Thursday, 01 Oct, 2026

మాటలు మల్లెపువ్వుల పరిమళంలా వుండాలి.

నీహారికా, అక్షరాలు పెర్చుకొంటు, అచ్చం మల్లె బెండు లాంటి పరిమళం వచ్చేలాగ మాట్లాడటం ఒక ఆర్ట్. మధురంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్న వేళ, అప్రియులు మాట్లాడకూడదు. ఎలాగంటే “ఎన్ని ప్రమాదాలు ప్రపంచంలో ఇప్పుడు మనం కూర్చున్న ఎ.సి గదిలో మంటలోచ్చాయినుకో, ఒక్కళ్ళం మిగలం”. అన్నారనుకో, ఇక అక్కడ కబుర్లు సాగుతాయి. ఇవి వస్తావాలు కావొచ్చు. కానీ ఆ సందర్భ ప్రేలాపన. మాటలు రాళ్ళ వాసన కురిసినట్లు వుండటం అంటే ఇదే. […]

ఈ ఎండలకి జుట్టు పొడిబారనివ్వద్దు.

కొన్ని సహజమైన పద్దతులు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన సౌందర్య పద్దతుల కంటే ఈ మిశ్రమం జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుందని జుట్టు పొడిబారకుండా కాపాడుతుందని నిపుణులు చెప్పుతున్నారు. మూడు స్పూన్ల గొరింటాకు పొడి తో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగ తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే నాని మెత్తబడుతుంది. అరటి పండు మిక్సిలో వేసి గ్రియిడ్ చేయాలి. […]

వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు.

హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా ప్యాక్లు, శీతల పానీయాల డబ్బాలు చెక్క వస్తువులు ఒకటేమిటి మనం ఇంట్లో వాడేసి పారేసిన ప్రతి వస్తువు తోనూ అందమైన కళాకృతులతో చేస్తారు. వీటితో పర్సులు, కాండిల్ హోల్డర్లు, పెన్ స్టాండులు, అందమైన లాంతర్లు, ఫ్లవర్ వాజ్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు, ఇలా చెప్పుకుంటూ పొతే వందల కొద్ది […]

ఎప్పటికీ అదే అందం.

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రభావం చర్మం పైన శారీరం పైన కనబడుతుంది. చర్మం పైన ఏర్పడే ముడతలు, గీతాలు, పెరిగే వయస్సుని చూపిస్తాయి. మరి అలాంటివి రాకుండా ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటే ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్ గా ఉండవచ్చు. వయస్సు ప్రభావం ముందుగా జుట్టు పైన పడుతుంది. జుట్టు వుడటం మొదలు పెడుతుంది. ఈ సమస్య పోయేందుకు నాణ్యమైన కండీషనర్స్ సహజ సిద్ధమైన పద్దతుల్లో జుట్టుని పోషించుకోవడం చాలా ముఖ్యం. అలాగే వయస్సు చెప్పే […]

వీటి వల్ల పిల్లల్లో స్పీచ్ డిలే

పిల్లలు ఏడిస్తే చాలు అమ్మానాన్నలు వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టేస్తారు. ఏముంది ఇక పిల్లల ఆటలన్నీ అక్కడితో బంద్. గంటల తరబడి సెల్ ఫోన్, టాబ్ ల తో కాలక్షేపం అయితే ఇలా ప్రపంచంతో పని లేకుండా ఎప్పుడూ సెల్ ఫోన్లు, టాబ్లు, ఐపాడ్ ల తో ఆడటం వల్ల వారికి మాటలు ఆలస్యంగా వస్తాయని ఇప్పుడొక స్టడీ రిపోర్టు చేఅపుతుంది. మాటలు రాకపోగా, కమ్యునికేషన్ డిలే అంశం పై చేసిన అధ్యాయినంలో పిల్లలు ఎంత […]

ఈ సీజన్ కు తగ్గట్టు ఎంచుకోండి.

