Thursday, 01 Oct, 2026

ప్రాచీన సంప్రదాయ రూపాలు చేనేతలు

ఆదిత్య బిర్లాకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ‘ఆద్యం హ్యాండ్‌వోవెన్’ హ్యాండ్లూమ్స్  బ్రాండ్ అంబాసిడర్ ధూళిపాడ. భుజ్,బదోహి,మిర్జాపూర్,గద్వాల్ కాశ్మీర్,పోచంపల్లి, వారణాసి,అంగార,పులుగుర్త,వెంకటగిరి వంటి ప్రాంతాల్లోని కళాకారుల తో కలిసి పని చేస్తుంది ఈ సంస్థ. భారతదేశపు ప్రత్యేకత అనిపించుకున్న నేత సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ బ్రాండ్.కేవలం ఖరీదైన వస్త్రాలు భద్రపరిచి దాచుకోవటానికి కాకుండా చక్కగా రోజువారి జీవితంలో ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించుకునేలా సృష్టిస్తోంది.ఈ బ్రాండ్. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న శోభిత మాట్లాడుతూ వస్త్రాలు భారతీయ మహిళ స్వరానికి ప్రతినిధులు అంటుంది .ఆచారాలు వంట చేయడం,నృత్యం చేయడం వంటి అన్ని సామూహిక కార్యక్రమాల్లో కూడా మన అందమైన వస్త్రాలు ధరించాలి మహిళలు ఎక్కడైనా ఒక చోట కలిసినప్పుడే ఆనందం స్వేచ్ఛ సహజత్వం కలిసి ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈ హ్యాండ్ లూమ్స్  ఈ సందర్భాలను ఎంతో గొప్పగా అలంకరిస్తారు అంటుంది శోభిత. వస్త్ర ప్రేమికుల విశ్వాసాన్ని చూరగొనే లా అందమైన వస్త్రాలు మా హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత అంటుంది శోభిత. హస్తకళలకు ఉన్న విలువను కొత్త దృష్టితో చూస్తున్నారు ఈ తరం యువత .మన ఇళ్లలో మన వస్త్రధారణలో చరిత్ర గుర్తుకు తెచ్చే ప్రక్రియకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. విభిన్న రూపాలు రంగులతో వస్త్రాలు మన ప్రాచీన సంస్కృతికి అర్థం చెప్తున్నాయి అంటుంది శోభిత.అందమైన దారాలతో అపూర్వమైన రంగులతో ఈ వస్త్రాలు మిమ్మల్ని ప్రత్యేకంగా చూపెడతాయి అంటుంది శోభిత.

Leave a Reply