దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఐదు ప్రధాన విభాగాలకు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు మహిళలే. రైళ్ల ఆపరేటింగ్ విభాగంలో మేనేజర్ కె. పద్మజ. ప్రిన్సిపాల్ ఫైనాన్షియల్ అడ్వైసర్ టి. హేమ సునీత, రైల్వే పోలీస్ చీప్ గా అరోమా సింగ్ ఠాకూర్, ఆరోగ్య పర్యవేక్షణ లో మెడికల్ డైరెక్టర్ గా డాక్టర్ నిర్మలా నరసింహన్, వాణిజ్య విభాగంలో ఇతి పాండే. రాత్రింబగళ్ళు అప్రమత్తంగా రైళ్ల నిర్వహణ లో ఉన్నారు. భారతీయ రైల్వే నిత్యం వేల మంది ప్రయాణికులతో సరుకు రవాణాలతో సరైన సమయపాలనతో నడిపిస్తున్నారంటే ఈ మహిళల సమర్థత అని గర్వంగా చెప్పుకోవచ్చు.













