ముంబైలో నర్స్ ఉద్యోగం చేస్తున్నా కావ్య ధోబలే కు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎంతో ఆసక్తి ఆమె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సేంద్రియ వ్యవసాయం లోకి వచ్చింది.ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న షెడ్ లో ఆరు వర్మి కంపోస్ట్ బెడ్ లతో ఆమె తన వ్యాపారం మొదలు పెట్టింది.పట్టణంలో పెరిగి ఉద్యోగం చేసుకునే అమ్మాయి కి ఈ వ్యాపారం సరిపోదు అన్నారు రైతులు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి నెల 20 టన్నుల వర్మీ కంపోస్ట్ తయారు చేసే స్థాయికి ఆమె వ్యాపారం ఎదిగింది.మహారాష్ట్ర అంతట ఆమెకు ఖాతాదారులున్నారు.













