పురస్కారాలు అందుకున్నది మౌమిత. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, […]
మెదడు ఆరోగ్యం కోసం ఈజ్
మెదడు సంరక్షణ కోసం 2020లో ‘మార్బుల్స్ హెల్త్’ అన్న సంస్థ ప్రారంభించారు రమ్య ఎల్లాప్రగడ లక్షయ్ సాహ్ని తో కలిసి ఈ సంస్థ న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శస్త్రచికిత్స లేకుండా మెదడు సంరక్షణ చేస్తారు. మందులు మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొంది వీరు తయారు చేసిన ఈజ్ దేశంలోనే మొదటి నాడి ఉత్తేజిక పరికరం. ఇది ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో ఇళ్లలో కూడా వినియోగిస్తున్నారు. ఈ మార్బుల్ హెల్త్ […]
ఆ గ్రామంలో ఒక్కతే ఎల్సీ
అమెరికా లోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న మొనోవి అన్న గ్రామంలో ఒకే ఒక మహిళ నివాసం ఉంటారు. ఆ గ్రామానికి ఆమె మేయర్ పేరు ఎల్సీ లైబ్రేరియన్ 1902 లో ఆ గ్రామం ఏర్పడింది రైలు, రోడ్డు వేశారు. 1930 లో ఆ గ్రామ జనాభా 150 ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతే రూడీ ఆయన భార్య ఎల్సీ మాత్రమే మిగిలారు. 2004 లో రూడీ మరణించాడు ఇక ఎల్సీ ఒక్కతే ఆ గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో […]
సైన్స్ సామ్రాజ్యంలో విజేత
సైన్స్ కేవలం పురుషుల రంగం కాదని నిరూపిస్తున్నారు మహిళలు నిగర్ షాజీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లో అడుగు పెట్టారు వీనస్ మిషన్ కు అధ్యయన డైరెక్టర్ గా రిసోర్సెస్-2 ఎ కి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1 కు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేయటం ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ మలుపు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ […]
అజ్రక్ ఎక్స్ పర్ట్
గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ముబస్సిరా ఖలీద్ ఖత్రి మగవాళ్ళు మాత్రమే చెక్క ముద్రలతో చేసే అజ్రక్ కళను నేర్చుకొని తొలి కళాకారిణిగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న అజ్రక్ ముద్రణ లో తన స్వేచ్ఛ చిత్రణ ను కాస్త కళ నైపుణ్యాన్ని జోడించి కొత్త డిజైన్స్ సృష్టించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అవార్డు అందుకున్నది. ఆమె డిజైన్ చేసిన వస్త్రాలు దేశీయ అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నారు. ఎలిషియన్ అనే […]
వాట్ ఉమెన్ వాంట్
ఆడవాళ్ళ ముచ్చట్లు గా ఒక తేలిక భావన గా భారతీయ సమాజంలో ప్రచారం అయిన కబుర్లు ఇప్పుడు ఇంటింటి పాడ్ కాస్ట్ లుగా మహిళా సాధికారతకు దిక్సూచిగా మారిపోయాయి అందం తెలివి జోడి కడితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. కరీనా కపూర్ పోస్ట్ చేస్తున్నా వాట్ ఉమెన్ వాంట్ పాడ్ కాస్ట్ షో కేవలం స్టార్ ధామ్ నే కాకుండా సమాజంలోని సునీత మైన అంశాలను చర్చించేందుకు తన ఇమేజ్ ఒక సాధనంగా వాడుకుంటుంది కరీనా […]
నారీ శక్తి
2025 లో తొలిసారిగా రాష్ట్రపతికి ఏ డి సి గా నియమితురాలైంది యశస్వి సోలంకి. రాష్ట్రపతికి వెన్నంటి నిలిచే సైనికాధికారిణి ఏ డి సి అంటారు. ఇందులో ముగ్గురు మిలటరీ, ఒకళ్ళు నేవీ, మరొకరు ఎయిర్ ఫోర్స్ కి చెందిన వాళ్లు ఉంటారు. హర్యానా కు చెందిన యశస్వి 2012లో షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఎంపిక అయింది. రెండేళ్ల శిక్షణ కేరళలోని ఎజిమళ ఇండియన్ నేషనల్ అకాడమీ లో తీసుకుంది. జామ్ నగర్ లోని ఐ. […]
నైకా సృష్టికర్త
