అందాల సుందరిగా తెలంగాణ అమ్మాయి
రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విభాగంలో కిరీటాన్ని గెలుచుకుంది.మిస్ ఎర్త్ పోటీ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన విజేత పర్యావరణానికి ప్రతిరూపం.ఆమెను మిస్ ఎర్త్ అంటారు రెండవది మిస్ ఎయిర్ గాలి స్వచ్ఛతకు సంకేతం.మూడు మిస్ ఎర్త్ వాటర్ నీటి పరిరక్షణ కు సంకేతం ,నాలుగు మిస్ ఎర్త్ ఫైర్ శక్తికి సంకేతం.ప్రీతి మిస్ ఎర్త్ వాటర్ విభాగంలో విజేత. ప్రీతి ఇదే పోటీల్లో మిస్ కాంజనియాలిటీ అవార్డును కూడా తీసుకుంది. అందాల పోటీల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక ప్రత్యేకమైన ఈ సబ్ టైటిల్ను స్నేహపూర్వక ప్రవర్తన,మంచి వ్యక్తిత్వం ఆధారంగా ఎంపిక చేస్తారు దీన్ని కొన్ని పోటీల్లో ఫ్రెండ్షిప్ అని కూడా పిలుస్తారు .పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ప్రీతి క్రమశిక్షణ శ్రమకు ఓర్చుకునే తత్వం తోనే ఈ అవార్డు సాధించుకున్నది.ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక యూనివర్సిటీ లో యోగా విభాగంలో మాస్టర్స్ చేస్తోంది. యోగా ట్రైనీగా పనిచేస్తుంది కూడా. జాతీయ స్థాయి యోగా చాంపియన్ గా ఎంపికై తన శారీరక మానసిక శక్తి ని కూడా నిరూపించుకున్నది ప్రీతి.. 2023లో మిస్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మిస్ ఊర్వసి పోటీల్లో కూడా గెలుపొందింది ప్రీతి.
