• రుచులు మరచిపోతేనే ఆరోగ్యం.

    ఆహార పదార్దాలో ఇది తినను, నాకు నచ్చాదు అన్న పద్దతి పోయినట్లే. అన్ని రకాల పదార్ధాల నుంచి శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లాభిస్తాయి కనుక అన్ని…

  • పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు. తీరా కళ్ళ ఎదుట ఇష్టమైన పదార్ధాలు కనిపించగానే హాయిగా తినేసి, తర్వాత తీరిగ్గా విచారించటం అందరి అనుభవంలో వచ్చేదే. అసలు శ్రద్ధగా, నిష్టగా సన్నబడి తీరాలి అని నిశ్చయించుకుంటే ముందుగా ఇష్టమైన పదార్ధాల్లో వేటిలో ఎక్కువ కేలరీలు వుంటే వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఉదాహరణకు బ్రెడ్ తినే అలవాటు వుంటే వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ట్రై చేయాలి. చక్కర రెండు చెంచాలు వేసే చోట ఒక స్పూన్ వాడుకోవాలి. వంట నూనె మార్చాలి. ఆలివ్ ఆయిల్ వినియోగం పెంచాలి. పదార్ధాలు కొత్తగా వండాలి. రుచి కోసం ఒకటి రెండు పదార్ధాలు కలుపుతూ నూనె తక్కువతో తినాలి. ఇలాంటి ట్రిక్స్ తో కడుపు మాడ్చుకోకుండా సన్నబడచ్చు.

    ఎక్కువ కేలరీలుంటే పక్కన పెట్టాలి

    పాత ఫోటోలు చూస్తూ వుంటే దిగులేస్తుంది. ఎంత సన్నగా, నాజుగ్గా, తేలిగ్గా వున్నాం అనుకుంటారు. అప్పుడిక ఏది తినలనిపించదు. బాగా డైట్ చేసి సన్నగా అయిపోవాలని తీర్మానించుకుంటారు.…

  • డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి. 20 శాతం అనేఅది వారానికో సారి లేదా ఏ పది రోజులకో సారి ఇచ్చుకోవలసిన రిలాక్షేషన్ అంటే తప్పని సరిగా హాజరయ్యే పెళ్ళిళ్ళు, తప్పించుకోలేని ఫంక్షన్లు, విందుభోజనాలు. ఇతరాత్ర ఏవయినా తినాల్సి వచ్చేవాన్ని 20 శాతం తోనే ముగించాలి. ఎప్పుడెలా రిలాక్షేషన్ ఇవన్నీ ఎలా వున్నా ఏ సూత్రం వర్తించానిది ఒక్క వ్యాయామానికి దీనికి సడలింపు రూల్స్ వుండవు ఎక్కువ తిన్నా, నియమం బ్రేక్ చేసినా, రిలాక్సేషన్ అన్న వ్యాయామం మాత్రం వాయిదా పడకూడదు. రోజుకు కనీసం అరగంట ఆ కార్యక్రమం కోన సాగించాలి. వారానికి ప్రతి రోజు 40,50 నిముషాలు వ్యాయామం చేసి 80 శాతం తగు మోతాదులో తింటే శరీరపు స్థితి మన కంట్రోల్ లో వుంటుంది.

    ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది

    డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే…

  • స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా వుండేలా చూసుకుంటుంది. సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళదు. కెమికల్స్ కలిసిన ఉత్పత్తులు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కు దూరంగా వుంటుంది. పాలను యాస్ట్రీంజెంట్ గా వాడుతుంది. సున్ని పిండి పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. ప్రతి రోజు రెండు గంటలకొ సారి కొబ్బరి నీళ్ళు తాగుతుంది. ఐడు సార్లు లైట్ మీల్స్, బ్రేక్ ఫాస్ట్ లో మూడు ఎగ్గ్ వైట్స్, తృణ ధాన్యాలతో చేసే ఫారిద్జ్ లంచ్ లో బ్రౌన్ రైస్, కూరగాయాలు, పప్పు, పెరుగు తో భోజనం చేస్తుంది. చికెన్,ఎగ్స్ చేపలు, వెజిటేబుల్స్, చపాతీ భోజనం లో ఉండేలా చూస్తుంది. ఎప్పడు వీలైతే అప్పుడు నట్స్ తింటుంది.

    అందాల రహస్యం వీటి తోనే

    స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు…

  • గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ ఆరోగ్యాంగా ఉండాలన్న ఆ సమయంలో కొన్న పోషకాలు కావాలి. కానీ అది కూడా అదనంగా తీసుకునే 350 క్యాలరీల్లోనే అందేలా చూసుకోవాలంటున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ మనకు రకరకాల పదార్ధాలు తినాలని కోరుకుంటుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి మితంగా తినాలంటారు. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దీ కొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. రెండు పూట్లా భోజనం తో పాటు రెండు మూడు విడతలుగా చిరు తిండ్ల అందులో పాలు పెరుగు గుడ్లు పనీర్ సెనగలు పెసలు బొబ్బర్లు ఇలా ఎన్నో వెరైటీస్ కలిసి తీసుకోవాలి . 350 కేలరీలు అంటే 300 గ్రాములు అదనంగా అన్నం ఒక చిన్న చపాతీ ఒక గుడులు ఒక పండు కలిపి తీసుకున్నంత ఆహారం. మామూలుగా తినేదానికి ఈ మాత్రం చేర్చి తింటే బిడ్డకు తల్లికి సంపూర్ణ పోషకాలు అందుతాయి.

    ఇద్దరి కోసం అమ్మే తినాలి

    గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం  తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ…