ది మ్యాజిక్ రూమ్ సంస్థ స్థాపించి దేశంలోని వివిధ ప్రాంతాల చేనేత కళాకారులను ఒక చోట చేర్చి వారి ఆర్థిక భరోసా కోసం కృషి చేస్తున్నారు దీపా కృష్ణన్. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా,గుజరాత్ బీహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాల చేనేత కళాకారుల వస్త్రాలు అలాగే పులియా కు చెందిన చేనేత జమ్దానీ, కచ్ కు చెందిన అజ్రాక్, అసోం నుంచి ఎరి సిల్క్, శాంతినికేతన్ నుంచి కాంత దుపట్టా, మధుబాని హ్యాండ్ ప్రింటెడ్ మొదలైన అపురూప వస్త్రాలను ఆన్ లైన్ లో విక్రయిస్తున్నరామె. ఈ సంస్థ ద్వారా 500 మంది కళాకారులకు నిలకడైన ఉపాధి లభిస్తుంది. దేశమంతా క్రాఫ్ట్ టూర్స్ వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు.