మేమిలాగే వుంటాం, మాకిలాగే బావుంటుంది అన్న స్టాండర్డ్ ఒపీనియన్స్ ఫ్యాషన్స్ కనే కాదు. ఎప్పుడు ఒకే తరహా దుస్తులు బావుండవు. కాలానికి అనుగుణంగా వార్డ్ రోబ్స్ లో మార్పులు తెచ్చుకోవాల్సిందే. అలంకరణ వస్తువులు కాస్త భిన్నంగా వుండాల్సిందే. ఎండలు మండిపోతుంటే బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. వదులుగా వుండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుర్తీ, ధోతిలు, పలజోలు, జంప్ సూట్లు, నూలు చీరలు వంటివి ఈ కాలానికి చెక్కని ఎంపిక. అలాగే సిల్క్, షిఫాన్లు, క్రేప్ ల తో […]

సన్ స్క్రీన్ తో సమస్యలు

సాధారణంగా బయటికి పోయే ముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లయ్ చేస్తారు చాలా మంది. సూర్య కిరణాల భారి నుంచి చర్మాన్ని కాపాడుకొనే పద్దతుల్లో ఇంకొకటి. అయితే శారీరం సహజంగా ఉత్పత్తి చేసే విటమిన్ డి ని ఈ సన్ స్క్రీన్  అడ్డుకుంటుందని పరిశోధకులు చెప్పుతున్నారు. రంగు తక్కువగా వున్న వారి శరీరం విటమిన్-డి ఉత్పత్తిని తక్కువగా వున్న వారి శరీరం విటమిన్ డి ఉత్పత్తిని తక్కువగా చేసుకోగలుగుతుందని, ఈ లోషన్ల వాడకం వల్ల విటమిన్ డి […]

పర్లేదు ఆ చిరాకు ఇట్టే పోతుంది.

నెలసరి ముందు నుంచే కొందరికి భావోద్వేగాల పరమైన చిరాకు కోపం వంటి  సమస్యలు వేధిస్తాయి. ఈ సమయంలో నడుము, కాళ్ళ నొప్పులు భాదిస్తాయి. పొట్ట ఉబ్బరంగా వుంటుంది. ఏమీ తినాలి అనిపించదు. వీటి నుంచి ఉపసమనం కోసం ముందుగా రిలాక్స్ అవ్వాలి. విశ్రాంతి తీసుకొన్న గదిలో ఒక మూల తాజాగా వాసనలోచ్చే ముంచి పూల గుత్తిని వుంచుకోవాలి. పరిమళాలు మనస్సుకి ఆహ్లదాన్ని ఇస్తాయి. అలాగే మంచి సువాసన వచ్చే కోవొత్తి వెలిగించినా పర్లేదు. నొప్పుల ఉపసమనానికి హీటింగ్ […]

సహజమైన సువాసనలివి.

ఇల్లంతా సువాసనలోస్తే బావుంటుంది. ఎంత ఖరీదైన స్ప్రేలు కొట్టినా కాసేపట్లో మళ్ళి మాములుగానే వుంటుంది. ఈ సారి కొన్ని సహజ సిద్ధమైన పదార్ధాల వైపు చూడండి. నేలను తుడుస్తున్నప్పుడు. నీటిలో రెండు చుక్కలు నిమ్మ గడ్డి నూనె వేస్తె ఈగలు, దోమలు ముసరవు. చక్కని వాసనా వస్తుంది. లేదా గిన్నె నీళ్ళల్లో రెండు స్పూన్లు నిమ్మ గడ్డి నూనె వేసి స్టవ్ పైన పెట్టి మరగానిస్తే ఇల్లంతా సువసనే. అలాగే దాల్చిన చెక్క పొడిని సాంబ్రాని పొగలాగా […]

శరీరం తీరును బట్టే దుస్తుల ఎంపిక.

ఏ సినిమాలోనో, ఏ మాగజైన్ కవర్ పేజీపైనో చూసి, ఒక సినీ యాక్టర్ వేసుకొన్న డ్రెస్సునో, ఏ మోడల్ ధరించిన నాగనో చూసి మోజు పడతారు. కానీ అందరికి ఒకే రకమైన శరీరాకృతి వుండదు. ఒకళ్ళకు నప్పినట్లు ఇంకొక్కళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు, బరువు ఎన్నో తేడా లేకుండా ఉంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా వుంటే అన్ని రకాల వస్త్ర శ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా వుంటే […]

