జాగిలాల హాండ్లర్ ఈమె
అస్సాం రైఫిల్స్ కు చెందిన పి.వి శ్రీ లక్ష్మి పారా మిలటరీ దళం లో జాగిలాల హ్యాండ్లర్ గా ఎంపిక అయ్యారు. ఇప్పటివరకు మగవాళ్లే చేస్తున్న ఈ ఉద్యోగంలో శ్రీ లక్ష్మి మొదటి మహిళగా గుర్తింపు పొందారు. శునకాల సైకాలజీ క్షేత్రస్థాయిలో ఎత్తుగడల విభాగంలో అడ్వాన్స్డ్ కోర్స్ లు పూర్తి చేశాక శ్రీ లక్ష్మి ఈ బాధ్యతలు తీసుకున్నారు.సైన్యం లో మహిళలు సత్తా చూపిస్తున్నారని చెప్పేందుకు శ్రీలక్ష్మి చక్కని ఉదాహరణ.
విజయపథంలో విల్వా
ఐటీ లో ఇంజనీరింగ్ చేసిన కృత్తికా కుమారన్ విజయవంతమైన వ్యాపారవేత్త. తమిళనాడు లోని గొబ్బి చెట్టి పాలయమ్ ఆమె పుట్టిన ఊరు తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్న ఆమె తల్లి కోసం ఆమె సహజ పదార్థాలతో చర్మ కేశ సంబంధమైన ఉత్పత్తులు చేయడం మొదలుపెట్టారు. వాటిని ‘విల్వా’ పేరుతో ఫేస్ బుక్ లో అమ్మకాలు ప్రారంభించారు ఇప్పుడు కృత్తిక కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. తమిళనాడు లో సొంత స్టోర్ లు ఉన్నాయి. ఆమె వ్యాపారం 30 […]
సూపర్ మోడల్ ఈ బొమ్మ
దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సూన్-హ్వా 80 ఏళ్ల వయసులో మోడలింగ్ లోకి వచ్చారు ఆసుపత్రిలో నర్సుగా పని చేసే చోయ్ ఒక రోగి రికమండేషన్ తో 74వ ఏటా సియోల్ ఫ్యాషన్ వీక్ లో అరంగేట్రం చేశారు. దక్షిణ కొరియాలో ప్రచురితం అయ్యే హార్పర్స్ బజార్, ఎల్లె వంటి ప్రముఖ మేగజైన్ ల కవర్ పేజీల పైన ఆమె ఫోటో వేశారు. దానితో ఆమె పాపులర్ అయిపోయి వాణిజ్య ప్రకటనల్లో నటించారు తర్వాత గ్లోబల్ మిస్ […]
క్రేజీ స్టైలిస్ట్
ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ లో మసాబా గుప్తా చాలా ప్రత్యేకం పెద్ద పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్స్ తో ఆమె ఫ్యాషన్ బ్రాండ్ క్వీన్ హౌస్ ఆఫ్ మసాబా సెలబ్రెటీలకు పెద్ద ఆకర్షణ. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి స్టార్స్ క్యాజువల్స్ నుంచి ఈవెంట్ స్పెషల్స్ వరకు మసాబా నే అడిగేస్తారు. తండ్రి విలియం రిచర్డ్ లాగా టెన్నిస్ వైపు తల్లి నీనా గుప్తా లాగా యాక్టింగ్ వైపు చూడకుండా తన క్రియేటివిటీ […]
పాతవే ఇప్పటి ట్రెండ్
పాత తరం నాటి పట్టు జార్జెట్ చీరలతో ఆఫ్ సైక్లింగ్ చేసి కొత్త డ్రెస్ లుగా మార్చి ధరించటం ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్. అంచులున్న కాటన్, పట్టు చీరలతో చేసిన ఇండో వెస్ట్రన్ మోడల్ డ్రెస్ లు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, నెట్టెడ్ చీరలతో చేసిన అనార్కలి లాంగ్ గౌన్ కుర్తీలు పట్టు బ్రోకెడ్, బెనారస్ తో చేసిన ఓవర్ కోట్స్ లాంగ్ జాకెట్స్ పలాజోలు ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ చీరల […]
చిన్న నవ్వే చాలు
ఒక చిన్న చిరునవ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్నే మార్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. ఇది మానసిక ప్రయోజనాలనే కాదు, సామాజిక బంధాలు బలపడటం లోను కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులకు మనపై నమ్మకం కలిగేలా చేసేది ఈ చిరునవ్వే అంటారు. ఎదుటివారిని చూసి చిన్న నవ్వు నవ్వితే నేను మీతో స్నేహపూర్వకంగా ఉంటాను, నాతో ప్రమాదం లేదు, నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అనే పాజిటివ్ సంకేతం ఎదుటి వాళ్లకు వెళుతుందట ఇతరుల నమ్మకం సంపాదించాలంటే పెదవుల పైన చిరునవ్వు […]
