స్కిజోఫ్రెనియా తో ఎంతోమంది ఇబ్బంది ఎదుర్కొన్న పూణే కు చెందిన 22 సంవత్సరాల రేష్మా వల్లియప్పన్ తన మానసిక రుగ్మత నుంచి బయటపడి కళా రంగం పైన దృష్టి పెట్టింది. బొమ్మలు గీస్తున్న కొద్ది ఆమె అనారోగ్యం మాయమైంది తనలాగే మానసిక సమస్యలు ఉన్న వారి కోసం రెడ్ డోర్ అని ఆన్ లైన్ వేదిక ఏర్పాటు చేసింది ఆ వేదిక మానసిక సమస్యలు ఉన్నవారికి మనసు విప్పి మాట్లాడుకునే ఒక కార్యస్థలం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సరైన చికిత్స లభిస్తుంది. అలాగే రేష్మ వేసిన చిత్రాలు మైండ్ ఆర్ట్స్ అనే ఆన్ లైన్ లో వేదిక లో చూడొచ్చు మై ట్రీస్ ఆఫ్ లైఫ్ ట్వీన్ బుద్దా వంటివి రేష్మా కు ఎంతో పేరు తెచ్చాయి రేష్మా వల్లియప్పన్ నేపథ్యంలో తీసిన ‘ఎ డ్రాప్ ఆఫ్ సన్‌షైన్’ అనే డాక్యుమెంటరీ లో రేష్మ నే నటించింది దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది.













