వ్యవసాయాన్ని కెరీర్ గా మలుచుకుంది అనుష్క జైస్వాల్ ఎకనామిక్స్ చదువుకున్న అనుష్క అన్న సాయంతో 2020 లో ఒక ఎకరం పొలం లో పాలి హౌస్ నిర్మించింది. ఇంగ్లీష్ కీరదోస రకరకాల క్యాప్సికం లు వేసింది. ఆశించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చింది మరో 5 ఎకరాల్లో క్యాప్సికం కీర తో పాటుగా చైనా క్యాబేజీ, పాలకూర సాగు మొదలు పెట్టింది. సేంద్రియ పద్ధతిలో ఏడాదికి 210 టన్నుల క్యాప్సికం పండిస్తూ టర్నోవర్ కోటి రూపాయలు సాధించింది. 30 మంది ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తోంది అనుష్క. మిద్దె తోటకూర ఆమెకు ఇష్టమైన వ్యాపకం.













