రాజస్థాన్ కు చెందిన బాక్సర్ అరుంధతి చౌదరి భారత మహిళల జాతీయ బాక్సింగ్ జట్టు లో సభ్యురాలు, పాఠశాల విద్య అభ్యసిస్తూనే బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించి 15 సంవత్సరాల వయసులో బాక్సింగ్ కు మారింది అరుంధతి అశోక్ గౌతం ఆమె మొదటి కోచ్ లలో ఒకరు 2025 నవంబర్ లో నోయిడా లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నది అరుంధతి బాక్సింగ్ లో సరదా పడుతోంది అనుకున్న గాని ఆమె ప్రపంచ స్థాయిలో మెరిసిపోతోందని ఊహించలేదు అంటున్నారు ఆమె తండ్రి సురేష్.