నైక బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈ- కామర్స్ కంపెనీ స్థాపించి స్వయంకృషితో బిలినియర్ అయినా భారతీయురాలు ఫల్గుణి నాయర్. భారతదేశపు తొలి మహిళ యూనికాన్ వ్యాపారవేత్త. ఆమె బ్రాండ్ నైకా. అంటే కేవలం కాస్మెటిక్స్ మాత్రమే కాదు బ్యూటీ ఫ్యాషన్ అన్నీ కలిపిన మహిళల సెల్ఫ్ కేర్. ఉమెన్ సెంట్రిక్ బ్రాండ్. 2021 లో నైకా ఐపిఓ విడుదల అయ్యాక కంపెనీ విలువ భారీగా పెరిగింది. వ్యాపారంలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఫార్చ్యూన్ ఇండియా ఆమెను […]
అత్యున్నత అవార్డ్ లు అందుకున్న సుమ
భారతదేశంలో సైంటిస్ట్ లకు ఇచ్చే అత్యున్నత అవార్డు లైనా జె పి బోస్ మెమోరియల్ అవార్డ్ మేఘనాథ్ సాహు అవార్డ్ అందుకున్న మహిళా శాస్త్రవేత్త సుమా వర్గీస్.1968 లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ అందుకొన్న సుమ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ పరిశోధన విభాగంలో దశాబ్దం పైగా పనిచేస్తూ నేత్ర అనే సిస్టం ను కనిపెట్టారు. అన్ని రకాల వాతావరణాల్లో శత్రు విమానాలను అత్యంత ముందుగా గుర్తించేందుకు ఈ నేత్ర పరికరం స్కాన్ చేసి సాయం […]
విజయానికి మరో పేరు కరుణ
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాకు చెందిన కరుణ కుమారి గిరిజన కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే 80 శాతం చూపు లేకుండా ఉన్న కరుణ విశాఖలోని అంధుల పాఠశాలలో చదువుకున్నది. ఆమెలో ఉన్న క్రికెట్ టాలెంట్ గుర్తించి అక్కడి డ్రిల్ టీచర్, ప్రిన్సిపాల్ ఆమెను ప్రోత్సహించారు. శ్రీలంక లో జరిగిన అంధ మహిళా క్రికెటర్ల టి-20 భారత్ గెలుచుకున్న సందర్భంలో కరుణ చేసిన 42 పరుగులే కాస్ భారత్ చేతికి వచ్చేలా చేసింది. ఆమె క్రికెట్ టాలెంట్ వెనుక […]
ఆమె భద్రత దళాధిపతి
143 ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్. పి. ఎఫ్) కు తొలిసారిగా మహిళా డైరెక్టర్ జనరల్ అయ్యారు సోనాలి మిశ్రా 1983 లో ఐ పి ఎస్ కు ఎంపికైన సోనాలి మధ్యప్రదేశ్ కేడర్ లో పనిచేశారు. ఆ రాష్ట్రంలో ఎస్ పి గా ఆ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ కేంద్రానికి అధిపతిగా వ్యవహరించారు. ఆ రాష్ట్ర పోలీస్ అకాడమీ పర్యవేక్షించింది ఆర్.పి.ఎఫ్ కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాల లో […]
యూట్యూబ్ ఎం డి గా గుంజన్
జంషెడ్పూర్ లోని ఎక్స్ ఎల్ ఆర్ ఐ నుంచి ఫైనాన్స్ లో ఎంబీఏ చదువుకున్న గుంజన్ సోనీ యూట్యూబ్ ఎం. డి గా నియమితురాలయింది. స్టార్ ఇండియా టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జలోరా గ్రూప్ సి ఈ ఓ గా పనిచేసిన గుంజన్ తన వైవిధ్యమైన మార్కెటింగ్ రంగా అనుభవంతో ఇప్పుడు యూట్యూబ్ లోకి ఇండియా ఎం డి గా వచ్చారు.20 ఏళ్లుగా బిజినెస్ టెక్నాలజీ మార్కెటింగ్ ఈ కామర్స్ విభాగాల్లో గణించిన అనుభవంతో గుంజన్ […]
విద్యా దానం
‘టచ్ ఫర్ ఇండియా’ సంస్థ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు షాహీన్ మిస్త్రీ. బాల్యం అంతా విదేశాల్లో పెరిగిన షాహీన్ ముంబై విశ్వవిద్యాలయం లో సోషియాలజీ లో బి ఏ చదివారు ముంబై మురికి వాడల్లో బీదలను గమనించాక ఆమె వారి జీవితాల్లో మార్పు తేవాలనుకున్నారు. 1989 లో ఆకాంక్ష ఫౌండేషన్ స్థాపించారు. కాలేజీలో చదువుతూనే అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు విద్య అందించడం ఆకాంక్ష లక్ష్యం. 8 […]
హార్ట్ ల్యాంప్ కు బుకర్
2025 కు గాను హార్ట్ ల్యాంప్ అన్న కథా సకల వాని కి బుకర్ ప్రైజ్ అందుకున్నారు భాను ముస్తక్. కనడంలో రాసిన ఈ కథలను ఇంగ్లీష్ అనువాదం చేసిన బుకర్స్ పోటీకి పంపారు. ఈ కథ సంచలనం అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పుట్టిన భాను కన్నడ మధ్యమంలో చదువుకొని న్యాయవాది అయింది. సామాజిక ఉద్యమకారిణి పత్రికా రంగంలో బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసింది. తన చుట్టూ కనిపిస్తున్న వివక్ష మహిళల పట్ల […]