మామూలు పెరుగే శ్రేష్టం
యోగర్ట్ లో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయనుకోవటం అవాస్తవం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో సాధారణ పెరుగు కంటే కాస్త ప్రోటీన్ అధికం కానీ మార్కెట్ లో దొరికే యోగర్ట్ లో అనేక ఫ్లేవర్ లు కలుపుతారు కనుక అసలు వాటి వాడకం మంచిదే కాదు. యోగర్ట్ లో తీపి కోసం చేర్చే చక్కెర ఇతర పదార్థాలు క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. ఈ యోగర్ట్ కంటే మామూలు వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు కొవ్వు […]
కేశరక్షణకు వెన్న
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అందం విషయంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వాటిలో కొన్ని విలక్షణంగా కనిపిస్తాయి కూడా. ఇథియోపియా మహిళలు వెన్నను కేశ సౌందర్యానికి ఉపయోగిస్తారు ఆఫ్రికా నేలపై సూటిగా పడే సూర్యకిరణాల నుంచి తక్షణ గా కూడా వెన్నను పేర్కొంటారు. కేశాలకు బాగా వెన్న పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తారు దీని వల్ల జుట్టుకు బాగా బలం వస్తుందని పెరుగుతుందని నమ్ముతారు వెన్న లోని ఫ్యాక్టరీ యాసిడ్లు విటమిన్లు జుట్టుకు తేమని చక్కని […]
స్ఫూర్తినిచ్చే వారసురాలు
వ్యాపార రంగంలో ఆరితేరిన కుటుంబం నుంచి వచ్చింది ఇషా అంబానీ పిరామల్ ముఖేష్ అంబానీ కుమార్తె ఆమెను దేశం లోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళగా చెబుతారు. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ గా పని చేస్తోంది ఆమె. అలాగే ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర ఆమెదే.ఇషా గత సంవత్సరం మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు తీసుకున్నారు నెక్స్ట్ రైజింగ్ స్టార్స్ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది ఆమె వార్షిక […]
ఔషధ గుణాలు ఎక్కువ
తెలుపు గులాబీ రంగులో మెరిసిపోయే గునుగు పూలు ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు.ఈ పూల మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చాలా ఎక్కువ వీటి ఆకులు చర్మంపై గాయాలు, పుండ్లు తగ్గిస్తాయి. అధిక రక్తపోటు నియంత్రించగలవు యూరినరీ ఇన్ఫెక్షన్ లు, మలబద్ధకం నివారణ కోసం ఈ మొక్క పువ్వులు కూడా ఉపయోగపడతాయని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.
మృదుత్వాన్ని ఇచ్చే బేబీ ఆయిల్
చిన్నపిల్లలకు రాసే బేబీ ఆయిల్ లో మినరల్స్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి ఈ నూనె రాత్రిపూట పాదాలకు రాసుకుని పది నిమిషాలు మర్దన చేస్తే చర్మం కోమలంగా మారిపోతుంది. స్నానం చేశాక కాస్త తడిగా ఉన్నప్పుడే ఈ బేబీ ఆయిల్ రాసుకుంటే, శరీర చర్మం మృదువుగా అయిపోతుంది. శరీర భాగాల్లో, జుట్టుకు కూడా బేబీ ఆయిల్ మెరుపును మృదుత్వాన్ని తీసుకువస్తుంది జిడ్డుగా ఉండదు.పొడి చర్మం గలవారు బేబీ ఆయిల్ ప్రతిరోజు ఉపయోగించవచ్చు.
