హద్దులేని ఆత్మశక్తి

హద్దులేని ఆత్మశక్తి

హద్దులేని ఆత్మశక్తి

జిందాల్ సా లిమిటెడ్ కంపెనీ యజమాని పి.ఆర్ జిందాల్ కూతురు స్మిను జిందాల్.11 సంవత్సరాల వయసులో కారు ప్రమాదానికి గురైన స్మిను వెన్నుకు గాయమై చక్రాల కుర్చీకే పరిమితం అయింది.అయినా ఎంతో శక్తి కూడదీసుకుని ఎం బిఎ చదివింది.తండ్రి వ్యాపారంలో ట్రైనీ గా చేరి అంచెలంచెలుగా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది.ఇనుము ఉక్కు పైపులైన్లు తయారీ రంగంలో అన్ని సమస్యలు ఎదురుకొని కంపెనీ టర్నోవర్ వేలకోట్లను పెంచింది.ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ 2025 జాబితాలో ఆమె పేరు చోటు చేసుకొంది స్వయం పేరు తో దివ్యంగులకు వృద్ధులు గర్భిణులకు సాయం చేసే ఎన్జీవో నడుపుతోంది స్మిను.