సమాజ సమస్యల కోసం నృత్యం

సమాజ సమస్యల కోసం నృత్యం

సమాజ సమస్యల కోసం నృత్యం

పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ నర్తకి శోవన నారాయణ్ తన నృత్యానికి సామాజిక చైతన్యం జోడించి ఎన్నో నృత్య రూపకాలు తయారు చేశారు మహిళల సమస్యలు దివ్యాంగుల సమస్యల పైన రూపకాలు ప్రదర్శిస్తున్నారు ‘అసవరి’ పేరుతో నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నృత్యంలో అసాధారణ అంశాలు జోడించి ఆమె రూపొందిస్తున్న రూపకాలు ఆమె నృత్య కళాశాల విద్యార్థుల్లో మానవతా విలువలు క్రమశిక్షణ నేర్చుకునే అంశాలుగా ఉంటున్నాయి వినాశకరమైన వరదల బారిన కుటుంబాలు, భృణ హత్యలు వంటి సమస్యలు కూడా శోవన నృత్యానికి ఇతివృత్తాలు  కథక్ నృత్యం లో స్త్రీ సాధికారత లింగ సమానత్వం పై నృత్య రూపకాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.