తనను తానే తీర్చి దిద్దుకొని
గుజరాత్ డిపార్ట్‌మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి మహిళా ప్రిన్సిపల్ సెక్రటరీ గా మోనా ఖండార్ గుజరాత్ రెవెన్యూ పట్టణ,గ్రామీణ గృహ నిర్మాణ అభివృద్ధి విభాగాల్లోనూ జిల్లా అధికారిణిగా ఆర్థిక విభాగం సేవలు అందించారు మోనా ఖండార్.టాటా ఎలక్ట్రానిక్స్,కేన్స్ టెక్నాలజీ వంటి లక్ష కోట్లు విలువ చేసే భవిష్యత్ ప్రోజెక్టుల పర్యవేక్షణ ఆమెదే సెమికన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా మార్చే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో చోటు […]
శక్తి నిచ్చే అనాస టీ
ఎండ వేడికి అలసట రాకుండా అనాస టీ తాగ మంటున్నారు ఎక్సపర్ట్స్ ఒక కప్పు నీటికి పావు కప్పు పైనాపిల్ తొక్కలు కొన్ని పైనాపిల్ ముక్కలు దంచిన చిన్న అల్లం ముక్క వేసి మరిగించాలి బాగా మరిగాక వడగట్టి నిమ్మరసం,తేనె కలిపి తాగచ్చు పైనాపిల్ తొక్కలోని బ్రోమాలైన్ ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది.దీని లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణ క్రియను వేగవంతం చేస్తాయి.యాంటీ ఆక్సిడెంట్స్ నీరసం తగ్గించి తర్వాత శక్తిని ఇస్తాయి.నోటికి రుచి ఆరోగ్యానికి మేలు చేసే […]
ఆస్కార్ స్టార్ కే నగలు చేశా
కాంటెంపరరీ జ్యువెలరీ డిజైనర్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది కావ్య పొట్లూరి.చెన్నైకు చెందిన కావ్య అమెరికాలో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ టెక్నాలాజి,జెమాలజీలో డిగ్రీలు తీసుకొంది 2020 లో మిలన్ ఫ్యాషన్ వీక్ కోసం ఇండియన్ డిజైనర్ రాకీ స్టార్ తో కలిసి పనిచేశాక గుర్తింపు వచ్చింది.ఆస్కార్ నటి అనన్య షాన్ బాగ్ కోసం పూర్ణిమా ఇంద్రజిత్ తో కలిసి పనిచేసింది.భూమి ఫెడ్నేకర్,మీనాక్షి చౌదరి,కీర్తి సురేష్,సారా అలీఖాన్ అనన్య పాండే వంటి వారికి జ్యువెలరీ అందిస్తోంది కావ్య పొట్లూరి.
