తిరుగులేని రచయిత్రి

తిరుగులేని రచయిత్రి

తిరుగులేని రచయిత్రి

మహారాజ్ లపతా లేడీస్ వంటి చిత్రాల రచయితగా చిన్నవయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకోంది స్నేహ దేశాయ్ గుజరాత్ నాటక రంగం నుంచి టీవీ లోకి అడుగుపెట్టిన స్నేహ మిసెస్ టెందూల్కర్ రచనతో రైటర్ గా పేరు నిలబెట్టుకుంది. గుజరాత్ ప్రాంతీయ టీవీ కి రాస్తున్నప్పుడే ఆమె మహారాజ్ సినిమాకు రాసే అవకాశం వచ్చింది.ఆ తర్వాత అమీర్ ఖాన్ కు ఆమె స్క్రిప్ట్ నచ్చి బిప్లవ్ గోస్వామి రాసిన కథ లపతా లేడీస్ కు పనిచేసే అవకాశం ఇచ్చారు.ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ టీవీ షోలు ఇంకోవైపు బాలీవుడ్ చిత్రాలతో స్నేహ దేశాయ్ సృజనాత్మక రచయిత్రిగా స్థిరపడింది.