అద్భుతమైన ఇంజనీర్
కాశ్మీర్ లోయలో ప్రవహించే చీనాబ్ నదిపైన 1486 కోట్లతో నిర్మించిన రైలు వంతెన నిర్మాణానికి ఇంజనీర్ మాధవి లత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ గా పని చేస్తున్న మాధవి లత నది వంతెన నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్టర్ ఆఫ్ కాన్స్ తో కలిసి పనిచేసింది లోయ గుండా ప్రవహించే నది, అటు ఇటు కొండలను కలుపుతూ ఎలాంటి పిల్లర్స్ వెయ్యకుండా వంతెన నిర్మించారు. 2021 లో […]
ఆదివాసీల క్షేమం లక్ష్యం
మూడున్నర దశాబ్దాలుగా బస్తర్ దంతేవాడ సుక్మా ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీలకు వైద్య సేవలు అందిస్తున్నారు సునీత గోడ్ బోలె చదువుకునే రోజుల్లోనే మహారాష్ట్రలోని రాయగడ లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవారు. ఆయుర్వేద వైద్యులైన రామ్‌చంద్ర తో కలిసి పెళ్లయిన రెండు వారాలకే ఛత్తీస్‌గడ్ లో వైద్య సేవ నిమిత్తం వెళ్లారు సునీత దంతేవాడ సమీపంలోని బార్సూర్ లో ఆసుపత్రి తెరిచారు. స్థానిక భాష నేర్చుకుంటూ వారిలో ఒకరిగా కలిసిపోయి సేవలు అందిస్తున్న ఈ దంపతులకు పద్మశ్రీ […]
స్వరాల రాణి కి పద్మశ్రీ
అస్సాం గాయని పోఖిలా లేక్తిపి పోఖిలా కార్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా స్వరాల రాణిగా పేరుపొందింది పోఖిలా కార్బీ భాషలో ఆధునిక మ్యూజిక్ ఛాయలతో పాటలు కట్టి పాడేది. సాంప్రదాయ జానపదాలను క్యాసెట్లుగా తీసుకువచ్చి ప్రచారం చేసింది. తమ ఆదివాసి కళ అంతరించిపోకుండా ఎంతో కృషి చేసింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి శిల్పి అసోం గౌరవ పురస్కారాలు అందుకున్నది క్వీన్ ఆఫ్ మెలోడీ గా పేరు తెచ్చుకున్న పోఖిలా కు కళ […]
గేమింగ్ లోకి ఆశా శర్మ
మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగానికి కొత్త సి ఈ ఓ భారత సంతతికి చెందిన మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు బిజినెస్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకొని ఎస్ సి జాన్సన్ అండ్ సన్ కంపెనీ లో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగంలో చేరింది. ఆశా శర్మ రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ లో కోర్స్ ఏ ఐ విభాగంలో సీనియర్ అధికారిగా చేరారు. ఫ్లాట్ ఫామ్ ల నిర్మాణం పార్ట్నర్షిప్ లు డిజిటల్ ఎకో సిస్టమ్ లో […]
అందాల క్రిస్టల్ నగలు
వజ్రాలకు బదులు అదే మెరుపుతో ఉండే అత్యంత తక్కువ ధరకు దొరికే క్రిస్టల్ ఆభరణాలకు ఆదరణ పెరిగింది భారీ క్రిస్టల్ ఆభరణాలు వేడుకల్లో బాగుంటాయి. క్రిస్టల్స్ అన్ని రంగుల్లో రూపొందుతూ ఉంటాయి కనుక దుస్తులకు మ్యాచ్ అయ్యే హారాల సెట్ ఎంచుకోవచ్చు మల్టీ కలర్ క్రిస్టల్స్ చేసే బ్రేస్ లెట్,లాంగ్ చైన్,గోల్డెన్ కలర్ బీడ్స్ తో కలిపి అల్లే క్రిస్టల్స్ హారాలు సాంప్రదాయ వస్త్రాలకు చక్కగా మ్యాచ్ అవుతాయి.
వంటకు వయసేం అడ్డం
సరస్వతి పాటి వయసు 90 ఇంటర్నెట్ లో సాంప్రదాయ వంటలు చేస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నది. కేరళ కు చెందిన ఈ పాటి రెండేళ్ల క్రితం ది అయ్యర్ పాటి ఛానల్ ను తన మనవరాలు తో కలిసి ప్రారంభించింది. ఆరోగ్యకరమైన సాంబార్,రసం, పొడులు,పచ్చళ్ల గురించి సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండుకోవాలి చెబుతోంది. లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో నడుస్తున్న ఈ ఛానల్ యువతరానికి ఎంతో నచ్చింది కేరళ లోని పాలకాడ లో సాంప్రదాయ ఉమ్మడి […]