ఆరోగ్యాన్నిచ్చే అల్లం
అల్లం తో ఎన్నో ఆరోగ్య సమస్యలు పోగొట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.అల్లం చక్కగా కడిగి మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి.ఉదయాన్నే మరిగించి తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.అల్లం తురుము బెల్లం కలిపి ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక అరస్పూన్ తిన్న మంచిదే.అల్లం టీ అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరనివ్వదు,అల్లం దంచి రెండు చుక్కల రసం తీసి అందులో ఒక స్పూన్ నిమ్మరసం ,ఒక స్పూన్ తేనె కలిపి […]
విడాకులంటే వేడుక
ఆఫ్రికా లోని మారిటానియా లో విడాకులు ఒక వేడుకగా పండగలా చేస్తారు.ఈ దేశం లోని మారి తెగ లోని మాతృస్వామ్య పద్ధతులే అందుకు కారణం ఇక్కడ ఒక వివాహిత ఎన్ని విడాకులైన తీసుకోవచ్చు.ఇక్కడ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది.విడాకులు తీసుకున్న ఆడవాళ్లు తమ సమన్లు ఇక్కడ అమ్మేస్తారు.పాత భారాన్ని వదులుకొని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామని దీనికి సంకేతం విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకొనే ప్రయత్నం చేస్తారు.కొందరు పై చదువులు చదువుకొంటారు.పిల్లల సంరక్షణ […]
వృధా అరికడితే ఎంతో లాభం
జీరో వేస్ట్,నిత్య జీవితంలో సస్టెయినబిలిటీ వంటి పర్యావరణ హిత అంశాలపై యూట్యూబ్,ఇంస్టాగ్రామ్ వేదిక గా సలహాలు ఇస్తోంది నయన ప్రేమ్‌నాథ్.బెంగళూరుకు చెందిన నయన ఆర్కిటెక్చర్ చదివింది.ఈమె వీడియో లకు ఎంతో ఆదరణ.ఫోర్బ్స్ ఇండియన్ టాప్ డిజిటల్ స్టార్స్ లో చోటు చేసుకొంది నయన.ఈమె టెడెక్స్ స్పీకర్.గ్రీన్ సర్కిల్ పేరుతో వృధా వస్త్రాలతో యాక్ససరీలు,ఇంటి అలంకరణ వస్తువులు తయారు చేసి అమ్ముతోంది నయన ప్రేమ్‌నాథ్.వృధా ను అరికడితే భూమికి పర్యావరణానికి బోలెడంత మంచి జరుగుతుంది అంటుంది.
అరటి పండు ఆరోగ్యం
ఉదయం అల్పాహారానికి మధ్యాన్న భోజనానికి మధ్య ఒక అరటి పండు తింటే శరీరంలో పేరుకొనే అదనపు సోడియం ను మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది అంటారు డాక్టర్లు.ఒక అరటి పండులో 400 నుంచి 450 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.ప్రాసెస్ట్ పదార్థలు,చిరుతిళ్ళు,నిల్వ పచ్చళ్ళు తినడం ద్వారా అవసరానికి మించిన ఉప్పు శరీరంలో చేరుతుంది.ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.ఈ ఉప్పును బయటికి పంపేందుకు అరిటిపండే మంచి మందు అంటున్నారు డాక్టర్లు.
ఇది పంచదార వంటిదే
కొబ్బరి చెట్టు మొవ్వ లేదా పువ్వు దగ్గర ఒక గాటు పెట్టి అందులోంచి వచ్చే తియ్యని ద్రవాన్ని మరిగించి ఎండబెట్టి పొడి చేస్తే వచ్చే పొడినే కోకోనట్ షుగర్ అంటారు.మామూలు చక్కెర కంటే ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఐరన్,జింక్ పొటాషియం ఇంకా ఫైబర్.ఈ చక్కెర లో ఉంటుంది.మాములు పంచదార లగే దీన్ని ఎక్కువగా వాడితే బరువు పెరగడం,డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటాయి.పరిమితమైన మోతాదులో వాడితే ఎంతో బలాన్ని ఇస్తుంది కోకొనుట షుగర్.
రవాణా రంగంలో నీతా
మహారాష్ట్ర కు చెందిన నీతా స్కూల్ వ్యాన్ డ్రైవర్ గా కెరీర్ మొదలు పెట్టింది ఆమెకు ముగ్గురు పిల్లలు భర్త వదిలేశాక పోషణ కోసం వ్యాన్ డ్రైవర్ గా జీవితం మొదలు పెట్టి నెమ్మదిగా బస్ లు కొనుగోలు చేసింది.నీతా ట్రావెల్స్ పేరుతో ఒక సంస్థ ప్రారంభించింది ఈమె ట్రావెల్స్ ద్వారా 13 బస్ లు తిరుగుతున్నాయి,అలాగే నీతా ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది.ఈమె నడిపే ఒక చిన్న స్కూల్ […]
