కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకొనే జరీ అంచు సికో, కాటన్ పట్టు చీరలు ఎంతో ప్రత్యేకం. అంచుల పైన ఏనుగులు అందమైన దారపు ఆకారాలు సహజసిద్ధమైన సాంప్రదాయ సొగసులతో ఎంతో అందంగా ఉంటాయి. వారసత్వంగా వస్తున్న ఈ నేతకలకు గతంలో జాతీయ పురస్కారాలు కూడా అందాయి. ఇక్కడ నేసే జిందగీ దుప్పట్లు, బర్డ్స్ ఐ తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, దోతీలు, మొదలైన ఉత్పత్తులతో ఎమ్మిగనూరు ఒక బ్రాండ్. చీర అల్లికలో అంచులని వివిధ రంగుల దారాలతో కలుపుతూ కుట్టు వేయటం ఎమ్మిగనూరు ప్రత్యేకత. ఈ చీరలకు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉంది.













