కటక్ లోని కుసుపూర్ కు చెందిన మధు స్మిత చీరకట్టుతో మాంచెస్టర్ మారథాన్ లో పాల్గొన్నది. చిన్నతనంలో యూకే లో పెరిగిన మధు స్మిత సొంత ఊరికి తిరిగి వచ్చాక స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. బాబు పుట్టాక అనారోగ్య కారణాలతో రన్నింగ్ మొదలుపెట్టిన మధు స్మిత స్థానిక పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2018 లో బెర్లిన్ మారథాన్ లో చీరకట్టుతో పాల్గొని మూడు గంటల 57 నిమిషాల 7 సెకండ్లలో క్రాంతి సాల్వి రేస్ గెలిచిందని తెలుసుకున్నాక ఈ ఏడాది ఏప్రిల్ 20న మాంచెస్టర్ మారథాన్లో ప్రాంతీయ సంప్రదాయ ఇక్కత్ చీర తో పోటీల్లో పాల్గొన్న ది మధు స్మిత. క్రాంతి సాల్వి రికార్డును బద్దలు కొడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డుతో తన పేరును సువర్ణాక్షరాలతో నిలుపుకుంది మధు స్మిత.














