Tuesday, 29 Sep, 2026

ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం

ఆర్థిక భరోసా అంటే ఉన్నతంగా కనిపించడం ,సంపాదించింది నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం కాదు సంపాదన పైన పట్టు ఉంచుకోవడం అంటారు నిపుణులు.ఎక్కువగా సంపాదిస్తేనే ఆర్థికంగా సురక్షితంగా ఉండగలమని నమ్ముతారు కానీ అది వాస్తవం కాదంటారు ఆర్థిక నిపుణులు జీతం రాగానే పొదుపు, ఆరోగ్యం ,పొదుపు కింద కొంత డబ్బు పక్కన పెట్టాకనే మిగిలిన దాన్ని ఖర్చు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. అనారోగ్యం ఉద్యోగం పోవడం,కుటుంబ అవసరాలు అత్యవసర రిపేర్లు, ఇట్లాంటివి ఎప్పుడైనా రావచ్చు.వీటికి సిద్ధంగా ఉండాలంటే కచ్చితంగా అత్యవసర నిధి ఉండాలి .దాన్ని తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి.ఒకసారి జీతం పెరిగితే దానికి తగ్గట్టుగా పొదుపు చేస్తేనే దీర్ఘకాలంలో సాయపడుతుంది.క్రెడిట్ కార్డులు అస్సలు తీసుకోవద్దు. ప్లానింగ్ లేకుండా ఎలాంటి షాపింగ్ లు చేయొద్దు. బోనస్ లు ఇంక్రిమెంట్లు రిఫండ్లు వాటన్నిటిని జాగ్రత్తగా పొదుపు  చేసుకొని జాగ్రత్త పడమంటున్నారు ఆర్థిక నిపుణులు.

Leave a Reply