తుమ్ము ఆపేరో సమస్యే

పదిమంది మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం జరుగుతుంటేనో, సామాజిక కార్యక్రమాల్లోనో, సెంటిమెంట్ తో ఎవరైనా ఎమన్నా అనుకొంటారానో తుమ్ము వస్తుంటే బలవంతంగా ఆపెస్తారేమో కానీ అలా తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా ప్రమాదం. తుమ్మొచ్చినప్పుడు వెలుపలికి వచ్చేగాలి గంటకు వంద మైళ్ళ వేగంతో వస్తుందిట. దాన్ని బలవంతంగా ఆపేస్తే ముక్కులో కార్డిలేడ్ ఫ్రాక్చర్లు కావడం, ముక్కులోంచి రక్తం కారడం, కర్ణభేరి చిట్లడం, వినికిడి లోపం, తాత్కాలికంగా మొహం వాడిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటివి జరక్కుండా […]

రోజుకో మామిడి పండు

మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. […]

మొలకెత్తిన గోధుమలతో గోళ్ళకు బలం

గోళ్ళు విరిగిపోతూ వుంటాయి. మెత్తగా వంగిపోతాయి. అవి బలంగా, ఆరోగ్యంగా, అందంగా వుంటే వాటిని అలంకరించే ఎన్నో సాధనాలు మార్కెట్ లో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు గోళ్ళు ధృడంగా అందంగా వుండేలా చేస్తాయి. అందులో భాగంగా మొలకెత్తిన గోధుమలలో విటమిన్ బి6, విటమిన్ ఇ, ప్రోటీనులు, జింక్ వుంటాయి. ఈ మొలకల్ని యధాతధంగా తినలేకపోతే పూరీల పిండిలో, సెరల్స్లో, పెరుగులో, సలాడ్ లో, పాన్ కేక్లో, ఫ్రూట్ కేక్ లో కలుపుకుని తాగచ్చు, తినచ్చు. వాటిని […]

జామ పండును కొరికి తింటే మంచిది

జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ, చక్కర పాళ్ళు ఎక్కువ. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. విటమిన్ బి6, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో మెదడులో న్యురాన్ల పనితీరు బావుంటుంది. రక్తం లో కొలెస్టరాల్ పాళ్ళు తగ్గిస్తుంది. అంతే […]

ఎఫ్.ఐ.ఆర్ యాప్ తో క్షేమం

ఇంట్లోంచి కాలు బయట పెడుతూ వుంటే భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. ఏ క్షణం ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఆఫీస్ నుంచి కాసేపు ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అలాగే ఏ ఆటో ఎక్కినా భద్రత విషయం భయమే. అనుకోని అవాంతరమో, ఆగంతుకుల దాడో ఎదురైతే ఏమిటి పరిస్థితి? అలాంటి సమయంలో భయపడకుండా ఫోనులో FIR అనే యాప్ వుంటే మంచిది. ఈ యాప్ ని డౌన్లోడ్ […]

ఎక్కువ కేలరీలుంటే పక్కన పెట్టాలి

పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు. తీరా కళ్ళ ఎదుట ఇష్టమైన పదార్ధాలు కనిపించగానే హాయిగా తినేసి, తర్వాత తీరిగ్గా విచారించటం అందరి అనుభవంలో వచ్చేదే. అసలు శ్రద్ధగా, నిష్టగా సన్నబడి తీరాలి అని నిశ్చయించుకుంటే ముందుగా ఇష్టమైన పదార్ధాల్లో వేటిలో ఎక్కువ కేలరీలు వుంటే వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదాహరణకు బ్రెడ్ తినే […]

ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక […]

చెప్పినట్లు వినే డబ్బాలు

ఏదో ఒకటి ఎదురుగా కనబడేది తినేయాలని నోరు లాగేస్తూ కంట్రోల్ పోతూ వుంటే కిచెన్ సేఫ్ బాక్సుల వైపు చూడాలి. సాధారణంగా ఏవైతే తినకూడదు అనుకుంటామో వాటి వైపు మనసు లాగుతూ వుంటుంది. చాక్లెట్లు, బిస్కెట్లు ఏవి చూసినా చిన్న పిల్లల్లాగే మనం కూడా మనసు పారేసుకుంటాం. ఎటూ పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇక ఎక్కువగా తినద్దు, పిల్లలకు ఇవ్వద్దు అనుకునే పదార్ధాలు ఈ కిచెన్ సేఫ్ డబ్బాల్లో పెట్టి తాళం వేస్తే చాలు దీని మూత […]