• సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో పత్రాలు సహజంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అప్పుడు అందం మేకప్ సన్నగా ఉండటం. ఖరీదైన బట్టలు ధరించటం పక్కన పట్టేసి కెమెరా ముందుకు వెళ్ళిపోతారు హీరోయిన్లు హీరోలు కూడా. ధమ్ లగాకే పైసా సినిమాలు భూమీ ఫెడ్నేకర్ సౌత్ ఖాన్ మాఫ్ సినిమా లో ప్రియాంక చోప్రా డర్టీ పిక్చర్ లో విద్యా బాలన్ త్రీ ఇడియట్స్ లో కరీనా కపూర్ అలాగే దంగల్ సినిమాకోసం అమీర్ ఖాన్ వళ్ళు బరువు పెంచుకుని మరీ నటించారు. అవార్డులతో నిండా మునిగిపోయిన మన పాత తరం హీరోయిన్స్ శారద సావిత్రి వంటి మహానటుల్ని మనం సన్నగా తెల్లగా వున్నారని చూశామా ? ఒక మనిషి అందం ఆమె లేక అతను చేసే పనుల్లో మనుషుల్ని ప్రేమించటంలో త్యాగంలో దాత్రుత్వంలో మనసు నిండిన కరుణ తో ప్రపంచాన్ని లాలించే నవ్వులో ఉంటుంది. దంగల్ సినిమా కోసం 97 కిలోలు బరువు పెరిగిన అమీర్ ఖాన్ తో మనకు మల్ల యోధుడు మహావీర్ ఫోగట్ ప్రత్యక్షం అవుతాడు. ఎవరి మొహం చుస్తే మన పెదవుల పై చిరునవ్వు వస్తుందో ఆ వ్యక్తి నిజమైన సౌందర్య రూపం కాదంటారా ?

    అందమంటే రంగూ శరీరపు లావణ్యమేనా

    సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో…

  • రెజ్లర్ గీతాఫోగట్ ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్ ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా లను పదివేల మందిని ఆడిషన్ చేసి ఎంచుకొన్నారట. వీళ్లకు రెండేళ్లపాటు కుస్తీ పట్టు నేర్పించారు. అమీర్ ఖాన్ భార్యగా టీవీ నటి మల్లికా షెరావత్ నటించారు. ఈ దంగల్ సినిమా నలుగురు ఆడపిల్లలకు కుస్తీ నేర్పించి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకునేంతగా తీర్చిదిద్దిన ఒక రెజ్లర్ నిజ జీవిత గాధ. అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం 90 కిలోల వెయిట్ పెరిగాడట. ఈ సినిమాలో హాని కారక్ బాప్య పాటని అందులో స్ట్రిక్ట్ అమీర్ ఖాన్ ని చూసి ఎంజాయ్ చేయండి. .

    దంగల్ సినిమా రాబోతోంది

    రెజ్లర్ గీతాఫోగట్  ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్  పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల…